ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: ఏదైనా విషయంలో కలవరపడినప్పుడు, విభ్రాంతికి లోనయినప్పుడు మన ముఖం ఎర్రబడుతుంది. ఎందుకు?
జవాబు: చర్మంలో రక్తనాళాలు వ్యాకోచిస్తే, మన శరీరం కొంత ఎర్రబడుతుంది. ఏదైనా శారీరక శ్రమ చేసినా, పరిసరాల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నా ఇలా జరుగుతుంది. మనం ఉన్నట్టుండి ఉద్రేకపడినా, అయిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నా మన శరీరంలో ఒత్తిడి (stress) కలిగించే హార్మోన్లు అధిక రక్తపోటును కలిగిస్తాయి. దాంతో చర్మానికి ఎక్కువ రక్తం ప్రసరిస్తుంది. ఈ మార్పు ముఖం, మెడలపై స్పష్టంగా కనిపిస్తుంది. దీన్నే ముఖం కందిపోవడం, జేవురించడం, ఎర్రబడడం అంటారు. మొహం కందగడ్డలా మారిందనడం కూడా ఇందువల్లే. ఇలా ముఖం ఎరుపెక్కడం కొన్ని క్షణాల పాటే ఉంటుంది. కొందరిలో ఈ మార్పు కనిపించదు. కొందరిలో కొన్ని కారణాల వల్ల ముఖానికి రక్తప్రసరణ ఎక్కువ కాలం జరిగి ఎర్రబడు తుంది. ఈ ఆరోగ్య సమస్యను 'ఎరిత్రోఫోబియా' అంటారు. దీనిని సైకోథెరపీ, రిలాక్సికేషన్ థెరపీల ద్వారా నివారించవచ్చు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...