Sunday, January 05, 2014

Is there Earth like in the universe?,భూమి లాంటివి ఇంకా ఉన్నాయా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  









  •  
ప్రశ్న: గెలాక్సీలో మనం చూస్తున్న సూర్యుడు కాకుండా చాలా ఎక్కువ సూర్యుళ్లు ఉన్నాయంటున్నారు. మరి భూమి లాంటివి కూడా చాలానే ఉండాలి కదా?

జవాబు: సూర్యుడు తదితర నక్షత్రాలు కోటాను కోట్లుగా ఉన్న సముచ్చయాన్ని నక్షత్రరాశి లేదా గెలాక్సీ అంటారు. మన సూర్యుడున్న నక్షత్రం పేరు పాలపుంత గెలాక్సీ లేదా మిల్కీవే గెలాక్సీ. ఇది వంపు తిరిగిన పళ్లచక్రంలాగా ఉంటుంది. మధ్యలో ఉబ్బుగా అంచుల్లో పలుచగా ఉంటుంది. ఈ పాలపుంతలో ఒక అంచు నుంచి మరో అంచుకు పాలపుంత కేంద్రం గుండా సుమారు లక్ష కాంతి సంవత్సరాల నిడివి ఉంటుంది. అంటే మిల్కీవేలాంటి గెలాక్సీల వ్యాసం సుమారు ఒక లక్ష కాంతి సంవత్సరాలు. ఇలాంటి గెలాక్సీలో 4 లక్షల మిలియన్ల వరకు నక్షత్రాలుంటాయి. అందులో సూర్యుడు కూడా ఒక నక్షత్రం. మన గెలాక్సీలోనే మనకు సూర్యుని తర్వాత ఉన్న అతి సమీప నక్షత్రం పేరు ప్రాక్సిమా సెంటరి. అది మనకు దాదాపు 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే అక్కడ్నుంచి కాంతి సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో వస్తూ ఉన్నా మనల్ని చేరడానికి నాలుగు సంవత్సరాలు పడుతుంది. ప్రతీ నక్షత్రానికి మన సూర్యుడికి ఉన్నట్లే గ్రహ కుటుంబం ఉండాలన్న నిబంధన లేదు. ఒకవేళ ఉన్నా మన భూమి లాంటి పరిస్థితి ఉన్న గ్రహాలు అక్కడ ఉండాలనిగానీ, ఉండకూడదనిగానీ ప్రకృతి సిద్ధంగా నియమం లేదు. డ్రేక్‌ అనే శాస్త్రవేత్త అంచనా ప్రకారం ఈ విశాల విశ్వంలో కొన్ని కోట్ల ప్రాంతాల్లో భూమిని పోలిన స్థావరాలున్నాయనీ, జీవం ఉండటానికి ఆస్కారం ఉందనీ కంప్యూటర్‌ నమూనాల ద్వారా తెలియజేశారు. ఇంత ఆధునిక అంతరిక్ష పరిశోధనా పరికరాలు ఉపయోగించి ఇంత వరకు భూమిని మినహాయించి మరెక్కడా జీవం ఉన్నట్లు ప్రయోగ ఫలితాలు రాలేదు.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...