కార్డులు కన్నా ముందే ఈజిప్టు లో ఈ సంప్రదాయం మొదలైనదని అంటారు . ఈజిప్తియన్లు చెట్ల బెరడులపై శుభాకాక్షలు రాసి ఇష్టమైన వారికి ఇచ్చుకునే వారని చెబుతారు . కాగితం కనుగొన్న తరువాత రాతలన్ని దాని మీదకు మారాయన్నమాట . మొత్తం మీద 18 వ శతాబ్దం నుంచి వీటి వాడుక పెరిగిపోయింది . ప్రఖ్యాత చిత్రకారులైన "కేట్ గిరవే " , " వాల్టర్ క్రేన్ " లాంటి వారు రకరకాలైన డిజైన్లలో కార్డులు తయారు చేయించి ముద్రించేవారు . 19 శతాబ్దం వచ్చేసరికి 'మదర్స్ డే ' ఫాదర్స్ డే ' లాంటి ప్రత్యేక దినాలు పెరిగిపోవడం తో ఉత్పత్తి పెరిగింది .
మీకు తెలుసా ?...
- అమెరికా లో ప్రతి ఏడాది 700 కోట్లు గ్ర్రేటింగ్ కార్డులు అమ్ముడవుతున్నాయి . వీటి విలువ 750 కోట్ల డాలర్లు పైమాటే .
- బ్రిటన్ లో ఏట 100 కోట్ల పౌండ్ల వ్యాపారము జరుగుతుంది .
- ఒక మనిషి ఏడాదికి 20 కర్డులైనా అందుకుంటాడని అంచనా .
- ఏటా ఆన్ లైన్ ద్వారా 50 కోట్ల గ్రీటింగ్ కార్డ్లులు బట్వాడా అవుతున్నాయని అంచనా .
- బెల్జియం లో అతి చిన్న గ్రీటింగ్ కార్డు ను చేసి రికార్డు కొట్టేసారు .
- ఆగ్రా లో అతి పెద్ద గ్రీటింగ్ కార్డ్ చేసారు . దాని పొడవు 127 మీటర్లు .
- ప్రపంచ వ్యాప్తం గా గ్రీటింగ్ కార్డులలో 60 శాతము క్రిస్టమస్ పండుగకే అమ్ముడవుతున్నాయి .
================================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
your comment is important to improve this blog...