ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ఫ్ర : ఆవుపాలు కంటే గేదెపాలు తెల్లగా ఉంటాయెందుకు ?
జ : పాలు అన్నీ తెల్లగానే ఉంటాయి. అందుకు కారణము కాల్సియం ఎక్కువగా ఉండడము వలన. ఇక్కడ ఆవుపాలు ... గేదె పాలు కంటే కొద్దిగా పచ్చగా కనిపిస్తాయి. మీరు నిశితముగా గమనిస్తే కనబడుతుంది. దీనికి కారణము ఆవుపాలలో బి-కెరోటీన్ అధిక మోతాదులో ఉండడము వలనే.గేదె పాలలో తెల్ల రంగు కి కారణము అధికము గా కాల్సియం ఉంటుంది.
- ==========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...