ప్ర ; విద్యుత్తు అంటే ఏమిటి?
ప్ర : విద్యుత్తు లేదా విద్యుచ్ఛక్తి - అనేది ఒక వాహక మధ్యఛ్చేదం గుండా ప్రమాణ కాలంలో ప్రవహించే ఎలక్ట్రాన్ ల ప్రవాహం. దీనిని ఆంపియర్ అనే యూనిట్స్‌లలో కొలుస్తారు. ఒక కులాం ఆవేశం ఒక సెకను కాలంలో ఒక వాహక మధ్యఛ్చేదం దాటితే ఒక ఆంపియర్ విద్యుత్ ప్రవహిస్తుంది అని అంటాం. విద్యుత్ప్రవాహం ప్రమాణం ఆంపియర్ లేదా కులాం/సెకను. విద్యుత్తు ఉనికికి ప్రత్యక్ష సాక్షి మెరుపులు.
చరిత్ర
క్రీ.పూ 600 సం. లో గ్రీసు దేశంలో థేల్స్ అనేశాస్త్ర వేత్త మొదట విద్యుచ్చక్తి ఉనికిని గుర్తించాడు. ఆ దేశంలో amber(సీమ గుగ్గిలం) ను చెట్ల యొక్క రెసిన్ నుండి తయారుచేసేవారు. ఆ గుగ్గిలాన్ని పిల్లి చర్మంలో రుద్దినపుడు ఆ పదార్థం చిన్న చిన్న తేలికైన వస్తువులను ఆకర్షించుటను గమనించాడు. గ్రీకు భాషలో ఏంబర్ కు మరియొక పేరు "electron" అందువల్ల ఆ ఆకర్షించే ధర్మమును ఎలక్ట్రిసిటి అని పిలిచినారు. ఒక వస్తువును వేరొక వస్తువుతో రాపిడి చేసినపుడు ఒక పదార్థం యొక్క ఉపరితలంలో గల ఎలక్ట్రాన్లు(పరమాణువులోని ప్రాథమిక కణం) ఒక తలం నుండి వేరొక తలానికి బదిలీ అవుతాయి. అపుడు ఎలక్ట్రాన్లు కోల్పోయే వస్తువు తల ధనాత్మకం గాను, ఎలక్ట్రాన్లు గ్రహించిన తలం ఋణాత్మకం గాను యేర్పడుతుంది. ఈ రకమైన విద్యుఛ్చక్తిని స్థిర విద్యుత్ అందురు. క్రీ.శ 1600 సం.లో గిల్ బర్ట్ అనే శాస్త్రవేత్త రెండు రకాల ఆవేశాలుంటాయని ప్రతిపాదించాడు. గాజు కడ్డీపై సిల్కు గుడ్డతో రుద్దినపుడు గాజు కడ్డీ ధనాత్మకంగాను సిల్కు గుడ్డ ఋణాత్మకంగాను యేర్పడటాన్ని, అదేవిధంగా ఎబొనైట్ కడ్దీని ఉన్ని గుడ్డతో రుద్దినపుడు ఎబొనైట్ కడ్డీ ఋణావేశాన్ని, ఉన్ని గుడ్డ ధనావేశాన్ని పొందడాన్ని గమనించాడు. ఆ రెండు కడ్డీలు పరస్పరం ఆకర్షించుకొనుటను గమనించారు. ఈ స్థిర విద్యుత్ యొక్క ఉనికిని బెండుబంతి విధ్యుద్దర్శిని లేదా స్వర్ణపత్ర విధుద్దర్శిని ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత కాలంలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ మెఘాలలో గల మెరుపులలో విధ్యుత్ శక్తి ఉన్నదని లోహపు గాలిపటాలను ఎగురవేసి దానికి లోహపు తీగలు కట్టి నిర్థారించాడు. ఆయన లైట్నింగ్ కండక్టర్ ను కనుగొన్నారు. ఇది పెద్ద భవనాలపై పిడుగులు(విధ్యుచ్చక్తి) పడకుండా అరికడుతుంది.
విద్యుత్ - రకాలు--
స్థిర విద్యుత్ - నిశ్చల స్థితిలో గల ఆవేశాలు
ప్రవాహ విద్యుత్ - వాహకం గుండా ప్రవహించే ఆవేశాలు.
పూర్తి వివరాలకోసం : వికీపెడియా లో చూడండి - Electricity,విద్యుత్తు
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...