ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : చండ్రుడు చల్లగా ఉంటాడా? వేడిగా ఉంటాడా?
జ : ' చల్లని రాజా ఓ చందమా ' అని కవులు వర్ణించింది .. చంద్రుడు నుండి వచ్చే వెన్నెల చల్లదనాన్ని అనుభవించి. వాస్తవానికి చంద్రుడు చల్లనిరాజు మాత్రం కాదు . పట్టపలు చందుడి మీద నీరు మరిగేటంత ఉష్ణోగ్రత ఉంటుంది. రాత్రి గడ్డకట్టుకు పోయేటంత చలి ఉంటుంది. సౌర కాంతి చంద్రుడి మీద పడ్డాక చాలా భాగం శోషించబడుతుంది(Absorbed). కేవలం కొంత భాగం మాత్రమే విస్తరణం (Scattering) చెంది అన్ని వైపులకూ వెళుతుంది. అందులో భాగాన్నే మనం వెన్నెలగా చూస్తాము.
చంద్రుడి మీద నీడ నిచ్చేందుకు మేఘాలు ఉండవు అక్కడ పగలు దాదాపు రెండు వారాలు , రాత్రి మరో 2 వారాలు . నిజానికి చంద్ర్డు తనకు తాను మాడిపోతూ మనకు మాత్రము చల్లని వెన్నెల అందిస్తూ మనచేత " శీతాంశువు " అనిపించుకుంటున్నాడు .
- ========================