కాన్వెంటు చదువుల పుణ్యమాని మన పిల్ల లకి తెలుగు రాకుండా పోతోంది. పైగా ఈ రోజుల్లో తెలుగు రాదని చెప్పడం ఒక ఫాషన్ కూడా. తెలుగు అక్షరాలు కూడబలుక్కుని చదవడమే కష్టమైన తరుణంలో మన సంస్కృతీ సంప్రదాయాలు ఎలా తెలుస్తాయి?!
ఎంతసేపూ 'టామ్ అండ్ జెర్రీ' లాంటి కార్టూన్ చిత్రాలు లేదంటే 'హారీపాటర్' లాంటి సినిమాలే తప్పిస్తే 'కాశీమజిలీ కథలు', 'నీతిచంద్రిక' లాంటి అద్భుతమైన కథల గనులు ఉన్నాయని కూడా ఈ తరంవారికి తెలీదు. ఇక వేదాలు, పురాణ ఇతిహాసాలు, చారిత్రక అంశా ల్లాంటివేం బోధపడ్తాయి? ఈ పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్‌కి పెద్ద పీట వేయక తప్పదు, నిజమే. అయినా మన గురించి మనకు తెలీకపోతే ఎలా?! ఈ లోటు తీరాలంటే ఇళ్ళల్లో తల్లిదండ్రులు, స్కూళ్ళల్లో టీచర్లు శ్రద్ధ తీసుకుని పిల్లలతో కథల పుస్తకాలు చదివించాలి. అప్పుడే ఆశించిన ఫలితం వస్తుంది.
ప్రతి ఒక్క తెలుగు బిడ్డ తప్పనిసరిగా తెలుగు ప్రాథమిక స్థాయినుండే నేర్చుకోవాలి. అన్ని సబ్జెక్ట్ లూ తెలుగులోనే నేర్చుకుంటే మంచి అవగాహన , సబ్జెక్ట్ మీద పట్టు వస్తుంది. అలాగని తెలుగేతర ప్రజలతో మాట్లాడాలంటే ఇండియాలో ఉన్న అన్ని భాషలూ నేర్చుకోలేము. అందరికీ కామన్ గా ఉన్న భాషనే నేర్చుకోవాలి ... అదే మన ఇండియన్ ఇంగ్లిష్ .. తప్పనిసరిగా నేర్చుకోవలసిందే.
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...