జవాబు: కొద్దిసేపే జరుగుతుంది. అవిచ్ఛిన్నంగా జరగదు. ఆకులో కిరణజన్య సంయోగక్రియ (photosynthesis) జరిపేందుకు ఆ మూడు విషయాలే కాకుండా వాటిని నడిపించే రసాయనిక దర్శకుడు కావాలి. ఆ పెద్దమనిషి పేరు క్లోరోఫిల్. క్లోరోఫిల్ ఎప్పటికప్పుడు తయారవుతూ ఉండాలి.
క్లోరోఫిల్ తయారు కావాలంటే మెగ్నీషియం, శక్తి, ఇతర రసాయనిక పదార్థాలు, ఆహార పదార్థాలు కావాలి. ఆకు మామూలుగా చెట్టుకు అంటి పెట్టుకొని ఉన్నప్పుడు తల్లి లాంటి చెట్టు నుంచి తనక్కావలసిన పదార్థాలను, లవణాలను గ్రహిస్తుంది. చెట్టునుంచి వేరు పడ్డాక జీవన బంధం (live contact) తెగిపోతుంది.
తనలో ఉన్న క్లోరోఫిల్ తదితర పదార్థాలు ఉన్నంతవరకు కిరణజన్య సంయోగక్రియ జరపగలదు. తద్వారా ఏర్పడిన పిండి పదార్థాల రేణువుల్ని రవాణాచేసే యంత్రాంగం కూడా ఆకుకు స్వతహాగా లేదు. ఆకుల్లోని ఈనెలు, తొడిమ, కొమ్మ, కాండం వంటి రవాణా యంత్రాంగం ఉన్నపుడే అన్నీ సవ్యంగా సాగుతాయి.
=============================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
your comment is important to improve this blog...