Monday, March 31, 2014

వర్షం పడితే వానపాములు వస్తాయెందుకు ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : వర్షం పడితే వానపాములు వస్తాయెందుకు ?

జ : వాన పడినప్పుడు కనిపించే వాన పాములు వర్షం తో పడవు . భూమిలో పలుబొరియలు చేసుకుని నివసిస్తాయి . వాటి శ్వాసక్రియకు గాలి కావాల్సిందే. గాలిని చర్మం మీద తేమలో కరిగించుకిని వానపాములు శ్వాసిస్తాయి. వర్షం నీరు వాటి బొరియలోకి చేరినప్పుడు శ్వాసక్రియకు ఇబ్బంది ఏర్పడి బొరియవదిలి బయటకు వచ్చి తిరుగుతాయి. వర్షం నీరు తగ్గగానే తిరిగి బొరియలోపలికి వెళ్ళిపోతాయి.

  • ===============================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

Saturday, March 29, 2014

Cause for light of Radium Stickers, రేడియం కాంతికి కారణం?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: రేడియం స్టిక్కర్‌లో మెరుపు దేని నుంచి వస్తుంది?

జవాబు: రేడియం స్టిక్కర్లలో వాడే పదార్థం రేడియం మూలకం కాదు. రేడియం మూలకం రేడియో ధార్మికత ద్వారా వెలుగును ఇవ్వడాన్ని మొదట మేడం మేరీక్యూరీ కనుగొన్నారు. అందుకనే ఆమెను 'రేడియం మహిళ' అంటారు. ఆ రేడియం పదార్థం రేడియో ధార్మికత ద్వారా వెలుగునిచ్చినట్లే, రేడియం స్టిక్కర్లు కూడా కాంతిని విరజిమ్మడాన్నిబట్టి 'రేడియం స్టిక్కర్లు' అంటున్నారు.

రేడియం మూలకపు వెలుగు, రేడియం మూలకపు కేంద్రకానికి (Nucleus)  సంబంధించిన అంశం. కానీ రేడియం స్టిక్కర్ల ద్వారా వచ్చే వెలుగు కేంద్రకానిది కాదు. ఆ వెలుగు రేడియం స్టిక్కర్‌ పదార్థాల ఎలక్ట్రాన్ల ద్వారా వస్తుంది. రేడియం స్టిక్కర్లలో ఫ్లోరసెంట్‌ (Fluorescent) ధర్మంగల సేంద్రీయ, నిరింద్రియ పదార్థాలు  వాడతారు. వీటిమీద సూర్యకాంతిగానీ, వాహనాల హెడ్‌లైట్‌ కాంతిగానీ పడ్డపుడు వాటిలోని ఎలక్ట్రాన్లు ఉత్తేజం (Excite) చెందుతాయి. దీన్నే కాంతి శోషణం అంటారు. ఉత్తేజం పొందిన ఆ ఎలక్ట్రాన్లు తిరిగి తమ పూర్వస్థానానికి చేరే క్రమంలో కాంతిని వెలువరిస్తాయి. ఇది అన్నివైపులకు ప్రక్షేపణ చెందుతుంది. ఆ వెలుగునే మనం చూస్తాము.

మరో రకమైన రేడియం స్టిక్కర్లను వాడుతున్నారు. రంగుల్లో ఉండే సాధారణ ప్లాస్టిక్‌ రిబ్బన్‌ల మీద చాలా సన్నని గాడులు ఉంటాయి. ఇటువంటి రిబ్బన్‌ల నుంచి అక్షరాల రూపాలను కత్తిరించి అతికిస్తారు. వీటిమీద వాహనాల కాంతి పడ్డపుడు ఆ కాంతి గాడులమీద వివర్తనం(Diffraction) చెంది వివిధ దిశల్లో పరిక్షేపణ చెందుతాయి. దాన్నే మనం స్టిక్కర్ల కాంతిగా చూస్తాం.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

How do live telecast possible?,ప్రత్యక్ష ప్రసారాలు ఎలా సాధ్యం?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాలు ఏ తరంగాల వల్ల వస్తాయి? అవి ఎలా అనుసంధానం అవుతాయి?

జవాబు: సాధారణంగా అన్ని రకాల టీవీ ప్రసారాలు మైక్రోవేవ్‌ తరంగాల ద్వారానే నిస్తంత్రీ (wireless) పద్ధతిలో ఒక చోట నుంచి మరోచోటికి ప్రసారం అవుతాయి. మనం సెల్‌ఫోన్‌కు వాడే టవర్లను ఉపయోగించి సెల్‌ఫోన్లలో ఫోన్‌ ఇన్‌ (phone-in) అనే ప్రక్రియ ద్వారా ఓ చోట విలేకరి చేసే వార్తాసమీక్షల్ని ఆయా టీవీల మాతృస్థానం (studio) వరకు చేరుస్తారు. ఏదైనా బాహ్యక్షేత్రం (outdoors) లో జరిగే క్రీడలు, ఉత్సవాలు, సభలు, సమీక్షలు వంటి వాటిని లైవ్‌టెలికాస్ట్‌ చేయాలంటే టీవీ వాళ్ల దగ్గరున్న ప్రత్యేక వాహనానికి అమర్చిన డిష్‌ల ద్వారా సూక్ష్మతరంగాల ప్రసరణ చేసి ఉపగ్రహాలకు సంధానించుకుంటారు. అక్కణ్నించి ప్రసార తరంగాలు వారి మాతృస్థానానికి చేరతాయి. దృశ్య పసారాలకు (వీడియో) మైక్రోవేవ్‌ తరంగాల్ని, శ్రవణ ప్రసారాలకు (ఆడియో) రేడియో తరంగాలను వాడటం పరిపాటి. ఈ రెంటి కలయిక (admixturing) సరిగాలేనపుడు టీవీలో మాట్లాడే వ్యక్తి పెదాల కదలికలకు, మాటలకు పొంతనలేకపోవడాన్ని గమనిస్తాము.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Old book are mouldy smel why?, పాతపుస్తకాలు వాసనేల?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: పాతపుస్తకాలు ఒక రకమైన వాసన వస్తాయి. ఎందుకు?

జవాబు: గాలి చొరబడని బీరువాలలో పుస్తకాలను ఎక్కువ కాలం ఉంచితే వాటికి ఒక ప్రత్యేకమైన వాసన సంక్రమిస్తుంది. దీనికి కారణం ఫంగస్‌ లాంటి వ్యర్థ పదార్థాలు, మ్యూకార్‌, రిజోవస్‌, ఐస్పరాగస్‌ పెన్సీలియా లాంటి ఫంగస్‌ జాతులే. ఇవి కొయ్య, కాగితంలాంటి కర్బన సంబంధిత పదార్థాలపై పెరుగుతాయి. ఈ ఫంగస్‌ ఒక విధమైన ముక్క వాసనను కలగజేయడమే కాకుండా ఆయా వస్తువులను శిథిలావస్థకు చేరుస్తుంది. పాత పుస్తకాల కాగితాలు పసుపు రంగులోకి మారిపోయి, పొడిపొడిగా రాలిపోవడానికి కారణం ఇవే. ఫంగస్‌కు సంబంధించిన పదార్థాలు కొంత వరకు విషపూరితమే కాకుండా మనదేహంపై ఎలర్జీని కూడా కలుగచేస్తాయి. శ్వాసకోశానికి సంబంధించిన 'ఆస్తమా' లాంటి వ్యాధులను ఎక్కువ చేస్తాయి. ఈ ప్రమాదాలను అరికట్టడానికి ఫంగస్‌ అంతగా పెరగడానికి అనుకూలంగా లేని ప్రదేశాలలో అంటే గాలిలో తేమ లేకుండా ఉండే పొడిగా చల్లగా ఉండే ప్రదేశాలలో పుస్తకాలను ఉంచాలి. వంటసోడా, సబ్బు ముక్కలు, కాఫీ పొడి పుస్తకాల బీరువాల్లో ఉంచితే అవి ఫంగస్‌ వల్ల వెలువడే వాసనను, గాలిలో తేమను హరిస్తాయి.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ==========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.- /

No seeds in some grapes why?,కొన్ని ద్రాక్షల్లో గింజలుండవేం?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: కొన్ని జాతుల ద్రాక్షల్లో గింజలు ఉండవు ఎందుకు?

జవాబు: ఏ పండుకైనా విత్తనం కానీ, గింజకానీ ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం. అయితే శాస్త్ర విజ్ఞానం పురోగమించే కొలదీ గింజలు లేని ద్రాక్ష, దానిమ్మ లాంటి ఫలాలు మనకు లభిస్తున్నాయి.

మామూలుగా విత్తనాలను నేలలో పాతడం ద్వారా మొక్కలు పెరుగుతాయని మనందరికీ తెలుసు. కానీ సరికొత్త పద్ధతులనుపయోగించి తీగలు లేక చెట్ల కొమ్మలనే నేలలో పాతి మొక్కలను పెంచుతున్నారు. ఈ పద్ధతిని 'క్లోనింగ్‌' అంటారు.
క్లోనింగ్‌ అంటే ప్రకృతి సహజమైన సంపర్కంతో సంబంధం లేకుండానే అదే రకమైన జన్యుధర్మాలుండే ప్రాణుల సృష్టి. ఈ ప్రక్రియతో ఎదిగిన చెట్లు, తీగల వల్లనే మనకు గింజలు లేని ద్రాక్ష, ఆపిల్‌, చెర్రీ లాంటి పండ్లు లభిస్తున్నాయి.
ప్రకృతి సిద్ధమైన తీగ లేక చెట్ల నుంచి ఒక చిన్న తీగనో, కొమ్మనో తుంచి దానిని ఆ చెట్ల వేర్లను ఉత్పత్తి చేసే హార్మోన్లలో ముంచి తడి మట్టిలో ఉంచి పెంచుతారు. కొంతకాలం తర్వాత కొమ్మకు భూమిలో వేర్లు, భూమి పైన ఆకులు పెరుగుతాయి. ఈ విధంగా పెరిగిన మొక్కల ఫలాలే సీడ్‌లెస్‌ పండ్లన్నమాట. ఇలా ఏర్పడిన పండ్లలో కూడా ఒక దశలో గింజలు ఏర్పడతాయి. కానీ క్లోనింగ్‌ చేయడం వల్ల కలిగే జన్యుపరమైన తేడా వల్ల ఆ గింజల చుట్టూ గట్టిగా ఉండే కవచం ఏర్పడక పోవడంతో అవి అసలు గింజల లాగా గట్టిగా ఉండకుండా పండులోని గుజ్జుతో కలిసిపోతాయి.

- ప్రొ|| ఈ.వి సుబ్బారావు, హైదరాబాద్‌
  • ==========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, March 28, 2014

గొరిల్లా మరియు చింపాంజీ మధ్య తేడా ఏమిటి ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  
 గొరిల్లా మరియు చింపాంజీ మధ్య తేడా ఏమిటి ?

- శరీర పరిమాణం : గొరిల్లాలు, చింపాంజీ కంటే  రెండురెట్లు  పరిమాణం లో పెద్దగా ఉంటాయి.

- రెండూ ప్రైమేట్స్ మరియు పెద్ద మెదళ్ళు .- అయితే , చింపాంజీలు వాటి శరీరముతో పోల్చుకుంటే పెద్ద మెదడు మరియు చిన్న పరిమాణం , కలిగి ఎక్కువ తెలివైన .

- గొరిల్లాస్ చింపాంజీలు పోలిస్తే  చేతులు, ఛాతీ మరియు తొడ కండరాలు బలముగా ఉంటాయి .

- చింపాంజీ ముఖం రంగు మరింత పింక్ కానీ గొరిల్లాస్ ముఖం రంగు నలుపు.

- చింపాంజీ పెద్ద చెవులు తల బయటకు అంటుకునే ఉంటాయి .. కానీ గొరిల్లా యొక్క చెవులు చిన్న మరియు తల వెనుక వైపు కు తెరిగి ఉంటాయి .

-  తల , నుదురు మరియు గొరిల్లాల మూపురం , పెద్దగా ఉంటాయి...అయితే  చింపాంజీల్లో ఆవి  చిన్నగా ఉంటాయి,

- చింపాంజీలు కర్లింగ్ పెదవులు ప్రముఖము గా ఉంటాయి.  . . గొరిల్లాస్ లో అవి ప్రముఖమైనవి కాదు.

- గొరిల్లా ఒక శాకాహారి , కానీ చింపాంజీలు  సర్వభక్షకులు .

- రెండు జంతువులు యొక్క జీవితకాలం ఇతర జంతువులు కంటే ఎక్కువే , కానీ గొరిల్లాస్ చింపాంజీలు కంటే ఎక్కువ నివసిస్తున్నారు .

- సామాజిక నిర్మాణాలు చింపాంజీలు లో కొద్దిగా క్లిష్టమైన .

- అయితే  గొరిల్లాస్ మరియు చింపాంజీలు రెండూ  సహజంగా ఆఫ్రికాలో ప్రత్యేకంగా ఉంటాయి .

  •  ============================
 visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, March 26, 2014

body cells don't Die? , శరీరములో కణాలు మృతిచెందవా?.

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : body cells don't Die? , శరీరములో కణాలు మృతిచెందవా?.
జ : శరీరమంటేనే కణాల సముదాయము .ఇందులో ప్రతి కణానికీ మరణము ఉంటుంది. ఒక్కొక్క రకము కణానిది ఒక రకమైన ఆయుర్ధాయము . మనకు తెలియకుండానే మన శరీరములో కణాలు మరణించడము , వాటి స్థానము లో కొత్త కణాలు పుట్టుకురావడము జరుగుతుంటుంది .
  • పేగు పైపొర కణాలు ప్రతి 5 రోజులకు పాత వాటిస్థానములో కొత్తవి వస్తుంటాయి. 
  • తెల్ల రక్తకణాలు 2 నుండి 4 సం.లు ,
  • ఎర్ర రక్త కణాలు 90-120 రోజులు లలో మృతిచెందుతాయి.,
  • మన చర్మము మీద ఉన్న కణాలు ప్రతి 15 నుండి 20 రోజులకొకసారి కొత్తవి వస్తుంటాయి. 

  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Navavidha Bhakti Reetulu-భక్తి మార్గాలు ఎన్ని ? అవి ఏవి ?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ప్ర : భక్తి మార్గాలు ఎన్ని ? అవి ఏవి ?.

జ : భక్తి ఒక పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు, కృష్ణుడు లేదా అతని అవతారాలకు సంబంధించినది. అదేవిధంగా శైవులకు శివుడు, శక్తి లేదా వారి అవతారాలకు సంబంధించినది. భక్తి యోగం గురించి భగవద్గీత లో వేదాంతాల సారంగా పేర్కొన్నది. నారద భక్తి సూత్రాలు పలురకాల భక్తి విధాల గురించి పేర్కొన్నది.

భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధభక్తులు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉన్నది. భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.

   1. శ్రవణం: భగవంతుని గూర్చిన గాధలు, భజనలు, కీర్తనలు వినుట - (హరికథ శ్రోతలు),ధర్మరాజు, జనమేజయుడు, శౌనకాది మునులు.
    2.కీర్తనం: భగవంతుని గుణగణములను కీర్తించుట- రామదాసు,అన్నమయ్య,త్యాగరాజు,తులసీదాసు,మీరాబాయి - మరెందరో భక్త గాయకులు.
   3. స్మరణం: భగవంతుని స్మరించుట - నిత్యం ధ్యానం చేసే కోట్లాది భక్తులు.
   4.పాదసేవ: దేవుని పాదముల పూజ సేయుట.
    5.అర్చనం: గుడిలోగాని, ఇంటిలోగాని,హృదయములో గాని విధివిధానములతో అర్చించుట.
    6.వందనం: ప్రణామం చేయుట.
    7.దాస్యం: భగవంతునకు దాసుడగుట - హనుమంతుడు, రామదాసు.
    8.సఖ్యం: అర్జునుడు.
   9. ఆత్మనివేదనం: తనను పూర్తిగా దేవునకు సమర్పించుకొనుట - గోదాదేవి, మీరాబాయి.

  • ==============================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, March 11, 2014

చర్మంపై గోళ్లతో గీస్తే తెల్లని గీతలు పడతాయి ఎందుకు?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: చర్మంపై గోళ్లతో గీస్తే తెల్లని గీతలు పడతాయి ఎందుకు?

జవాబు: ఇలాంటి అనుభవం సాధారణంగా చలికాలంలో గమనిస్తారు. ఎండాకాలం ఇలాంటి అనుభవం దాదాపు రాదనే చెప్పవచ్చు.
చలికాలం బయట ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రతకన్నా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరం నుంచి పదేపదే ఉష్ణం బయటివైపునకు వెళితే మన శరీర ఉష్ణోగ్రత పడిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే యంత్రాంగం చర్మం పై పొరల్లో రక్త ప్రసరణను తగ్గిస్తుంది. చెమట ఏ మాత్రం రాదు. దరిమిలా చర్మం పై పొర చాలా పొడిగా ఉంటుంది. చర్మంపై ఉన్న ఎపిథీలియా అనే పలుచని పొర దాదాపు ఎండిపోయిన పొరలాగే ఉంటుంది. ఇలాంటి స్థితిలో చర్మాన్ని గోళ్లతో గీకినట్త్లెతే ఈ ఎపిథీలియ పొర చిందరవందరగా చిరిగిపోయి చిన్నచిన్న ముక్కలుగా చర్మంపై పేరుకుంటుంది. ఈ చిన్న ముక్కల వల్ల చర్మంపై పడ్డ కాంతి అన్నివైపులకు పరిక్షేపణం చెందుతుంది. పరిక్షేపణ పొందిన కాంతి వల్లనే ఆ ప్రాంతంలో తెలుపు రంగు కనిపిస్తుంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

నీరు ప్రవహిస్తున్నా నదులపై వంతెనలెలా నిర్మిస్తారు?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: నీరు ప్రవహిస్తున్నా నదులపై వంతెనలెలా నిర్మిస్తారు?

జవాబు: మామూలుగా వంతెనలు నదులపై వర్షాలుపడని ఆఫ్‌ సీజన్‌లో నిర్మిస్తారు. అప్పుడు నదిలో నీరు వేగంగా ప్రవహించకుండా చాలా వరకు నిలకడగా ఉంటుంది. అప్పుడు వంతెనకు స్తంభాలు నిర్మించవలసి వచ్చిన చోట నీటిలో 20 నుంచి 40 సెంటిమీటర్ల వ్యాసం గల నీరు చొరబడని పైపులను కాంక్రీటు వేయవలసిన ప్రదేశం వరకూ దించుతారు. అంతకు ముందే నిర్మించిన ప్లాట్‌ఫాం నుంచి పైపుల ద్వారా ఇనుము, స్టీలు కమ్మీలను లోనికి పంపుతారు. నీరు కలుపని గులకరాళ్లు, సిమెంటు, ఇసుక మిశ్రమాన్ని కూడా ఈపైపు ద్వారా జారవిడుస్తారు. దీనిని 'డ్రైమిక్చర్‌' అంటారు. పైపు నుంచి కిందికి దిగిన ఈ పొడి మిశ్రమం అడుగున ఉన్న నీటితో కలిసి గట్టిపడి రాయిలా మారుతుంది. పైపును దఫాల వారిగా పైకి లాగుతూ ఈ మిశ్రమాన్ని పైపుల్లో వేస్తూ వంతెనకు కావలసిన ఎత్తున స్తంభాన్ని నిర్మిస్తారు.

నీటి వేగం ఎక్కువగా ఉంటే, యంత్రాల ద్వారా నీటి వేగాన్ని తగ్గించి, నీరు ప్రవహించే దిశను మారుస్తారు. నదిలో ఎక్కువ లోతుగా ఉన్న ప్రదేశాలకు కాంక్రీటును చేరవేయాలంటే పెద్ద బకెట్లలో కాంక్రీటును నింపి, దాని పైభాగాన్ని నీరు చొరబడకుండా కాన్వాస్‌తో కప్పుతారు. ఈ బకెట్‌ను నీటిలో నిర్ణీత స్థలానికి దింపి, బకెట్‌ అడుగున ఉన్న మూతను నిదానంగా తొలగిస్తారు. తర్వాత కాంక్రీటును అక్కడ జారవిడుస్తారు. ఖాళీ బకెట్‌ను పైకిలాగి మళ్లీ కాంక్రీటుతో నింపుతారు. ఈ ప్రక్రియలో పెద్ద క్రేన్ల కన్వేయర్‌ బెల్టుల ప్రమేయం ఎంతో ఉంటుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • ==================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Boiling vapours goes up Why?,ఆవిరి పైకే ఎందుకు వెళుతుంది?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఆవిరి పైకే ఎందుకు వెళుతుంది?

జవాబు: నీటి ఆవిరి వంద డిగ్రీల సెల్సియస్‌ కన్నా అధిక ఉష్ణోగ్రత దగ్గర ఉంటుంది.దీని సాంద్రత తక్కువగా ఉంటుంది. సాధారణ గాలి వేసవి కాలంలో అయినా 45 డిగ్రీల సెల్సియస్‌కు మించదు. అందువల్ల వేడి నీటి ఆవిరి సాంద్రత తక్కువగా ఉంటుంది. ప్లవన సూత్రాల ప్రకారం తక్కువ సాంద్రత గల పదార్థాలు, ఎక్కువ సాంద్రతగల ప్రాంతాలపైకి విస్తరిస్తాయి. అందువల్ల వేడి ఆవిర్లు పైపైకే పాకుతాయిగానీ, కిందివైపునకు పడవు. పైకి పాకుతున్న క్రమంలో ఉష్ణోగ్రత సమతాస్థితి పొంది గాలిలో సమానంగా ఆవిరి కలిసిపోతుంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ===================
 visit My website > Dr.Seshagirirao - MBBS.

Vegetable in Fridge not stored long Why?,ఎండాకాలంలో ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో నిలవుండవేం?

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: చలి కాలంలో ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉండే కూరగాయలు ఎండా కాలంలో తక్కువ రోజులే నిల్వ ఉంటాయి. ఎందుకు? ఏ కాలంలోనైనా ఉండేది ఆ ఫ్రిజ్‌లోనే కదా?

జవాబు: చలికాలంలోను, వేసవి కాలంలోను ఫ్రిజ్‌ అదే అయినా వాతావరణం, వాతావరణం(ఇంటి)లో ఉండే సూక్ష్మ జీవుల జనాభా, ఫ్రిజ్‌కు ఉండే విద్యుత్‌ శక్తి తీరు తెన్నులు ఈ రెండు కాలాల్లో ఒకే రకంగా ఉండవు. కూరగాయలు బయట ఉంటే చెడిపోవడానికి, ఫ్రిజ్‌లోపల ఉంటే నిల్వ ఉండటానికి కారణం ఫ్రిజ్‌లోకి సూక్ష్మజీవులు వెళ్లలేక కాదు. అదే నిజమయితే అల్మారాలో పెట్టినా కూరగాయలు నిల్వ ఉండాలి. ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. బాక్టీరియా, తదితర సూక్ష్మక్రిములు తమ జీవన కార్యకలాపాల్ని అంత తక్కువ ఉష్ణోగ్రత దగ్గర చేపట్టలేవు. అందువల్ల కూరగాయలు కొంతకాలం పాటు నిలువ ఉంటాయి. పైగా చలికాలంలో విద్యుత్‌ సరఫరాలో 'పవర్‌ కట్‌'లు తక్కువ. కాబట్టి ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రత నిలకడగా, తక్కువగా ఉంటుంది. అలాగే వాతావరణం కూడా చల్లగానే ఉండటం వల్ల వాతావరణంలోని సూక్ష్మజీవుల జనాభా తక్కువ ఉంటుంది. కాబట్టి కూరగాయల్ని ఆశించే క్రిములు తక్కువ. వేసవి కాలంలో తగినంత ఉష్ణోగ్రత ఇంటి వాతావరణంలో ఉండటం వల్ల ఫ్రిజ్‌లోని వస్తువుల మీద దాడి ఎక్కువ. పైగా పవర్‌ కట్‌లు కూడా ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచవు.

  • -ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ===================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

underneath Frozen lake how lives survive?, గడ్డకట్టిన సరస్సులో జలచరాలు ఎలా జీవిస్తాయి?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: గడ్డకట్టిన సరస్సులో జలచరాలు ఎలా జీవిస్తాయి?

జవాబు: చలికాలంలో చాలా దేశాల్లో సరస్సులు గడ్డ కడతాయి. అయితే గడ్డ కట్టిన భాగం పైనే ఉంటుంది. కానీ సరస్సు అడుగు భాగంలో నీరు గడ్డకట్టకుండానే ద్రవస్థితిలో ఉంటుంది. ఇందుకు కారణం నీటికున్న అసంబద్ధ (anomolous)లక్షణమే. నీటి సాంద్రత, మంచు సాంద్రత కన్నా ఎక్కువ. ఇలా ద్రవస్థితిలో ఎక్కువ సాంద్రత, ఘనస్థితిలో తక్కువ సాంద్రత ఉండటం వల్లే మంచు గడ్డలు నీటిపైన తేలుతాయి.

అంతే కాదు ఇలాంటి పదార్థాల మీద బరువు పెట్టినట్టయితే వాటికి ఘనీభవనస్థానం మామూలు కన్నా తక్కువ అవుతుంది. సరస్సుల్లో గడ్డ కట్టిన ఐసు గడ్డలు బరువులాగా ఉండటం వల్ల కిందున్న నీరు అల్ప ఉష్ణోగ్రత ఉన్నా ఘనీభవించకుండా ద్రవ రూపంలో ఉంటుంది. కాబట్టి జలచరాలు యాథావిధిగా సంచరిస్తూ జీవన కార్య కలాపాలు సాగించగలవు. కిందున్న నీటిలో జంతుజాతులతో పాటు వృక్ష జాతులయిన నాచు, ప్లాంక్టిన్‌, క్లామిడోమోనాస్‌, యుగ్లీనా వంటి సూక్ష్మ హరిత జీవులు ఉంటాయి. అవి కిరణజన్య సంయోగ క్రియలో విడుదల చేసే ఆక్సిజన్‌ జీవులకు సరిపోతుంది. పైగా అక్కడక్కడా మంచు గడ్డల చీలికల్లోంచి వాతావరణంలోని ఆక్సిజన్‌ అందుతుంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, March 07, 2014

Why do we get heat from flame?,మంటనుండి వేడి వస్తుందెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  

 ప్ర : మంటనుండి వేడి వస్తుందెందుకు?

జ : ఒక్కొక్క వస్తువు మండుతుంటే ఒక్కొక్క స్థాయి వేడి వస్తుంది. మండడానికి ఆక్షిజన్‌ కావాలి. గాలిలో వుండే ఆక్షిజన్‌ని తీసుకుంటూ ఇంధనము మండుతుంది. అయితే నేరుగా చెక్కముక్క లేదా కాగితము ఆక్షిజన్‌ ఉన్నా మండవు . అందుకు కారణము అవి మండేందుకు అధిక ఉష్ణోగ్రత అవసరము. ఆ ఉష్ణోగ్రతను అగ్గిపుల్లతో గీసి అందిస్తాము. ఒక స్థాయి వేడికి చేరితేనే ఆక్షిజన్‌ ఆ ఇంధనాన్ని మండించేందుకు సహకరిస్తుంది. మండేందుకు ఎంత ఉష్ణోగ్రత అవసరమో ఆ మేరకు 'వేడి' మంటనుండి బయటకు వస్తుంది . భిన్న వస్తువులు మండుతుంటే భిన్న రీతులలో వేడి రావడానికి కారణము అదే. 
  •  ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.

What are Shodashopacharas?,షోడశోపచారాలు అంటే ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  

 Q : What are Shodashopacharas?,షోడశోపచారాలు అంటే ఏమిటి?

Ans : దేవుడు , ప్రకృతి శక్తీ. ప్రకృతి లో ఉండే ప్రతి భాగమందు నిండి యున్నాడు. మీరు ఏ రూపమున ధ్యానించిన, ప్రార్ధించిన ఆ రూపమున మిమ్ములను ఆదుకొనును . మీరు చేయు కార్యములందు, మీ జీవనమునందు , మీకు తోడై, నీడై మిమ్ములను రక్షించును. దేవుని యెడల విశ్వాసము లేకుండా ... సంస్కృతి, పూజలు, ప్రార్ధనలు, సంప్రదాయాలు  పాటించిన వ్యర్ధము, నిరుపయోగము. కావున అందరు మొదట దేవుని యెడల నమ్మకము, భక్తి కలిగి ఉండవలెను , తప్పనిసరి అదే శ్రేయస్కరము.

 మీరు చేయవలసిన పని, ప్రయత్న లోపము లేకుండా చేయండి, ఫలితము భగవంతునికి వదిలి వేయండి. మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ ప్రతిఫలము పొందుటకు, భగవంతుడిని ఆరాధించండి

భగవంతునికి చేయు ఉపచారాలే షోడశోపచారాలు.........భగవంతునికి చేయు సేవలే షోడశోపచారాలు.
ఈ సేవల యందు  భగవంతుని మనం అతిధి గా భావిస్తాము.  ఇవి 16----భక్తుడు తన ఆత్మ తృప్తి కోసం, అంత మహా శక్తీ ని దగ్గరనుండి సేవించే  శక్తీ లేక, భగవంతుని ఆత్మ రూపాన, ప్రసన్నం చేసుకుని, సేవించుటయె  షోడశోపచారాలు.
1. ఆహ్వానించుట = ఆవాహనం  అనే ఉపచారం.
2. ఆసన ఇవ్వటం = ఆసనం అనే ఉపచారం.
3. కాళ్ళకు నీళ్ళు ఇవ్వటం  = పాద్యం అనే ఉపచారం.
4. చేతులకు నీళ్ళు ఇవ్వటం = అర్ధ్యం అనే ఉపచారం.
5. త్రాగుటకు నీళ్ళు ఇవ్వటం = ఆచమనీయం అనే ఉపచారం.
6. స్నానమునకు నీళ్ళు ఇవ్వటం = స్నానం అనే ఉపచారం.
7. వస్త్రం ఇవ్వటం = వస్త్రం అనే ఉపచారం.
8. యజ్ఞోపవీతం ఇవ్వటం = యజ్ఞోపవీతం అనే ఉపచారం.
9.  గంధం ఇవ్వటం = ఇదొక, ఉపచారం.
10. పుష్పం  ఇవ్వటం =ఇదొక ,ఉపచారం.
11. సుగంధం కొరకు ధూపం = వేరొక ఉపచారం.
12. దీపం వెలిగించటం ( మంగళ హారతి ) = ఇదొకఉపచారం.
13. నైవేద్యం సమర్పించటం = వేరొక ఉపచారం.
14. తాంబూలాన్ని సమర్పించటం = వేరొక ఉపచారం.
15. నమస్కారం సమర్పించటం = ఇదొక ,ఉపచారం.
16. ఉద్వాసనం సమర్పించటం =ఇదొక ,ఉపచారం  .

వీటితో పూజ ముగియును . ఇవన్ని భక్తి శ్రేద్దలతో చేసేవి కాని యాంత్రికం గా  చెసేవికావు.

  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, March 06, 2014

What is Biological clock?,జీవగడియారం అంటే ఏమిటి?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...ర్

 Q : What is Biological clock?,జీవగడియారం అంటే ఏమిటి?
Ans :మన చుట్టూ ఉన్న లోకాన్ని గమనించారా? లోకములో ప్రతిఒక్కటీ లయబద్దంగా జరగడం చూసారా? సముద్రములో అలలు లయబద్ధంగా వచ్చిపోతుంటాయి. భూమి తనచుటూ తాను లయబద్ధంగా తిరుగుతూఉంటుంది. . . అదేసమయములో సూర్యడడిచుట్టూ అంతే లయబద్ధంగా తిరుగుతుంది. ఋతువులు మారడం , పూలుపూయడం ఇలా ఎన్నో కార్యాలు లయతప్పకుండా జరుగుతాయి. మనిషికూడా ప్రకృతిలో ఓ చిన్నజీవి ... తన జీవనవిధానము ఆ లయకు లోబడి సాగించాలి, లేదంటే మానసిక అశాంతికి,శరీరక అనారోగ్యానికి గురికాకతప్పదు. అందుకు ఒక నియంత్రణ మిషను ఉండాలి . అదే మానవ జీవగడియారము.

ఒక క్రమబద్ధతతో మన జీవప్రక్రియలన్నీ జరిగేలా మెదడులోని గడియారంలో టైమ్ సెట్ అయి ఉంటుంది. ఈ గడియారాన్ని ‘జీవగడియారం’ (బయలాజికల్ క్లాక్) అంటారు. ఇది మెదడులోని హైపోథెలామస్ అనే భాగంలో ఉంటుంది. ఇది ఒక టైమ్‌టేబుల్ ప్రకారం జీవక్రియలన్నీ టెస్ట్ చేస్తుంది. ఉదాహరణకు మన పిల్లలు పెరగడానికి అవసరమైన గ్రోత్ హార్మోన్లు, థైరాయిడ్ హార్మోన్లు తెల్లవారుజామున అధికంగా స్రవిస్తాయి. ఇక మహిళల్లో నెలసరి అన్నది క్రమబద్ధంగా నెలకు ఒకసారి జరుగుతుంటుంది. రుతుస్రావాన్నే ఉదాహరణగా తీసుకుంటే అది క్రమపద్ధతిలో జరుగుతుండటమే ఆరోగ్యానికి చిహ్నం. అది తప్పిందంటే అది అనారోగ్యానికి సూచన. మన మెదడులోని జీవగడియారంలో సెట్ చేసిన విధంగానే నిద్రకు ఉపక్రమించడం వంటివి చేయాలి. మన జీవ కార్యకలాపాలన్నీ క్రమం తప్పకుండా జరిగేలా చూసుకోవాలి. అందుకే మన బాధ్యతగా మనం తినేవేళలు, నిద్రకు ఉపక్రమించే వేళలను క్రమబద్ధంగా పాటించాలి.

 కొందరు ఎంతగా మేల్కోవాలని చూసినా... రాత్రి పదికల్లా నిద్ర పట్టేస్తుంది. ఆ తర్వాత ఎంతగా ప్రయత్నించినా మెలకువతో ఉండలేరు. మరికొందరు పొద్దున్నే ఆరుకల్లా మేల్కొంటారు. అయినా వారికి హాయిగా ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఒక రోజు ఎక్కువసేపు మేల్కోవాల్సి వస్తే? మరికొందరు ఆలస్యంగా నిద్ర లేచేవారు ఒకవేళ మరీ ఉదయాన్నే లేవాల్సి వస్తే? ఆ రోజంతా వాళ్లకు డల్‌గా ఉంటుంది. చురుగ్గా ఉన్నట్లు ఉండదు. ఇలా ఎందుకు జరుగుతుంది? నిద్రకూ, వేళలకూ, ఆరోగ్యానికీ సంబంధం ఏమిటి? మన జీవితంలోని అనేక విషయాల్లో ఈ క్రమబద్ధతకు కారణం మెదడులోని జీవగడియారం (బయలాజికల్ క్లాక్). ఇలా నిద్ర విషయంలో ఒక రోజులో జరగాల్సినవన్నీ అదే క్రమంలోనూ, అలాగే కొన్ని కొన్ని సీజన్లలో జరగాల్సినవి అదే సీజన్‌లో జరగడానికి కారణం ఏమిటన్నది శాస్త్రజ్ఞుల ప్రశ్న. దీనికి సమాధానమే... మనలోని జీవగడియారం. అందులో క్రమబద్ధంగా జరిగేలా సెట్ అయి ఉన్న టైమ్ ప్రకారం జీవకార్య కలాపాలు జరుగుతుండే క్రమబద్ధతను ‘సర్కాడియన్ రిథమ్’ అంటారు.. జీవగడియారంలోని సర్కాడియన్ రిథమ్స్...దెబ్బతినడం వల్ల ఆరోగ్యంపై పడే దుష్ర్పభావాలు చాలా ఉన్నాయి.

ఇందుకు సహకరించేది మన మెదడులో మెలటోనిన్ . వాతావరణంలో కాంతి పెరిగినప్పుడు మన మెదడులో మెలటోనిన్ అనే రసాయనం ఉత్పత్తి తగ్గిపోతుంది. అది స్రవించాలంటే చీకటిగా ఉండాలి. చీకటిగా ఉన్నవేళలోనే మెదడులోని పీనియల్ గ్లాండ్ అనే గ్రంథి మెలటోనిన్‌ను స్రవిస్తుంది.

 ఆ మెలటోనిన్ పాళ్లు పెరుగుతున్నకొద్దీ చురుకుదనం తగ్గుతూ క్రమంగా నిద్రలోకి జారుకుంటారు. అలా నిద్రలోకి జారినప్పుడే గ్రోత్ హార్మోన్ల వంటివి స్రవించి బిడ్డలు పెరుగుతారు. ఇప్పుడీ కృత్రిమకాంతితో పగలు నిడివి పెరగడంతో నిద్ర తగ్గుతుంది. ఫలితంగా నిద్రతగ్గడం వల్ల వచ్చే పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలన్నీ వస్తాయి. ఇక అదేవిధంగా మనలో స్వాభావికంగా సెట్ అయి ఉన్న నిద్ర, పనివేళల సమయాలను ఇష్టం వచ్చినట్లుగా మార్చుతుండటం, 24 గంటల పాటు టీవీల్లో ప్రసారమయ్యే వినోదకార్యక్రమాలను చూస్తూ... జీవగడియారాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల కూడా నిద్రలేక వచ్చే అనర్థాలన్నీ ఏర్పడుతుంటాయి.

  • ===================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, March 01, 2014

Do we rotate along with Earth rotation,భూమితో పాటు మనం కూడా తెరుగుతామా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : భూమితో పాటు మనం కూడా తెరుగుతామా?
జ : భూమి వేగము గా ఇరుసు మీద తాను తిరుగుతున్నా దానిమీద ఉన్నటువంటి చెట్లు , జంతువులు , ఏవీ గుండ్రముగా తిరిగే భూమిమీదనుంచి పైకి ఎగిరిపోవడము లేదు. అందుకు కారణము భూమికి ఉన్నటువంటి ఆకర్షణశక్తి . ఆ ఆకర్షణశక్తి వల్లనే సముద్రజలాలు, గాలి ,వస్తువులు అన్నీ భూమిని అంటిపెట్టుకునే తిరుగుతాయి. భూబ్రమణముతో పాటు జీవులు , గాలి , నీరు అన్నీ కలసి తిరుగుతున్నాయి.. . . కాబట్టి మనకు ఆ తిరుగుడు ప్రభావము తెలియదు. వాస్తవం లో మనుషులు , నిర్మాణాలు అన్నీ భూమితోపాటు తిరుగుతాయి. 
  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-