ప్రశ్న: వోల్టేజ్ స్టెబిలైజర్‌ను ఎందుకు వాడాలి? అది ఎలా పనిచేస్తుంది?
జవాబు: ఇంట్లో వాడే టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీ లాంటి విద్యుత్ పరికరాలకు సరఫరా అయ్యే విద్యుచ్ఛక్తి స్థిరమైన ఓల్టేజిలో ఉండాలి. విద్యుత్ శాఖ నుంచి ఇంటికి సరఫరా అయ్యే విద్యుత్ 250 ఓల్టులు ఉండాల్సి ఉండగా ఒకోసారి హెచ్చుతగ్గులు ఏర్పడుతూ ఉంటాయి. ఓల్టేజి తగ్గితే పరికరాలు పనిచేయవు. ఎక్కువైతే కాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయా పరికరాలకు సరఫరా అయ్యే విద్యుత్ నిర్దిష్టంగా అందేలా చూసే పరికరం అవసరమైంది. అదే ఓల్టేజి స్టెబిలైజర్. దీని ద్వారానే ఆయా పరికరాలకు విద్యుత్ అందే ఏర్పాటు ఉంటుంది. ఇందులో ఉండే ట్రాన్సిస్టర్ అనే పరికరం విద్యున్నిరోధానికి అనుసంధానమై ఉంటుంది. ఈ ఏర్పాటు వల్ల సరిగ్గా పరికరానికి కావలసినంత మేరకే విద్యుత్‌ను స్టెబిలైజర్ నియంత్రించి పంపుతుంది. స్టెబిలైజర్‌లో వాడే ట్రాన్సిస్టర్‌ను జెనర్ డయోడ్ లేదా అవలాంచ్ డయోడ్ అంటారు.
- ==========================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
your comment is important to improve this blog...