ప్రశ్న: సీలింగ్ ఫ్యాను తిరిగినప్పుడు గాలి కిందికే వస్తుంది. పైకి ఎందుకు పోదు?
జవాబు: సీలింగ్ ఫ్యానులో సాధారణంగా మూడు లేదా నాలుగు రెక్కలు ఉంటాయి. ఇవి తిరిగే క్రమంలో పైనున్న గాలిని కింది వైపు నెట్టుతాయి.ఇలా జరగడానికి కారణం ఫ్యాను రెక్కల నిర్మాణమే. ఫ్యాను రెక్కల ఉపరితలం పూర్తిగా చదునుగా ఉండదు. రెక్కల ఓ అంచు మరో అంచు కన్నా ఫ్యాను మోటారు దగ్గర ఒకటి రెండు సెంటీమీటర్ల ఎత్తులో ఉంటుంది. రెక్కల నిర్మాణంలో ఈ తేడా వల్ల అవి తిరిగేప్పుడు వాటిలో పై అంచు నుంచి కింది అంచు వైపునకు గాలిని నెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి అవి గాలిని ఎంత బలంతో కిందికి తోస్తాయో, అంతే బలంతో అవి పైవైపు పోవడానికి ప్రయత్నిస్తాయి. ఇందుకు కారణం న్యూటన్ మూడో గమన సూత్రమే. అయితే అవి గట్టిగా బిగించి ఉండడం వల్ల అలా జరగదు. ఇదే సూత్రం మీద హెలికాప్టర్ పని చేస్తుంది. ఆ రెక్కలు కూడా గాలిని కిందికి నెట్టే క్రమంలోనే హెలీకాప్టర్‌ను పైకి లేప గలుగుతాయి.
- ప్రొ||ఎ. రామచంద్రయ్య,-నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ===================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...