ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ర్
ప్రశ్న: వర్షం కురిసినపుడు వచ్చే మెరుపుల్లో విద్యుచ్ఛక్తి ఉంటుందంటారు అదెలా సాధ్యం?
జవాబు: సాధారణంగా నేల నుంచి 2 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మేఘాలే మెరుపులు, ఉరుముల్ని కలిగిస్తాయి. ఈ మేఘాల్ని క్యుములోనింబస్ మేఘాలు అంటారు. వేసవి ఎండల వల్ల సముద్రపు నీరు ఆవిరై భూప్రాంతాలకు విస్తరించినపుడు అక్కడున్న దుమ్ము, ధూళి కణాలతో ఢీకొన్న మేఘాల్లో స్థిర విద్యుత్ పోగుపడుతుంది. అనువైన పరిస్థితి ఏర్పడ్డపుడు విద్యుదావేశాలు పరస్పర ఆకర్షణ ద్వారా గాలిలో ప్రవహిస్తాయి. గాలి ప్లాస్మా స్థితికి చేరడం వల్ల ఆ వేడికి కాంతి పుడుతుంది. ఇవే మెరుపులు.
మెరుపులు క్షణికంగా మెరిసినా అందులో ఉన్న విద్యుత్ ప్రవాహం కొన్నిసార్లు వందలాది కిలో ఆంపియర్లుగా ఉంటుంది. పొటన్షియల్ భేదం ద్వారా ఆ విద్యుత్ ప్రవాహం సంభవించడం వల్ల ఎన్నో కూలుంబుల విద్యుదావేశం మేఘాల మధ్య మేఘాలకు నేలకు మధ్య వినిమయం అవుతుంది.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ==============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...