Wednesday, March 27, 2013

Red eye of Weaping,ఏడిస్తే కళ్ళు ఎందుకు ఎరుపెక్కుతాయి ?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ప్ర : ఏడిస్తే  కళ్ళు ఎందుకు ఎరుపెక్కుతాయి ?

జ : కంటి కుదుళ్ళ నుండి నిత్యం కన్నీరు స్రవిస్తూనే ఉంటుది . సాధారణ పరి్స్థితులలో ఈ కన్నీరు పరిమితం గా స్రవిస్తుంది . మరి ఏడవడం అంటే ఒక మానసికపరమైన (emotional) అనియంత్రితమైన (involuntary) దైహిక స్పందన . గుండె వేగము గా కొట్టుకోవడము , రక్తప్రసరణ వేగముగా ఉండడము , ఉద్వేగానికి గురికావడం , ఇతర ఆలోచనలు , తార్కిక దృష్ఠి లోపించడము ఏడుపు సమయము లో సంభవిస్తాయి. అలాగే గొంతు గాద్గదికం కావడము , ముక్కు కారడం , మాటలు తడబడడము జరుగుతాయి. ఏడ్చే టపుడు కళ్ళలో లాక్రిమల్  గ్రందులు ఎక్కువగా నీటిని స్రవించడానికి వాటిలోనూ , కంటి పొరలలోను ఎక్కువ రక్తము సరఫరా అవడానికి  రక్తకేశనాళికలు (blood capillaries) ఉబ్బుతాయి. అలా ఉబ్బినవి పారదర్శకముగా ఉండే తెల్లగుడ్దు కింద నుంచి కనిపించడం వలనే కళ్ళలో ఎరుపు , ఎర్రటి జీరలు కనిపిస్తాయి.


  • =========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...