జవాబు: మాటలు బాగా నేర్చుకున్నాక, పెద్దయ్యాక, ఏదైనా ప్రమాదవశాత్తూ చెవుడు (deaf) వస్తే వారేమీ క్రమంగా మూగ (dumb) వారు కారు. కేవలం పుట్టుకతోనూ లేదా మాటలు రాని వయసులోనూ చెవుడు వస్తే వారు తప్పకుండా మూగవారవుతారు. ఎందుకంటే ప్రతి మనిషి తన చుట్టుపక్కల ఉన్న సమాజపు, కుటుంబపు, పరిసరాల్లో జరిగే సంభాషణలను వింటూ ఆ వ్యక్తుల ముఖకవళికలను చూడ్డం ద్వారా (మాట్లాడే భాష) నేర్చుకుంటాడు. అచ్చ తెలుగు మాత్రమే మాట్లాడే తల్లిదండ్రుల బిడ్డను పుట్టిన కొన్ని నెలలకే ఒరియా భాష మాత్రమే మాట్లాడే పరిసరాల్లో పెంచితే ఆ బిడ్డ క్రమేపీ ఆ భాషనే మాట్లాడేలా ఎదుగుతాడు.
చెవుడు ఉన్న బిడ్డ తన చుట్టూ ఉన్న శబ్దాలను, భాషను వినలేడు కాబట్టి ఏ విధంగా తన నోటిలోని శబ్ద వ్యవస్థను కదిలిస్తే ఎలాంటి శబ్దాలు పుడతాయో తెలసుకోలేడు. కాబట్టి ఏ భాషా రాని 'బ' 'బ' 'బ' శబ్దాలు (ఇదే అతిసులువైన శబ్దం) మాత్రమే చేయగలడు.
మాట్లాడడం సామాజికాంశం. గొప్ప భాషా పండితుల బిడ్డయినా అడవిలో తప్పిపోయి అక్కడే పెరిగితే మాటలు రాని 'టార్జాన్' మాత్రమే కాగలడు.
ముక్కు, వూపిరితిత్తులు, సప్తపథ (pharynx), నాలుక, పళ్లు, దవడలు, పెదాలు, అంగిటి లాంటి అనేక భాగాల సమన్వయంతో చేసే శబ్దాన్ని వినలేకపోతేే వాటి సాయంతో పలకగలిగే శక్తిరాదు.
===========================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
your comment is important to improve this blog...