ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న : మీరు భూమి మీద కంటే చంద్రునిపై తక్కువ బరువు ఉంటారెందుకు?
సమాధానం : మీరు చంద్రునిపై తక్కువ బరువు ఉంటారు . కారణం చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే తక్కువ ఉంటుంది. గురుత్వాకర్షణ సూత్రంగా అన్ని వస్తువులు తమ ద్రవ్యరాశితో నిష్పత్తిలో ఒకదానికొకటి ఆకర్శించుకోంటాయి . చంద్రుని రాశి భూమి ద్రవ్యరాశిలో 1/6 మాత్రమే , కావున గురుత్వాకర్షణ శక్తి దానికి తగ్గట్టు గా బలహీనమవుతుంది కాబట్టి.
, మీ మాస్ మార్పు లేదు కాని బరువు పూర్తిగా గురుత్వాకర్షణ శక్తి యొక్క విధి కి లోబడి మాత్రమే ఉంటుంది , అందువలన సాధారణంగా ఓ గ్రహపు గురుత్వాకర్షణ శక్తి ఆ గ్రహపు ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి అనడం కన్నా గురుత్వాకర్షణ బలం అనడం మరింత శాస్త్రీయం. 205 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల వస్తువుపై ఎంత త్వరణం (acceleration)కలిగించే సత్తా ఉందో ఆ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు. మన భూమికి ఇది 9.8 న్యూటన్లు కాగా, బుధగ్రహంపై ఇది కేవలం 3.8 న్యూటన్లు మాత్రమే. చంద్రునిపై ఇది సుమారు 1.4 న్యూటన్లు. అయితే మన సౌర మండలంలో అతి పెద్ద గ్రహమైన బృహస్పతి (జ్యూపిటర్)పై ఉండే గురుత్వాకర్షక బలం సుమారు 24.8 న్యూటన్లు. అంటే భూమిపై 100 కిలోల బరువుండే ఒక వస్తువు బృహస్పతిపై సుమారు 250 కిలోల బరువు తూగుతుంది. అదే వస్తువు చంద్రుడిపై కేవలం 15 కిలోలు మాత్రమే ఉంటుంది..
సూర్యుడు కూడా ఒక నక్షత్రమే . అది 5 బిలుయన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని అంచనా. మరో 5 బిలియన్ల సంవత్సరాలు వరకు ఇదే కాంతితో నిలిచి ఉంటుందని అంచనా .. అన్నిట కంటే పెద్ద గ్రహము కాబట్టి భూమిమీద 60 కిలోల బరువు ... చంద్రుని మీద 10 కిలోలు , సూర్యుని మీద 1680 కిలోలు అవుతుంది . సూర్యుని గురుత్వాకర్షణ బలం 156.8 న్యూటన్లు గా అంచనా.
- ===================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...