Friday, January 29, 2010

సైకిల్‌తోపాటు ఒరుగుతారెందుకు?, We bend while cycling-Why?





ప్రశ్న: సైకిల్‌పై పోతున్న వ్యక్తి వక్రమార్గంలో పయనిస్తున్నప్పుడు ఒక పక్కకు ఒరుగుతాడు. ఎందుకు?

జవాబు: కదిలే వస్తువులకు సంబంధించిన న్యూటన్‌ గమన సూత్రాలు చదువుకుని ఉంటారు. వాటిలో మొదటి దాని ప్రకారం, రుజుమార్గంలో (straight path) సైకిల్‌పై పోతున్న వ్యక్తి మలుపు తిరగాలంటే ఆ సైకిల్‌పై బాహ్య బలం పనిచేయాలి. వక్రమార్గ కేంద్రం వైపు పనిచేసే ఈ బలాన్ని అపకేంద్ర బలం (centripetal force) అంటారు.

రుజుమార్గంలో పోతున్నప్పుడు సైకిల్‌తో పాటు వ్యక్తి బరువు (W) కిందికి భూమివైపు తలానికి లంబంగా పనిచేస్తుంటే న్యూటన్‌ మూడవ గమన సూత్రం ప్రకారం ఆ బరువుకు సమానమైన ప్రతిచర్య (normal reaction) 'R' అదే సరళ రేఖలో పైవైపునకు పనిచేస్తూ ఉంటుంది. ఈ రెండు బలాలు ఒకదానినొకటి బాలెన్స్‌ చేసుకోవడం వల్ల ఇవి సైకిల్‌కు అపకేంద్ర బలాన్ని ఇవ్వలేవు. అందువల్ల సైకిల్‌ వక్ర మార్గంలో పోవడానికి కావలసిన అపకేంద్ర బలం సైకిల్‌ టైర్‌కు, నేలకు మధ్య కలిగే ఘర్షణ బలం (frictional force) ద్వారా లభిస్తుంది. దీనివల్ల సైకిల్‌ టైర్లు అరిగి పాడైపోతాయి.

అదే సైకిల్‌ తొక్కుతున్న వ్యక్తి వక్రమార్గ కేంద్రంవైపు కొంచెంగా వంగితే, ప్రతిచర్య (R) వ్యక్తితోపాటు సైకిల్‌ బరువు Wకు కొంత కోణం చేస్తుంది. ఆ ప్రతిచర్యను రెండు అంశాలుగా విభజించవచ్చు. ఒక అంశం బరువు Wని బాలెన్స్‌ చేస్తే, మరో అంశం వక్ర మార్గ కేంద్రంవైపు పనిచేసే ఘర్షణ బలంతో ప్రమేయం లేకుండా కావలసిన అపకేంద్ర బలాన్ని ఇస్తుంది. అందుకే సైకిల్‌ పై పోతున్న వ్యక్తి మలుపు తిరిగేటప్పుడు వక్రమార్గ కేంద్రంవైపు ఒరుగుతాడు. అంతేకాని అలా ఒరగడం స్త్టెల్‌కాదు.







visit My website > Dr.Seshagirirao - MBBS.
http://dr.seshagirirao.tripod.com/

No comments:

Post a Comment

your comment is important to improve this blog...