Sunday, January 05, 2014

How all gases in the air mixed?, వాయువులన్నీ కలిసే ఉంటాయేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  








  •  

ప్రశ్న: వాతావరణంలోని గాలిలో ఆక్సిజన్‌, నైట్రోజన్‌ కూడా ఉంటాయి కదా. ఆక్సిజన్‌ సాంద్రత నైట్రోజన్‌ సాంద్రత కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ వాయువులు దేనికవి విడిపోకుండా ఎలా కలిసి ఉన్నాయి?

జవాబు: మామూలు ఉష్ణోగ్రతల వద్ద గాలిలోని అణువులు సెకనుకు 500 మీటర్ల వేగంతో కదులుతూ ఒకదానితో ఒకటి తరచూ ఢీకొంటూ ఉంటాయి. వాతావరణంలోని ఉష్ణోగ్రతల మార్పుల వల్ల ఉష్ణం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి బదిలీ కావడం వల్ల కూడా గాలిలోని అణువులు కలిసిపోతాయి. ఈ విధంగా వాతావరణంలోని వివిధ వాయువుల అణువులు, వాటి సాంద్రతల్లో తేడా ఉన్నప్పటికీ ఒకదానితో మరొకటి కలిసిపోవడం ప్రకృతిలో ఒక సహజమైన ప్రక్రియ. ఈచర్య అనంతంగా కొనసాగడానికి కారణం భూమి తన చుట్టూ తాను తిరగడం. భూమి ఉపరితలం పైన 80 నుంచి 120 కిలోమీటర్ల వరకూ వాతావరణంలోని వివిధ వాయువులు వాటి సాంద్రతలతో సంబంధం లేకుండా వాతావరణంలోని 21 శాతం ఆక్సిజన్‌, 78 శాతం నైట్రోజన్‌ విడిపోకుండా సమానమైన గాఢత ఉన్న మిశ్రమ రూపంలో కలిసిమెలిసి ఉంటాయి.

-ప్రొ|| ఈ.వి సుబ్బారావు, హైదరాబాద్‌

 
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...