ప్రశ్న: గరిటతో పెద్ద స్టీలు గిన్నెను కొడితే, శబ్దం దేని నుంచి వస్తుంది?
జవాబు: శబ్దం గిన్నె నుంచే వస్తుంది. ధ్వని కంపించే వస్తువు(vibrating body) నుంచే వస్తుంది. ఉదాహరణకు వీణ తీగను మీటినా, తబలాపై సాగదీసి అమర్చిన చర్మంపై తట్టినా అవి కంపనాలు చేయడం వల్లనే ధ్వని ఉద్భవిస్తుంది. ఈ కంపనాలను 'స్వేచ్ఛా కంపనాలు' (free vibrations) అంటారు. గిన్నెను గరిటతో కొట్టినప్పుడు తన్యత (tension)తో ఉన్న గిన్న నుంచి స్వేచ్ఛాకంపనాలు పుడతాయి. వాటితో పాటు గిన్నెలో ఉన్న గాలిలో బలాత్కృత కంపనాలు(forced vibrations) ఏర్పడడంతో శబ్ద తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
గరిటలో కూడా కొన్ని కంపనాలు కలిగినా అది మన చేతిలో ఉండడంతో వాటి వల్ల కలిగే శబ్దం చేతిలో లీనమైపోతుంది. అదే గరిటను కొంచెం ఎత్తు నుంచి కిందకు గచ్చుపైకి వదిలేస్తే ఘల్లుమనే శబ్దం వినిపిస్తుంది. ఈ శబ్దం గరిట చేసే కంపనాల వల్ల వస్తుంది.
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...