ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: పాతపుస్తకాలు ఒక రకమైన వాసన వస్తాయి. ఎందుకు?
జవాబు: గాలి చొరబడని బీరువాలలో పుస్తకాలను ఎక్కువ కాలం ఉంచితే వాటికి ఒక ప్రత్యేకమైన వాసన సంక్రమిస్తుంది. దీనికి కారణం ఫంగస్ లాంటి వ్యర్థ పదార్థాలు, మ్యూకార్, రిజోవస్, ఐస్పరాగస్ పెన్సీలియా లాంటి ఫంగస్ జాతులే. ఇవి కొయ్య, కాగితంలాంటి కర్బన సంబంధిత పదార్థాలపై పెరుగుతాయి. ఈ ఫంగస్ ఒక విధమైన ముక్క వాసనను కలగజేయడమే కాకుండా ఆయా వస్తువులను శిథిలావస్థకు చేరుస్తుంది. పాత పుస్తకాల కాగితాలు పసుపు రంగులోకి మారిపోయి, పొడిపొడిగా రాలిపోవడానికి కారణం ఇవే. ఫంగస్‌కు సంబంధించిన పదార్థాలు కొంత వరకు విషపూరితమే కాకుండా మనదేహంపై ఎలర్జీని కూడా కలుగచేస్తాయి. శ్వాసకోశానికి సంబంధించిన 'ఆస్తమా' లాంటి వ్యాధులను ఎక్కువ చేస్తాయి. ఈ ప్రమాదాలను అరికట్టడానికి ఫంగస్ అంతగా పెరగడానికి అనుకూలంగా లేని ప్రదేశాలలో అంటే గాలిలో తేమ లేకుండా ఉండే పొడిగా చల్లగా ఉండే ప్రదేశాలలో పుస్తకాలను ఉంచాలి. వంటసోడా, సబ్బు ముక్కలు, కాఫీ పొడి పుస్తకాల బీరువాల్లో ఉంచితే అవి ఫంగస్ వల్ల వెలువడే వాసనను, గాలిలో తేమను హరిస్తాయి.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ==========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...