Monday, February 25, 2013

What about underground Town?,నేల కింద పట్టణం సంగతేమిటి ?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

  ప్ర : What about underground Town?,నేల కింద పట్టణం సంగతేమిటి ?

 జ : అదొక పట్టణం... దానికో ప్రత్యేకత ఉంది... అది ప్రపంచంలో ఏ పట్టణానికీ లేదు! ఏమిటా ప్రత్యేకత? ఆ పట్టణం ఉన్నది నేలపై కాదు... భూగర్భంలో!
ఏ పట్టణానికి వెళ్లాలన్నా బస్సులోనో, రైళ్లోనో, విమానంలోనో వెళతాం. కానీ ఆ పట్టణానికి మాత్రం భూమి కిందకి వెళ్లాలి. ఎందుకంటే అది ఉన్నది భూమి కింద! ప్రపంచంలోనే భూగర్భంలో ఏర్పడిన ఏకైక పట్టణంగా పేరుతెచ్చుకున్న దాని పేరు 'కూబర్‌ పెడీ'. దీన్ని చూడాలంటే ఆస్ట్రేలియా వెళ్లాలి.ఈ నేలకింది పట్టణంలో ఇప్పుడు ఇళ్లు, హోటళ్లు, దుకాణాలు అన్నీ ఉన్నాయి. సుమారు 3000 మంది ఇక్కడ ఉంటున్నారు. రోడ్లు, ప్రార్థనాలయాలు, పాఠశాలలు, ఈతకొలనులు, గ్రంథాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఆస్ట్రేలియాలో అడిలైడ్‌కి దగ్గర్లో ఎడారి నేలల కింద ఏర్పడిన ఈ పట్టణాన్ని చూడ్డానికి దేశదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు.

ఇంతకీ ఈ పట్టణం ఎలా ఏర్పడింది? పనిగట్టుకుని ఎందుకు జనం భూమి కింద సొరంగాలు తవ్వుకుని ఇళ్లు కట్టుకున్నారు? ఈ సందేహాలు వస్తే మొత్తం చరిత్ర తెలుసుకోవాలి. సుమారు 97 ఏళ్ల క్రితం ఈ పట్టణం లేదు. ఈ ప్రాంతంలో 'ఒపల్‌' అనే విలువైన రాతి పొరలు ఉన్నాయి. చూడ్డానికి తెల్లగా మిలమిల మెరిసే ఈ రాళ్లను ప్రపంచవ్యాప్తంగా ఆభరణాల తయారీలో వాడతారు. ఇక్కడ ఉన్నంత ఎక్కువగా ఈ రాళ్లు మరెక్కడా దొరకవు. మరి అంత విలువైన రాళ్లను తవ్వకుండా ఎలా వదిలేస్తారు? అందుకనే ఇక్కడ గనుల తవ్వకాన్ని మొదలుపెట్టింది ప్రభుత్వం. కానీ ఈ ప్రాంతమంతా ఎడారి. పగలు 40 డిగ్రీల సెల్సియస్‌కి మించిన ఉష్ణోగ్రతలు ఉంటాయి. దాంతో గనుల్లో పనిచేసే కార్మికులు చాలా ఇబ్బంది పడేవారు. ఎలాగూ గనులు తవ్వుతున్నారు కాబట్టి వాళ్లు నేల కిందనే చిన్న చిన్న గదులు ఏర్పరుచుకుని అందులోనే ఉండడం మొదలు పెట్టారు. ఆ గదులు ఏసీలాగా చల్లగా ఉండడంతో నెమ్మదిగా ఇళ్లు ఏర్పడ్డాయి. అలా అలా 1915 కల్లా ఇదొక పట్టణంగా మారిపోయింది.

దీంట్లో ఇళ్లు నిర్మించుకున్న వారు వెలుతురు రావడానికి పైకి గొట్టాలు ఏర్పాటు చేసుకుంటారు. వూళ్లోకెళ్లడానికి ఎడారిలో నుంచి ఒక దారి ఉంటుంది. వూరి పైన ఇసుకలో ఓ గోల్ఫ్‌ మైదానం ఉంది. దాంట్లో మెరిసే గోల్ఫ్‌ బంతులతో రాత్రి పూట మాత్రమే ఆటలాడతారు.ఇప్పుడు ఈ పట్టణాన్ని పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉండేలా తీర్చి దిద్దారు. ఎన్నో హాలీవుడ్‌ సినిమా షూటింగులు కూడా ఇక్కడ జరుగుతాయి.

Source : Eenadu hai bujji @Eenadu telugu daily news paper
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...