ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: చర్మంపై గోళ్లతో గీస్తే తెల్లని గీతలు పడతాయి ఎందుకు?
జవాబు: ఇలాంటి అనుభవం సాధారణంగా చలికాలంలో గమనిస్తారు. ఎండాకాలం ఇలాంటి అనుభవం దాదాపు రాదనే చెప్పవచ్చు.
చలికాలం బయట ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రతకన్నా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరం నుంచి పదేపదే ఉష్ణం బయటివైపునకు వెళితే మన శరీర ఉష్ణోగ్రత పడిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే యంత్రాంగం చర్మం పై పొరల్లో రక్త ప్రసరణను తగ్గిస్తుంది. చెమట ఏ మాత్రం రాదు. దరిమిలా చర్మం పై పొర చాలా పొడిగా ఉంటుంది. చర్మంపై ఉన్న ఎపిథీలియా అనే పలుచని పొర దాదాపు ఎండిపోయిన పొరలాగే ఉంటుంది. ఇలాంటి స్థితిలో చర్మాన్ని గోళ్లతో గీకినట్త్లెతే ఈ ఎపిథీలియ పొర చిందరవందరగా చిరిగిపోయి చిన్నచిన్న ముక్కలుగా చర్మంపై పేరుకుంటుంది. ఈ చిన్న ముక్కల వల్ల చర్మంపై పడ్డ కాంతి అన్నివైపులకు పరిక్షేపణం చెందుతుంది. పరిక్షేపణ పొందిన కాంతి వల్లనే ఆ ప్రాంతంలో తెలుపు రంగు కనిపిస్తుంది.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...