Tuesday, April 02, 2013

మన శరీరములో బలమైన కండరము ఏది? ఎందుకు?, Which muscle group in human is Strongest?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : మన శరీరములో బలమైన కండరము ఏది? ఎందుకు?

జ : మానవశరీరములో పలుకండరభాగాలు ఉన్నాయి. ఒకే రకమైన కణాల సమూహమే కండరాలు . కండర కణజాలాలన్నీ ఒక సంధాయక కణజాలముతో ఆవరించబడి ఉంటాయి. చూసేందుకు తొడ , చాతీభాగం లో కండరాలు బలమైనవిగా కనిపిస్తాయి. కాని అన్నిటకన్నా శక్తివంతమైన కండరాలు ... దౌడకండరాలు . నోటికి ఇరువైపులా ఉండే " మాసెటర్ " అనే ఆ కండరాలు కలిసి ఇచ్చే బలం 70 కిలోల వరకూ ఉంటుంది.  నమిలేందుకు , కొరికేందుకు దోహదపడతాయి. గట్టి వస్తువులు కొరకాలంటే అంతబలము కావాలి మరి.
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...