ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న:పొలాల్లో బురద ఉన్నా బరువైన ట్రాక్టర్లు సాఫీగా పోతుంటాయి. అదే తక్కువ బరువున్న రైతుల పాదాలు మాత్రం కూరుకు పోతుంటాయి. ఎందుకు?
జవాబు: ఇలా జరగడానికి కారణం బరువుకి, ఒత్తిడి లేక పీడనంకు మధ్యగల సంబంధమే. ఒక చదరపు సెంటీమీటరు ప్రదేశంపై పనిచేసే బరువును పీడనం లేక ఒత్తిడి అని అంటాం. ట్రాక్టరు బరువు రైతుకన్నా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఆ బరువు ఎక్కువ వైశాల్యం ఉన్న దాని అడుగుభాగం అంతా వ్యాపించి ఉంటుంది. అందువల్ల భూమిపై ట్రాక్టరు ప్రయోగించే పీడనం విలువ తక్కువగా ఉంటుంది. ఇక రైతు బరువు తక్కువగా ఉన్నప్పటికీ, ఆ బరువు తక్కువ వైశాల్యం ఉన్న అతని పాదాలపై కేంద్రీకరింపబడి ఉంటుంది. దాంతో అతను ప్రయోగించే పీడనం ఎక్కువగా ఉంటుంది. అందువల్లే బురదలో పాదాలు కూరుకుపోతాయి. ఒక ప్రదేశంలో ఒక వస్తువు దిగబడడానికి కారణం అది ఆ ప్రదేశంపై ప్రయోగించే పీడనమేగానీ, బరువుకాదు.
- ప్రొ||ఈ.వి సుబ్బారావు, హైదరాబాద్
- ===============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...