ప్రశ్న: శీతకాలంలో కొయ్య బీరువాల కన్నా, ఇనుప బీరువాలు చల్లగా ఉంటాయి. ఎందుకు?
జవాబు: శీతకాలంలో వాతావరణంలోని గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఇళ్లలోని వస్తువుల ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇది పరిసరాల ఉష్ణోగ్రతతో పోలిసే ఎక్కువే. ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుంచి ఉష్ణం తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువులోకి ప్రవహిస్తుంది. శరీర ఉష్ణోగ్రత కన్నా తక్కువగా ఉండే ఇనుప బీరువాను మనం తాకామనుకోండి. అప్పుడు మన శరీరం నుంచి ఉష్ణం ఇనుప బీరువాలోకి ప్రవహిస్తుంది. అందువల్ల మనం ఉష్ణోగ్రతను కోల్పోవడంతో ఇనుప బీరువా చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది.
ఉష్టం త్వరగా ప్రవహించే ఇనుము, స్టీలు లాంటి పదార్థాలను ఉత్తమ వాహకాలు (good conductors) అని అంటారు. కాబట్టి ఈ పదార్థాలతో తయారైన వస్తువులను తాకినప్పుడు అవి మన శరీరం నుంచి ఉష్ణాన్ని త్వరగా గ్రహిస్తాయి. అందుకే ఇనుప బీరువా చల్లగా అనిపిస్తుంది. కొయ్య, ప్లాస్టిక్‌లాంటివి అధమ వాహకాలు(Insulators). కాబట్టి అవి మన శరీరం నుంచి ఉష్ణాన్ని అంత త్వరగా గ్రహించక పోవడంతో అంత చల్లగా అనిపించవు. ఆ విధంగా శీతకాలంలో కొయ్య బీరువాల కన్నా ఇనుప బీరువాలు ఎక్కువ చల్లన.
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...