Tuesday, January 26, 2010

పంది బొమ్మే ఎందుకు?,Pig image only-Why?






ప్రశ్న: ఏదైనా బ్యాంకుగానీ, పోస్టాఫీసుగానీ పొదుపు కోసం చూపే ప్రకటనల్లో పంది బొమ్మను చూపుతారు ఎందుకు?

జవాబు: డబ్బులు దాచుకోడానికి ప్రోత్సహించే ప్రకటల్లోనూ, అందుకోసం హుండీల్లాగా తయారు చేసే బొమ్మల్లోనూ ఎక్కువగా పంది రూపమే కనిపించడానికి కారణం ఉంది. ఒకప్పుడు బ్రిటన్‌లో pygg పదాన్ని ఒక రకమైన బంకమట్టికి వాడేవారు. దీంతో కూజాలు లాంటి పాత్రలను చేసేవారు. ఇలా తయారు చేసే బుల్లి పాత్రల్లో నాణేలను దాచుకునేవారు. వాటిని pygg jars అనేవారు. అదే కాలక్రమేణా 'పిగ్‌ బ్యాంక్‌'గా మారిందని చెబుతారు. పైగా డబ్బులు దాచుకునేందుకు పంది ఆకారంలో పాత్రను చేయడం సులువుగా ఉండేది. ఇంకోలా చూస్తే, చాలా క్షీరదాల కన్నా పంది బాగా తింటుంది. దాంట్లో చాలా భాగం శరీరాన్ని పెంచుకోవడానికే ఉపయోగపడుతుంది. చర్మపు నిర్మాణం వల్ల కొవ్వు పేరుకుపోతుంది. ఆహారం దొరకని సందర్భాల్లో ఆ కొవ్వునే తిరిగి పిండి పదార్థాలుగా మార్చుకొని (gluco gluesis) ఎక్కువ కాలం బతగ్గలదు.

మరో కారణం అది ఎక్కువ పిల్లల్ని కంటుంది. పెద్ద క్షీరదాల (mammals)లో ఒకే తడవులో ఎక్కువ పిల్లల్ని కనేది ఇదే. దాచుకోవడం, పొదుపుగా ఉండడం, వృద్ధి చేయడం అనే లక్షణాలకు పంది ఒక ఉదాహరణ అనడంతో సందేహం ఏముంది? డబ్బును దాచుకుంటే వడ్డీతో సహా ఎక్కువ రాబడి ఉంటుందన్న అర్ధం ఇందులో ఉంది.

=============================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...