ప్రశ్న: తీగల్లో విద్యుత్ ఎంత వేగంతో వెళుతుంది?
జవాబు: తీగల్లో విద్యుత్ ప్రవాహం గురించి రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. తీగ నిడివి A,B అనే చివర్ల (Terminals) మధ్య ఉందనుకుందాం. అపుడు A వైపు రుణ ధృవం (Negative pole), B దగ్గర ధన ధృవం (+Ve pole) ఉండేలా ఏదైనా ఒక బ్యాటరీని సంధానించారనుకుందాం. అపుడు Aనుంచి B వైపునకు ఎలక్ట్రాన్లు ప్రవహిస్తాయి. అయితే Aదగ్గర బయల్దేరిన ఎలక్ట్రాన్లుB వైపునకు నికరంగా చేరడానికి నిజంగానే కొంత సమయం పడుతుంది. ఎంత సమయం అన్న విషయం ఆ తీగకు ఉన్న విద్యన్నిరోధం (Electrical Resistance) పై ఆధారపడి ఉంటుంది. అయితే Aదగ్గర ఎలక్ట్రాన్ల ప్రవాహం మొదలయిందన్న సంకేతం మాత్రం కాంతి వేగమంత వెనువెంటనే తెలుస్తుంది. అందుకే B దగ్గర ఏదైనా విద్యుద్దీపం (Light) ఉన్నట్లయితే వెంటనే వెలుగుతుంది. కానీ A దగ్గర్నించి Bదగ్గరికి ఎలక్ట్రాన్లు చేరడాన్ని విద్యుత్ప్రవాహం (Current) అంటారు. ఇది కాంతి వేగానికి సమానం కాదు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్, రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ==================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...