Friday, March 07, 2014

What are Shodashopacharas?,షోడశోపచారాలు అంటే ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  

 Q : What are Shodashopacharas?,షోడశోపచారాలు అంటే ఏమిటి?


Ans : దేవుడు , ప్రకృతి శక్తీ. ప్రకృతి లో ఉండే ప్రతి భాగమందు నిండి యున్నాడు. మీరు ఏ రూపమున ధ్యానించిన, ప్రార్ధించిన ఆ రూపమున మిమ్ములను ఆదుకొనును . మీరు చేయు కార్యములందు, మీ జీవనమునందు , మీకు తోడై, నీడై మిమ్ములను రక్షించును. దేవుని యెడల విశ్వాసము లేకుండా ... సంస్కృతి, పూజలు, ప్రార్ధనలు, సంప్రదాయాలు  పాటించిన వ్యర్ధము, నిరుపయోగము. కావున అందరు మొదట దేవుని యెడల నమ్మకము, భక్తి కలిగి ఉండవలెను , తప్పనిసరి అదే శ్రేయస్కరము.

 మీరు చేయవలసిన పని, ప్రయత్న లోపము లేకుండా చేయండి, ఫలితము భగవంతునికి వదిలి వేయండి. మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ ప్రతిఫలము పొందుటకు, భగవంతుడిని ఆరాధించండి

భగవంతునికి చేయు ఉపచారాలే షోడశోపచారాలు.........భగవంతునికి చేయు సేవలే షోడశోపచారాలు.
ఈ సేవల యందు  భగవంతుని మనం అతిధి గా భావిస్తాము.  ఇవి 16----భక్తుడు తన ఆత్మ తృప్తి కోసం, అంత మహా శక్తీ ని దగ్గరనుండి సేవించే  శక్తీ లేక, భగవంతుని ఆత్మ రూపాన, ప్రసన్నం చేసుకుని, సేవించుటయె  షోడశోపచారాలు.
1. ఆహ్వానించుట = ఆవాహనం  అనే ఉపచారం.
2. ఆసన ఇవ్వటం = ఆసనం అనే ఉపచారం.
3. కాళ్ళకు నీళ్ళు ఇవ్వటం  = పాద్యం అనే ఉపచారం.
4. చేతులకు నీళ్ళు ఇవ్వటం = అర్ధ్యం అనే ఉపచారం.
5. త్రాగుటకు నీళ్ళు ఇవ్వటం = ఆచమనీయం అనే ఉపచారం.
6. స్నానమునకు నీళ్ళు ఇవ్వటం = స్నానం అనే ఉపచారం.
7. వస్త్రం ఇవ్వటం = వస్త్రం అనే ఉపచారం.
8. యజ్ఞోపవీతం ఇవ్వటం = యజ్ఞోపవీతం అనే ఉపచారం.
9.  గంధం ఇవ్వటం = ఇదొక, ఉపచారం.
10. పుష్పం  ఇవ్వటం =ఇదొక ,ఉపచారం.
11. సుగంధం కొరకు ధూపం = వేరొక ఉపచారం.
12. దీపం వెలిగించటం ( మంగళ హారతి ) = ఇదొకఉపచారం.
13. నైవేద్యం సమర్పించటం = వేరొక ఉపచారం.
14. తాంబూలాన్ని సమర్పించటం = వేరొక ఉపచారం.
15. నమస్కారం సమర్పించటం = ఇదొక ,ఉపచారం.
16. ఉద్వాసనం సమర్పించటం =ఇదొక ,ఉపచారం  .

వీటితో పూజ ముగియును . ఇవన్ని భక్తి శ్రేద్దలతో చేసేవి కాని యాంత్రికం గా  చెసేవికావు.

  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...