ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర: డ్రై ఐస్ అంటే ఏమిటి? దాన్ని తాకితే ఏమవుతుంది ?
జ : డ్రై ఐస్ .. ఘనీభవించిన కార్బన్‌డైఆక్షైడ్ వాయువు, . దీనికి ఉత్పతనము (sublimation) అనే ధర్మము ఉంటుంది . . _ . . అంటే డ్రై ఐస్ కరిగిపోతున్నప్పుడు మామూలు ఐస్ లా ద్రవరూపములోకి మారకుండా నేరుగా వాయు రూపము లోకి కార్బన్‌డైఆక్షైడ్ గా మారుతుంది. డ్రై ఐస్ ఉష్ణోగ్రత అతి తక్కువ గా అంటే మైనస్ 78.5 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అందువల్ల దాన్ని నేరుగా తాకకూడదు . చేతులకు మందము గా ఉండే తొడుగులు (గ్లౌజ్) వేసుకొని తాకాలి . లేకపోతే అతి శీతలం గా ఉంటే దాని ఉష్ణోగ్రత వలన చేతివేళ్ళ పై ఉంటే చర్మానికి ఎంతో హాని కలుగు తుంది . డ్రై ఐస్ చర్మములోని కణాలను గడ్డకట్టిస్తుంది. దాని ఫలితము గా ఏర్పడిన గాయము నిప్పువల్ల కాలిన గాయము కంటే ఎక్కువగ భాదించడమే కాకుండా మానడము కూడా చాలా కస్టము అవుతుంది. ఆ గాయము మానడానికి ప్రత్యేక చికిత్స అవసరము .
ఆ కారణము గానే మామూలు ఐస్ గడ్డ లాగా డ్రై ఐస్ ను రుచిచూడడము , తినే సాహసము చేయకూడదు .అలాచేయడము భగ భగ మండే నిప్పు-కణికను మింగినట్లే నోటిలో అతిప్రమాదకరమైన బొబ్బలు ఏర్పడడమే కాకుండా గొంతు, అన్నవాహిక లోని కొన్ని భాగాలకు హాని కలుగుతుంది.
- =====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...