ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న : హిందూ దేవుళ్ళ వాహనాల గురించి తెలుపగలరు?
జ : దేవుళ్ళకు ,దేవతలకు రకరకాల వాహనాలు ఉన్నాయి. కారణాలు ఎన్నోఉన్నా పురాణాల రహస్యాలు తెలుసుకోవడము అంత శులభం కాదు. ప్రస్తుతం మనుజులు రకరకాల వాహనాలు .. అనగా సైకిళ్ళు , మోటారు సైకిళ్లు , కార్లు , బస్సులు , విమానాలు , ఓడలి ఇలా వివిధరకాలు వాడుతూ ఉన్నారు. మరి పూర్వకాలములో దేవతలకు అంతగా నవీన టెక్నాలజీ తెలిక పక్షులు , జంతువులను వాహనాలుగా వాడేవారని అనుకోవాలి.
ఎలుక: ఎలుక గణేషుని యొక్క వాహనం అని పిల్ల పెద్దలందలందరికి తెలిసిన విషయమే. ఎలుక వినాయకుని వాహనంగా పూజలందుకొనేది బహు తక్కువ. మానవులు ఎలుకను సహజంగా శత్రువుగా చూస్తారు. కారణం నిత్య జీవితంలో దీని వలన అనేక కష్ట, నష్టాలను అనుభవించుటవలన.
ఎద్దు లేదా బసవన్న(నంది): శివుడి యొక్క సంరక్షకుడు మరియు వాహనంగా ప్రసిద్ది. నంది శివుని వాహనము. శివాలయము నందు మరియు ప్రతి హిందూ దేవాలయము నందు దేవునికి అభిముఖముగ వున్న ఎద్దు ఆకారమే "నంది" నంది కొమ్ముల మద్య నుండి భగవంతుడి ని చూచిన భగవంతుని కృప కలుగునని ప్రతీతి.
పులి: హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత పార్వతి దేవి. పులి దుర్గా దేవికి వాహనం. కొన్ని సందర్బాల్లో సింహంగా కూడా చూపెడుతుంటారు.
నెమలి: హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. సరస్వతి హ౦స వాహన౦పై, మయూర వాహన౦పై కూర్చున్నట్లు కనిపిస్తు౦ది. జ్నాన ప్రధాన దేవతలను మయూర వాహన౦గా ఆరాధిస్తారు అని తెలుస్తున్నది. హ౦స శబ్ద శక్తికి, ప్రాణ శక్తికి స౦కేత౦. నెమలి యజ్నశక్తికి స౦కేత౦. యోగశాస్త్ర౦లో శ్వాసకు హ౦స అనే పేరు ఉన్నది.
గుడ్లగూబ: లక్ష్మీదేవి యొక్క వాహనం గుడ్లగూబ. లక్ష్మి దేవి హిందు వుల సాంప్రదాయం ప్రకారం మనకు సిరి సంపదలు, సౌభాగ్యం, సుఖ సంతోషాలును కలుగ జేసే మాత లక్ష్మి మాత. ఈమె క్షీరసముద్ర తనయ. త్రిముర్తులలో శ్రీమహావిష్ణువు అర్ద్దాంగి.
హంస: బ్రహ్మ దేవుని యొక్క వాహనం హంస. ఈ పక్షికి పాలు మరియు నీరు వేరు చేయు అధికారం కలిగి ఉన్నదని ప్రసస్థి. ఈ పక్షి నిఘా మిరయు వివక్షతను సూచిస్తుంది.
గరుడ(గ్రద్ద): అన్నిపక్షులకు గరుడు అధిపతి. గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడినది. అందుకే ఈ పురాణమునకు "గరుడ పురాణం" అని పేరు వచ్చింది. అవతారపురుషుడు, మోక్షాన్ని ప్రసాదించే విష్ణుమూర్తికి వాహనుడైన గరుడభగవానుడిని దర్శించుకోవడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం.
ఏనుగు/ఐరావత: ఏనుగు ఇంద్రుని యొక్క వాహనం. సురుల ప్రభువైన ఆ మహేంద్రుని వాహనము ఏనుగు, దాని పేరు ఐరావతము. ఏనుగు విశ్వసనీయత, గౌరవం, అధికారం, రాయల్టీ మరియు ఫ్రైడ్ నుసూచిస్తుంది.
మొసలి: పచ్చని వర్ణంలో ఉండి, బంగారు కత్తి ధరించి పాముతో తయారయిన 'ఉచ్చు' లేదా 'పాశం' ఒక చేత పట్టుకుని, మొసలి మీద కూర్చుని స్వారీ చేస్తూ దర్శనమిస్తాడు. ఆయనే వరుణుడు. వేద కాలంలో వరుణుడిని ఆకాశానికి, నీటికి అధిపతిగా కొలిచేవారు. సృష్టికి నాశనం చేసే అంశాల కంటె అభివృద్ధి చేసే అంశాలే వరుణుడిలో ఎక్కువ. వేదాల ప్రకారం... వరుణుడు స్వర్గాన్ని, భూమిని, గాలిని సృష్టించాడు. వానలు కురవడానికి, నదులు ప్రవహించడానికి, గాలి వీచడానికి ఈయనే కారకుడు. మొసలి గౌరవం, శక్తి, వేగం, శక్తి, జిత్తులమారి మరియు ధైర్యాన్ని సూచిస్తుంది.
గుర్రము/అశ్వం: గుర్రం ఆది దేవుడు లేదా సూర్య దేవుని యొక్క వాహనం. ఈ అశ్వం ఏడు ఇంద్రధనుస్సుల రంగులను సూచిస్తుంది. ఆది దేవుడు ఏడు గుర్రాల మీద స్వారి చేస్తారు.
సరస్వతి : హంస ,
మన్మధుడు : చిలుక ,
పార్వతి : సింహము ,
గంగకు : మొసలి ,
గణపతికి : ఎలుక ,
సుబ్రమణ్యేశ్వరుడు : నెమలి ,
visit My website >
Dr.Seshagirirao - MBBS.-