Thursday, April 25, 2013

Where is Hot summer in the world?,తీవ్రమైన వేసవి ఎక్కడ ఉంటుంది?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : తీవ్రమైన వేసవి ఎక్కడ ఉంటుంది?

జ : ప్రపంచములో అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతము " లున్‌ గనానె" ఇది ఆఫ్రికా ఖండపు తూత్పుభాగము లోని  సొమాలియాలో ఉన్నది. ఇక్కడి ఉష్ణోగ్రత ఏ రోజూ 31డిగ్రీల సెంటిగ్రేడ్ కి తగ్గదు . ఎల్లప్పుడూ వేసవికాలముగానే ఉంటుంది.  అయితే ఆఫ్రికా ఖండం లో అత్యధిక ఉష్ణోగ్రను ఒకరోజూ నమోదు జరిగినది ' ఆల్ అజీజియా' అనేచోట ... లిబియా దేశములో వున్న ఇక్కడ ఒకసారి 57.8 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు అయినది.
  • ==================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, April 22, 2013

Rains are veryless in deserts Why?,ఎడారులలో వర్షాలు కురవవు. ఎందువల్ల?

  •  
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఎడారులలో వర్షాలు కురవవు. ఎందువల్ల?

జవాబు: భూమిపై ఒక ప్రాంతం ఉండే ఉన్నతాంశం(Altitude)అంటే ఎత్తు లేక లోతులపై అక్కడ కురిసే వర్షపాతం ఆధారపడి ఉంటుంది. వర్షాలు కురిసేది ఆకాశంలో ఏర్పడే మేఘాల వల్లే. నీటికి నిలయమైన నదులు, సరస్సులు, సముద్రాల నుంచి నీరు సూర్యరశ్మికి ఆవిరయి భూ ఉపరితలం నుంచి పైకి వెళ్లి అక్కడ ఘనీభవించడంతో మేఘాలు ఏర్పడతాయి. ఈ మేఘాలు వాతావరణ పీడనంలోని హెచ్చుతగ్గులు, గాలులు వీచే దిశలను బట్టి పయనించి చెట్లు, అరణ్యాలు ఉండే ప్రదేశాల్లో, వాతావరణంలో తగినంత తేమ ఉండే ప్రాంతాల్లో వర్షిస్తాయి.

ఎడారులలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల చెట్లు, చేమలు లేకపోవడంతో అక్కడి గాలి పొడిగా ఉంటుంది. ఆ ప్రాంతాలకు చేరుకున్న మేఘాలు కురవకుండానే ఆ ప్రాంతాలను దాటివెళ్తాయి. నీటి వనరులు ఏమీ లేకపోవడంతో, ఎడారులుండే ప్రాంతాల్లో మేఘాలు ఏర్పడే అవకాశం కూడా ఉండదు. అక్కడక్కడ ఉండే ఒయాసిస్సులలోని కొద్ది పాటి నీరు సూర్యరశ్మికి ఆవిరయి, చిన్న చిన్న మేఘాలు ఏర్పడినా, అవి అక్కడి అధిక వేడితో ఆవిరయిపోతాయి.

ఆకాశంలో పయనించే మేఘాలను ఎత్తయిన పర్వతాలు అడ్డుకున్నా వర్షాలు కురుస్తాయి. ఎడారులను ఆనుకొని సాధారణంగా పర్వతాలు ఉంటాయి. ఉదాహరణకు అతిపెద్దదైన సహారా ఎడారిని ఆనుకొని ఉండే పర్వత శ్రేణులు నీరు, మంచు ముక్కలను మోసుకొస్తున్న మేఘాలను అడ్డుకోవడంతో ఆ పర్వతాలకు ఒక వైపున ఉండే ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఆ ప్రాంతంలోని నేల అతిసారవంతంగా ఉంటే, ఆ పర్వతాలకు మరోవైపున వర్షాలు ఏమాత్రం కురవక పోవడంతో ఆ ప్రాంతం ఎడారిగా మారుతుంది. భూమిపై ఉండే ఎడారులన్నీ ఇలా ఏర్పడినవే. ఎడారుల్లో అప్పుడప్పుడూ కొన్ని జల్లులు పడతాయి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What about chocolate hills? చాక్లెట్‌ హిల్స్ సంగతేమిటి?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. 
చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ఒకేచోట... ఒకే రంగులో... వందలాదిగా పరుచుకున్న గుట్టలు... ఎలా ఏర్పడ్డాయో? ఎప్పుడు ఏర్పడ్డాయో... అంతా అంతుపట్టని వింత... అవే చాక్లెట్‌ హిల్స్‌!

ఇంట్లో అమ్మ పిండి వడియాలు పెట్టినప్పుడు చూడండి, అన్నీ ఒకే తీరుగా పొందిగ్గా పరుచుకుని ఉంటాయి. అచ్చు అలాగే ప్రకృతి పెట్టిన పెద్దపెద్ద వడియాలు ఫిలిప్పీన్స్‌లో ఉన్నాయి. వీటిని ఆకాశం నుంచి చూస్తే ఆ ప్రాంతంలో అచ్చు వడియాలు ఎండబెట్టినట్టే ఉంటుంది. దగ్గర్నుంచి చూస్తే మాత్రం ఒక్కోటి వందలాది అడుగుల ఎత్తుండే గుట్టలే. ప్రపంచంలోని అంతుపట్టని ప్రకృతి వింతల్లో ఇవీ ఒకటి. ఫిలిప్పీన్స్‌లో 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరుచుకుని ఉన్న వీటిని చాక్లెట్‌ హిల్స్‌ అంటారు. మొత్తం వీటి సంఖ్య ఎంతో తెలుసుకునేందుకు ఇటీవలే ఓ సర్వే చేశారు. ఆ సర్వేలో ఇవి మొత్తం 1776 ఉన్నట్టు తేలింది. ఈ ప్రాంతం యునెస్కోవారి ప్రపంచ వారసత్వ సంపదల్లో కూడా చోటు సంపాదించింది.

అయినా వీటికి చాక్లెట్లకి ఏమిటి సంబంధం? అంటే ఏమీ లేదు. కాస్త వర్షాలు పడి పచ్చగా ఉన్నప్పుడు ఈ గుట్టలపై గడ్డి పెరిగి అన్నీ ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. అదే ఎండాకాలంలో మొత్తం ఎండిపోయి చాక్లెట్‌ రంగులోకి మారిపోతాయి. అందుకే వీటికి చాక్లెట్‌ హిల్స్‌ అని పేరు పెట్టారు. ఇవి ఒక్కోటి 98 అడుగుల నుంచి 390 అడుగుల వరకు ఎత్తు ఉంటాయి. అయితే ఈ గుట్టలు ఎప్పుడు? ఎలా ఏర్పడ్డాయో? మాత్రం ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. కోట్ల ఏళ్ల క్రితం సముద్రంలో ఏర్పడిన అగ్నిపర్వతం వల్ల ఇవి ఏర్పడ్డాయని కొందరు చెపితే, పగడపు దీవులు ఇలా గుట్టలుగా ఏర్పడ్డాయని మరికొందరు భావించారు. అయితే ఈ గుట్టల్లో ఉండే సున్నపు రాయి మాత్రం సముద్రానికి చెందిందేనని తేల్చారు. అంతేకాదు ఈ గుట్టల్ని తవ్వితే సముద్ర జీవుల అవశేషాలు బయటపడ్డాయి. వీటి రహస్యాన్ని కనిపెట్టేందుకు ఇప్పటికీ పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి.

చాక్లెట్‌ హిల్స్‌ వెనుక ఆ ప్రాంతంలో కొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. చాలా ఏళ్ల క్రితం ఆ ప్రాంతంలో కొండంత ఎత్తుండే ఇద్దరు రాక్షసులు కొట్టుకున్నారు. పెద్ద రాళ్లను విసురుకున్నారు. చాలా రోజులు యుద్ధం చేసుకున్నాక, అలసిపోయి వెళ్లిపోయారు. వారు విసురుకున్న రాళ్లు మాత్రం అక్కడే ఉండిపోయాయి. అవే చాక్లెట్‌ హిల్స్‌ అంటారు. మరో కథలో అరోగో అనే ఓ ప్రేమికుడు అలోయో అనే అమ్మాయిని ఇష్టపడతాడు. అయితే అనుకోకుండా ఆమె చనిపోవడంతో 'అలో... అయో...' అని ఏడవసాగాడు. అతడి కన్నీటి చుక్కలే భూమిపై పడి ఇలా చాక్లెట్‌ హిల్స్‌ కింద మారాయని అంటారు.
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, April 18, 2013

Iron shelf cool why?,ఇనుప బీరువా చల్లనేల?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: శీతకాలంలో కొయ్య బీరువాల కన్నా, ఇనుప బీరువాలు చల్లగా ఉంటాయి. ఎందుకు?

జవాబు: శీతకాలంలో వాతావరణంలోని గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఇళ్లలోని వస్తువుల ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉంటుంది. ఇది పరిసరాల ఉష్ణోగ్రతతో పోలిసే ఎక్కువే. ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుంచి ఉష్ణం తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువులోకి ప్రవహిస్తుంది. శరీర ఉష్ణోగ్రత కన్నా తక్కువగా ఉండే ఇనుప బీరువాను మనం తాకామనుకోండి. అప్పుడు మన శరీరం నుంచి ఉష్ణం ఇనుప బీరువాలోకి ప్రవహిస్తుంది. అందువల్ల మనం ఉష్ణోగ్రతను కోల్పోవడంతో ఇనుప బీరువా చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది.
ఉష్టం త్వరగా ప్రవహించే ఇనుము, స్టీలు లాంటి పదార్థాలను ఉత్తమ వాహకాలు (good conductors) అని అంటారు. కాబట్టి ఈ పదార్థాలతో తయారైన వస్తువులను తాకినప్పుడు అవి మన శరీరం నుంచి ఉష్ణాన్ని త్వరగా గ్రహిస్తాయి. అందుకే ఇనుప బీరువా చల్లగా అనిపిస్తుంది. కొయ్య, ప్లాస్టిక్‌లాంటివి అధమ వాహకాలు(Insulators). కాబట్టి అవి మన శరీరం నుంచి ఉష్ణాన్ని అంత త్వరగా గ్రహించక పోవడంతో అంత చల్లగా అనిపించవు. ఆ విధంగా శీతకాలంలో కొయ్య బీరువాల కన్నా ఇనుప బీరువాలు ఎక్కువ చల్లన.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why do fan air go up?,ఫ్యాన్‌ గాలి పైకి పోదేం?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: సీలింగ్‌ ఫ్యాను తిరిగినప్పుడు గాలి కిందికే వస్తుంది. పైకి ఎందుకు పోదు?

జవాబు: సీలింగ్‌ ఫ్యానులో సాధారణంగా మూడు లేదా నాలుగు రెక్కలు ఉంటాయి. ఇవి తిరిగే క్రమంలో పైనున్న గాలిని కింది వైపు నెట్టుతాయి.ఇలా జరగడానికి కారణం ఫ్యాను రెక్కల నిర్మాణమే. ఫ్యాను రెక్కల ఉపరితలం పూర్తిగా చదునుగా ఉండదు. రెక్కల ఓ అంచు మరో అంచు కన్నా ఫ్యాను మోటారు దగ్గర ఒకటి రెండు సెంటీమీటర్ల ఎత్తులో ఉంటుంది. రెక్కల నిర్మాణంలో ఈ తేడా వల్ల అవి తిరిగేప్పుడు వాటిలో పై అంచు నుంచి కింది అంచు వైపునకు గాలిని నెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి అవి గాలిని ఎంత బలంతో కిందికి తోస్తాయో, అంతే బలంతో అవి పైవైపు పోవడానికి ప్రయత్నిస్తాయి. ఇందుకు కారణం న్యూటన్‌ మూడో గమన సూత్రమే. అయితే అవి గట్టిగా బిగించి ఉండడం వల్ల అలా జరగదు. ఇదే సూత్రం మీద హెలికాప్టర్‌ పని చేస్తుంది. ఆ రెక్కలు కూడా గాలిని కిందికి నెట్టే క్రమంలోనే హెలీకాప్టర్‌ను పైకి లేప గలుగుతాయి.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ===================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

How the chick respirate inside egg?,గుడ్డులో పక్షి వూపిరి పీల్చదా?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: గుడ్లలో పిండ రూపంలో ఉండే పక్షిపిల్లలు ఎలా శ్వాసిస్తాయి?

జ: పక్షుల గుడ్లపై ఉండే పెంకు (shell)గాలి ప్రవేశించడానికి అడ్డంకి కాదు. దాంట్లో మన కంటికి కనబడని అతి సన్నని రంధ్రాలు ఉంటాయి. వాటి ద్వారా వాయువులు లోపలికి, వెలుపలకు వ్యాపిస్తూనే ఉంటాయి. గుడ్లలో ఉండే పక్షి పిల్లల పిండాలకు వూపిరితిత్తులంటూ ఏమీ ఉండవు. కానీ ఆ పిండాన్ని అంటుకొని పెరుగుతూ ఉండే ఆంత్రం (పేగు)కు అనుసంధానమై 'ఎలనాటిస్‌' (Allanotis)అనే పలుచని పొర ఉంటుంది. ఈ పొర ద్వారానే పక్షి పిండం శ్వాసిస్తుంది. ఈ పొర టమోటా సాస్‌లాగా ఒక మడతపై మరొకటి పరుచుకొని వలలోని అల్లికలాగా సున్నితమైన రక్తనాళాలు కలిగి ఉంటుంది. వాతావరణంలోని ఆక్సిజన్‌ ఈ రక్తనాళాల ద్వారా వెలుపల నుండి గుడ్డులోకి ప్రవేశిస్తుంది. అలాగే లోపల నుండి కార్బన్‌ డై ఆక్సైడ్‌ వెలుపలికి పోతుంది.

ఈ 'ఎలనాటిస్‌', సృష్టి ఆరంభంలో ప్రాణులు సముద్రాల నుండి భూమిపైకి వచ్చి రూపాంతరం చెందడంతో ప్రముఖ పాత్ర వహించింది. చేపలు, ఉభయచరాలైన కప్పల వంటి ప్రాణుల గుడ్లలో ఇది ఉండదు. కాని పక్షులు, పాకుడు జంతువులైన పాముల గుడ్లలో ఉంటుంది. పాలిచ్చే ప్రాణులు, ముఖ్యంగా మానవులలో ఈ ఎలనాటిస్‌ బొడ్డుతాడు (Umbilical cord) రూపంలో వృద్ధి చేందుతుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌
  • =====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Is Univers increasing in temperature?,విశ్వం కాలంతో పాటు వేడెక్కుతోందా?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: విశ్వంలో ఉష్ణోగ్రత స్థాయి కాలంతో పాటు ఎక్కువవుతుందా?

జ: కోట్లాది సంవత్సరాల నుంచి విశ్వంలో ఉండే నక్షత్రాలన్నీ అంతరిక్షంలోకి వెలుగు, వేడిని వెదజల్లడం వల్ల ఈ పాటికి విశ్వమంతా కొంత మేరకు వేడెక్కుతూ ఉంటుందని అనుకోవచ్చు. కానీ విశ్వం నిరంతరం వ్యాపిస్తూ ఉండటం వల్ల (Expanding Universe) నక్షత్రాలు వెదజల్లే ఉష్ణ వ్యాపనం కూడా అతి నెమ్మదిగా జరుగుతుందనే విషయాన్ని కూడా మనం మరవకూడదు. అందువల్ల 14 బిలియన్ల సంవత్సరాల క్రితం బిగ్‌బ్యాంగ్‌ వల్ల ఏర్పడిన విశ్వంతోపాటు ఆవిర్భవించిన ఉష్ణం క్రమేపీ నెమ్మదిగా తగ్గిపోతూ ఉంది.

ఖగోళ శాస్త్రవేత్తలు 2008లో ప్రపంచంలో ఉండే అతి పెద్ద టెలిస్కోపుతో 11 బిలియన్‌ కాంతి సంవత్సరాల దూరంలో ఉండే గెలాక్సీలోని కార్బన్‌ మోనాక్సైడ్‌ అణువులను పరిశీలించారు. ఆ అణువుల ప్రవర్తన ఆధారంగా వాటి పరిసరాలలో ఉండే ఉష్ణోగ్రతలను అధ్యయనం చేశారు. ఆ పరిశోధనల మూలంగా ప్రస్తుతం ఉండే ఉష్ణోగ్రతల కన్నా అప్పటి ఉష్ణోగ్రతలు ఏడు డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా ఉన్నాయని ధృవీకరించారు. అంటే విశ్వంలో ఉష్ణోగ్రత స్థాయి నెమ్మదిగా తగ్గుతుందని తేలిందన్నమాట. కానీ భూవాతావరణంలో మాత్రం మానవ తప్పిదమైన వాతావరణ కాలుష్యం వల్ల ఉష్ణోగ్రత స్థాయి నెమ్మదిగా హెచ్చుతుంది!

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • ===========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, April 17, 2013

what is the speed of Electricity in wires?,తీగల్లో విద్యుత్‌ ఎంత వేగంతో వెళుతుంది?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: తీగల్లో విద్యుత్‌ ఎంత వేగంతో వెళుతుంది?

జవాబు: తీగల్లో విద్యుత్‌ ప్రవాహం గురించి రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. తీగ నిడివి A,B అనే చివర్ల (Terminals) మధ్య ఉందనుకుందాం. అపుడు A వైపు రుణ ధృవం (Negative pole), B దగ్గర ధన ధృవం (+Ve pole) ఉండేలా ఏదైనా ఒక బ్యాటరీని సంధానించారనుకుందాం. అపుడు Aనుంచి B వైపునకు ఎలక్ట్రాన్లు ప్రవహిస్తాయి. అయితే Aదగ్గర బయల్దేరిన ఎలక్ట్రాన్లుB వైపునకు నికరంగా చేరడానికి నిజంగానే కొంత సమయం పడుతుంది. ఎంత సమయం అన్న విషయం ఆ తీగకు ఉన్న విద్యన్నిరోధం (Electrical Resistance) పై ఆధారపడి ఉంటుంది. అయితే Aదగ్గర ఎలక్ట్రాన్ల ప్రవాహం మొదలయిందన్న సంకేతం మాత్రం కాంతి వేగమంత వెనువెంటనే తెలుస్తుంది. అందుకే B దగ్గర ఏదైనా విద్యుద్దీపం (Light) ఉన్నట్లయితే వెంటనే వెలుగుతుంది. కానీ A దగ్గర్నించి Bదగ్గరికి ఎలక్ట్రాన్లు చేరడాన్ని విద్యుత్ప్రవాహం (Current) అంటారు. ఇది కాంతి వేగానికి సమానం కాదు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  •  ==================================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, April 15, 2013

Is all liquid in side earth?, భూమి లోపల ఉండేదంతా ద్రవపదార్థమేనా?,

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్రశ్న: భూమి లోపల ఉండేదంతా ద్రవపదార్థమేనా?

జవాబు: భూమిని ఒక యాపిల్‌ పండు అనుకుంటే, ఆ పండు పై తొక్కతో, భూమి పైపొర (crust)ను పోల్చవచ్చు. ఈ పొర మందం సగటున దాదాపు 30 కిలోమీటర్లు ఉంటే, సముద్రాల కింద దాని మందం సుమారు 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పైపొరపై సరాసరి ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది. ఈ పొరలో ఆక్సిజన్‌, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్‌, కాల్షియం, సోడియం, పొటాషియం, ఇనుము ఉంటాయి. ఇదే మనం నుంచునే గట్టి నేల.

భూమిపై పొరకు దిగువన ఉండే ప్రాంతం భూఆవరణ (Mantle). ఇందులో అధిక భాగం ద్రవ రూపంలో ఉండే శిలలే. చిక్కటి పాకంలా ఉండే ఈ ద్రవాన్ని శిలాద్రవం అంటారు. ఈ ప్రాంతం భూమికి 40 కిలోమీటర్ల లోతు నుంచి 2900 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది. ఇక్కడి ఉష్ణోగ్రత 1500 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 3000 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉంటుంది. దీనిలో ఆక్సిజన్‌ వాయువు, సిలికాన్‌, అల్యూమినియం, ఇనుప ఖనిజాలు ఉంటాయి.

భూమి లోపల 2900 కిలోమీటర్ల నుంచి భూకేంద్రం వరకు ఉండే ప్రాంతాన్ని భూమి అంతర్భాగం (core) అంటారు. ఈ మొత్తం ప్రాంతాన్ని రెండు భాగాలనుకుంటే, ఔటర్‌కోర్‌లో ఇనుము, నికెల్‌ ద్రవరూపంలో ఉంటాయి. ఇన్నర్‌కోర్‌లో కూడా ఇవి ద్రవరూపంలో ఉన్నప్పటికీ అక్కడి పీడనం భూమిపై ఉండే పీడనం కన్నా 3.5 మిలియన్ల రెట్లు అధికంగా ఉండడంతో ఘనరూపంలో ఉండే బంతిలాగా ఉంటాయి. ఇక్కడి ఉష్ణోగ్రత సూర్యుడి ఉపరితలంలో ఉండే ఉష్ణోగ్రతకు సమానంగా 5000 నుంచి 6000 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది.

Courtesy with Eenadu Hai bujji 
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Do you know Bird eating Spider?,పక్షుల్ని తినే సాలీడు గురించి తెలుసా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

    సాలీడు ఏం తింటుంది?దోమల్లాంటి చిన్న చిన్న కీటకాల్ని...కానీ పక్షుల్ని, పాముల్ని కూడా తినే సాలీడు గురించి తెలుసా?అదే ఇది!

ఎంత పెద్దగా ఉందో! మీ ఇంట్లో గూడు అల్లుకునే సాలీడు మీ గోరంత ఉంటే, ఇది ఏకంగా మీరు అన్నం తినే కంచమంత ఉంటుంది. అందుకే ఇది

ప్రపంచంలోని సాలీళ్లన్నింటిలోకీ అతి పెద్దది! దీని పేరేంటో తెలుసా? 'గోలియత్‌ బర్డ్‌ ఈటింగ్‌ స్పైడర్‌'. అంటే పక్షుల్ని తినే సాలీడని అర్థం! ఇది

విషపూరితమైనది కూడా!

* 'తరంతులా' అనే జాతి సాలీళ్లలో ఇది కూడా ఒకటి. తరంతులా సాలీళ్లలో ఏకంగా 900 జాతులున్నాయి. మరి ప్రపంచంలోని మొత్తం సాలీళ్లు ఎన్ని

జాతులో తెలుసా? 40,000కు పైగానే!

* ఎక్కువగా అమెరికా అడవుల్లో ఉండే ఈ రాకాసి సాలీడు తీరే వేరు! దీని ఒంటి నిండా వెంట్రుకలు ఉంటాయి. ఇవి వాటిని ఎదుటి జీవిపైకి బాణాల్లాగా

విసరగలదు కూడా! ఆ వెంట్రుకలు గుచ్చుకుంటే ఏ జీవైనా విలవిల్లాడాల్సిందే!

* ఇది ఎనిమిది కాళ్లనూ విప్పిందంటే 12 అంగుళాల స్థలాన్ని ఆక్రమిస్తుంది.

* ఇది అన్ని సాలీళ్లలాగా గూడు కట్టదు. బొరియల్లో జీవించే దీనికి ఎనిమిది కాళ్లతో పాటు ఎనిమిది కళ్లుంటాయి. రెండు కోరలు కూడా ఉంటాయి. ఒకోటీ

అంగుళం పొడవుంటే ఈ కోరల్లో విషం ఉంటుంది. వీటితో గుచ్చిందంటే ఇక ఆ జీవి కదల్లేదు.

* ఇవి పాములు, పక్షులు, కప్పలు, తొండల్లాంటి జీవులపై అమాంతం దూకి కోరలతో కాటేస్తాయి. ఆ విషం వల్ల వాటి శరీరంలో కండరాలన్నీ మెత్తగా

అయిపోతాయి. అప్పుడు ఆ సారాన్ని ఇది పీల్చేస్తుందన్నమాట!

* దీనికింకో విద్య కూడా ఉంది. వెంట్రుకలతో ఉన్న కాళ్లను ఒకదానికి ఒకటి రుద్దిందంటే 'హిస్స్‌స్‌స్‌...' మనే శబ్దం వస్తుంది. ఇది ఏకంగా 15 అడుగుల

దూరం వినిపిస్తుంది!

* వీటిలో ఆడవి 25 సంవత్సరాలు బతికితే, మగవి ఆరేళ్లే ఉంటాయి. మగవాటిని ఆడవి చంపి తినేయడమే కారణం!

* ఇవి 400 గుడ్లు పెడతాయి. వాటి నుంచి రెండు నెలల్లో పిల్లలు వస్తాయి. పుట్టగానే సొంతంగా జీవిస్తాయి!
  • ====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, April 02, 2013

Which is first Hen? or Egg?,పెట్ట ముందా? గుడ్డు ముందా? ఎలా?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : పెట్ట ముందా? గుడ్డు ముందా? ఎలా?

జ : పెట్ట ముందా.. గుడ్డు ముందా.. అనేది చలాకాలం గా ఎవరికీ అంతుపట్టని , పరిష్కారములేకుండా ఉండిపోయిన ప్రశ్న . చివరికి ఇప్పుడు పెట్ట కాదు గుడ్డే ముందని తేల్చారు శాస్త్రజ్ఞులు .
ఎలా > గుడ్డు పెట్టడమనేది పక్షుల కన్నా ముందే ఈ భూమిమీద పరిణమించిన సరీసృపాలకు ఉన్న లక్షణము . సరీసృవం అంటే .. బల్లి, పాము , మొసలి వంటివి.  డైనోసార్లు గుడ్డు పెట్టేవి. అటువంటి గుడ్డు నుండి వచ్చిన ఒక బుల్లి డైనోసార్ వంటిజీవే పక్షిగా పరిణమించినది . తన పూర్వీక జీవుల లక్షణమైన గుడ్డుపెట్టడం కొనసాగించింది. . . కాబట్టి గుడ్డే ముందు అని  .. ఆ గుడ్డు నుండే పెట్ట వచ్చినదని , దీనికి తిరుగులేదని ఇతర సాక్ష్యాలతో సహా నిరూపించారు పరిశోదకులు.
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

మన శరీరములో బలమైన కండరము ఏది? ఎందుకు?, Which muscle group in human is Strongest?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : మన శరీరములో బలమైన కండరము ఏది? ఎందుకు?

జ : మానవశరీరములో పలుకండరభాగాలు ఉన్నాయి. ఒకే రకమైన కణాల సమూహమే కండరాలు . కండర కణజాలాలన్నీ ఒక సంధాయక కణజాలముతో ఆవరించబడి ఉంటాయి. చూసేందుకు తొడ , చాతీభాగం లో కండరాలు బలమైనవిగా కనిపిస్తాయి. కాని అన్నిటకన్నా శక్తివంతమైన కండరాలు ... దౌడకండరాలు . నోటికి ఇరువైపులా ఉండే " మాసెటర్ " అనే ఆ కండరాలు కలిసి ఇచ్చే బలం 70 కిలోల వరకూ ఉంటుంది.  నమిలేందుకు , కొరికేందుకు దోహదపడతాయి. గట్టి వస్తువులు కొరకాలంటే అంతబలము కావాలి మరి.
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-