ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: పెద్ద మంచుగడ్డను ఆరుబయట ఉంచితే దాని నుంచి పొగలెందుకు వస్తాయి?
జవాబు: ఆరుబయట గాలిలో పెట్టిన మంచుగడ్డ నుంచి వచ్చే పొగలు మంట నుంచి వెలువడే పొగల లాంటివో, ఏ వాయువుకో సంబంధించినవో కావు. మంచుగడ్డ చుట్టూ ఉన్న చల్లని గాలిలో ఘనీభవించిన నీటి ఆవిరే మనకలా పొగల రూపంలో కనిపిస్తుంది.
మంచుగడ్డ చుట్టూ ఉన్న గాలి బాగా చల్లబడి అతి తక్కువ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. ఆ గాలిలో ఉన్న నీటి ఆవిరిలో కొంత ఘనీభవించి అతి సూక్ష్మమైన నీటి బిందువులు ఏర్పడతాయి. వాతావరణంలో సూర్యరశ్మికి వేడెక్కే గాలులు తేలికై పైకి ప్రయాణిస్తూ ఉంటాయి. ఆ గాలులతోపాటుగా మంచుగడ్డ చుట్టూ ఏర్పడిన సూక్ష్మ నీటి బిందువులు కూడా పైకి లేస్తాయి. ఆ ప్రదేశాన్ని మంచుగడ్డకు దూరంగా ఉన్న గాలి ఆక్రమిస్తుంది. తిరిగి ఈ గాలి కూడా మంచుగడ్డ వల్ల చల్లబడి సూక్ష్మ బిందువులుగా మారి ఇతర గాలులతోపాటు పైకి లేస్తుంది. ఇలా పైకి లేచే అత్యంత సూక్ష్మమైన నీటి బిందువులే మనకు దట్టమైన పొగలలాగా కనిపిస్తాయి.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ==============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...