Saturday, January 30, 2010

కార్డియోగ్రామ్‌ పని చేసేదెలా?,Cardiogram working-how?




ప్రశ్న: మనిషి గుండె పరిస్థితిని కనిపెట్టే కార్డియోగ్రామ్‌ ఎలా పనిచేస్తుంది?

జవాబు: కార్డియోగ్రామ్‌ పరికరాల్లో రకాలున్నాయి. సాధారణమైనది శబ్దతరంగాల సాయంతో గుండె ప్రతిబింబాన్ని తెరపై కనిపించేట్టు చేస్తుంది. ఈ పద్ధతిలో అతిధ్వని తరంగాలను (ultra sounds) గుండెపై పడేటట్టు ప్రసరింప చేసి, అక్కడి నుంచి పరావర్తనం చెందిన తరంగాలను గ్రహించే ఏర్పాటు ఉంటుంది. పరావర్తన తరంగాల ప్రతిబింబాలను ఒక తెరపై పడేటట్లు చేసి గుండె ఆకృతిని చూడగలుగుతారు. అయితే ఈ కార్డియోగ్రామ్‌ ద్వారా గుండెలో ప్రవహించే రక్త వేగాన్ని కొలవలేము. ఇందుకోసం డాప్లర్‌ ఎకో కార్డియోగ్రామ్‌ను ఉపయోగిస్తారు. ఈ పరికరం నుంచి నిర్దిష్టమైన పౌనఃపున్యం ఉండే ధ్వని తరంగాలను గుండెలోకి ప్రసరింపజేస్తారు. ఆ తరంగాలు గుండెలో చలనంలో ఉన్న రక్తకణాలపై, రక్తనాళాలపై పడి వెనుతిరిగి వస్తాయి. ఇలా తిరిగి వచ్చే తరంగాల పౌనఃపున్యంలో తేడాలు ఏర్పడతాయి. పంపిన తరంగాలు, తిరిగి వచ్చిన తరంగాల పౌనఃపున్యాలను బట్టి గుండెలో రక్తప్రసరణ వేగం, దిశలను గ్రహించగలుగుతారు.


visit My website > Dr.Seshagirirao - MBBS.
http://dr.seshagirirao.tripod.com/

No comments:

Post a Comment

your comment is important to improve this blog...