ప్రశ్న: చలి, వర్షాకాలాల్లో కొయ్య తలుపులు, బిగుసుకుపోతాయి. ఎందుకు?
జవాబు: ఎండిన కొయ్య ముక్కలను నీళ్లలో వేస్తే అవి నీటిని పీల్చుకొని ఉబ్బడం మనందరికీ తెలుసు. దీనికి కారణం కొయ్య పదార్థాలలో ఉండే సెల్యులోజ్, పిండి పదార్థం. కార్బో హైడ్రేట్‌లు, పెక్టిన్ లాంటి ప్రోటీన్లు. ఇవే కాకుండా ఎండు కొయ్యలో బోలుగా ఉండే మృతకణాలు కూడా ఉంటాయి. అందువల్ల ఎండు కొయ్య చుట్టు పక్కల ఉండే వాతావరణాన్ని బట్టి నీటిని, నీటి ఆవిరినీ సులభంగా పీల్చుకోనూ గలదు, వదలనూ గలదు.
వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే చలికాలంలో మంచు కురియడం వల్ల వాతావరణం తేమగా ఉంటుంది. ఆ రోజుల్లో ఆ తేమలోని నీటికణాలను కొయ్య తలుపులు పీల్చుకొని ఉబ్బుతాయి. ద్వారబంధానికి, తలుపులకు మధ్య తగినంత ఖాళీ ప్రదేశం లేకపోవడంతో ఉబ్బిన తలుపులు బిగుసుకుపోయి (వాటి పరిమాణం కొంచెం పెరిగి) తలుపులు వేయడం, తీయడం కష్టంగా ఉంటుంది. తలుపులకు, ద్వారబంధాలకు రంగులేయడం ద్వారా కొయ్య తేమను పీల్చుకొనే ధర్మాన్ని కొంత వరకు తగ్గించవచ్చు. దాంతో తలుపులను సులభంగా తెరిచి, మూయవచ్చు.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- =================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...