Tuesday, February 26, 2013

Why greenland is called big Island vs Austrelia?,ఆస్ట్రేలియా కంటే గ్రీన్‌లాండ్‌ను పెద్ద ద్వీపంగా ఎందుకు పేర్కొంటారు?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: వైశాల్యంలో అతి పెద్ద ద్వీపం ఆస్ట్రేలియా అయితే గ్రీన్‌లాండ్‌ను పెద్ద ద్వీపంగా ఎందుకు పేర్కొంటారు?

జవాబు: ప్రపంచ పటంలో నేల భాగాన్ని ప్రాథమికంగా ఖండాలు (continents)గా విభజించారు. ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా అంటూ ఏడు ఖండాలున్నా, జనాభా ఏమీ లేని అంటార్కిటికాను ఖండాల్లో లెక్కించకుండా రెండు అమెరికాలను ఒకే ఖండం అంటూ ఐదు ఖండాల్నే పేర్కొంటారు. సాధారణంగా ఖండాలుగా ఉన్న ప్రాంతాల చుట్టూ సముద్రాలు లేదా సముద్రపు నీటి ప్రాంతాలున్నా, వాటిని ద్వీపాలు(islands)గా పరిగణించరు. కేవలం ఖండాల్లో అంతర్భాగంగా ఉన్న దేశాలేమైనా ఉండి, వాటి చుట్టూ అన్ని వైపులా సముద్రపు జలాలుంటే అలాంటి సందర్భాలలోనే ద్వీపాలుగా భావిస్తారు. ఆస్ట్రేలియా దేశమే అయినా అది ఓ ప్రధాన ఖండం. ఓ ఖండంగా చూస్తే దీని వైశాల్యం దాదాపు 90 లక్షల చదరపు కిలోమీటర్లున్నా, అందులో ఓ దేశంగా ఉన్న ఆస్ట్రేలియా వైశాల్యం సుమారు 77 లక్షల చదరపు కిలోమీటర్లుంది. కానీ గ్రీన్‌లాండ్‌ ఉత్తర అమెరికా ఖండంలో ఓ భాగం. మొత్తం ఉత్తర అమెరికా ఖండపు వైశాల్యం 245 లక్షల చదరపు కిలోమీటర్లు కాగా, గ్రీన్‌లాండ్‌ ద్వీపపు మొత్తం వైశాల్యం కేవలం 20 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే ఆస్ట్రేలియా ఖండంలో ఆస్ట్రేలియా దేశపు భాగం దాదాపు 85 శాతం కాగా, ఉత్తర అమెరికా ఖండంలోని గ్రీన్‌లాండ్‌ భూభాగం 10 శాతం కూడా లేదు. కాబట్టి గ్రీన్‌లాండ్‌ను ఓ ద్వీపంగా, ఆస్ట్రేలియాను ఓ ఖండంగా మాత్రమే పరిగణిస్తారు. అయితే ఆస్ట్రేలియాను కూడా అడపాదడపా ద్వీపంగా కూడా చెబుతారు. చుట్టు పక్కల నీరుండడాన్నే గీటురాయిగా తీసుకుంటే అమెరికా ఖండాలు రెండూ ద్వీపాలే. ఆఫ్రికా కూడా ద్వీపమే. ఆసియా-ఐరోపా కలిపి యూరేసియా అంటున్నారు కాబట్టి అది కూడా ద్వీపమే. అన్నీ ద్వీపాలే. ఇది గందరగోళానికి దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి గ్రీన్‌లాండ్‌నే అతి పెద్ద ద్వీపంగా లెక్కిస్తారు.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, -నిట్‌, వరంగల్‌;రాష్ట్రకమిటీ, -జనవిజ్ఞానవేదిక
  • =====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

With pope Oil give Spicy odor why?,పోపు వేయిస్తే నూనెకే ఘుమఘుమలేల?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: నూనెలో పోపు వేయిస్తే ఘుమఘుమలు వస్తాయి. వాటినే నీటిలో వేయిస్తే ఆ వాసనలు ఎందుకు రావు?

జవాబు:నీటి భాష్పీభవన ఉష్ణోగ్రత (boiling point) కేవలం 100 డిగ్రీల సెల్షియస్‌. అంటే అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద, సాధారణ పరిస్థితుల్లో నీటిని ద్రవరూపంలో ఉంచలేము. కానీ నూనెల భాష్పీభవన ఉష్ణోగ్రత 300 డిగ్రీల సెల్షియస్‌ కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటిని 100 డిగ్రీల సెల్షియస్‌ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా ద్రవస్థితిలోనే ఉంచగలము. సుగంధ ద్రవ్యాలలో సుగంధపు ఘుమఘుమలకు ఇచ్చే ధాతువులు చాలా స్థిరమైన రూపంలో దాగుంటాయి. వాటిని ఘుమఘుమలు ఇచ్చే విధంగా బయటకు తీసుకురావాలంటే ఆ పదార్థాలను అధిక ఉష్ణోగ్రతకు లోనుచేయాలి. అధిక ఉష్ణోగ్రత వద్ద ఆ పదార్థాల్లో ఉన్న పెద్ద పెద్ద అణువులు ఉష్ణీయ రసాయనిక చర్యల్లో (pyrolysis) పాల్గొని చిన్న చిన్న అణువులుగా విడిపోయి వాయురూపంలో బయటపడతాయి. ఇవి గాలిలో వ్యాపనం (diffusion) చెందడం వల్ల మనకు ఘుమఘుమ వాసనల్ని ఇస్తాయి. ఇలా జరగాలంటే సుమారు 200 డిగ్రీల సెల్షియస్‌కు పైగా ఉష్ణోగ్రత ఉండాలి. ఇది నీటి ద్వారా అందదు. కాబట్టి నీటిలో ఆ పదార్థాలు ఉడుకుతాయి తప్ప వేగలేవు.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What are those white spots on nails?,గోళ్లపై ఆ తెల్లని మచ్చలేంటి?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: చేతి వేళ్ల గోళ్లపై తెల్లని అర్ధ చంద్రాకారాలు ఉంటాయి. అవి ఏమిటి?

జవాబు: చేతివైనా, కాలివైనా గోళ్లు అనేక పొరలతో కూడిన దృఢమైన కణాలతో కూడి ఉంటాయి. గోరులోని పైభాగం గట్టిగా, ఒక మిల్లీమీటరు కన్నా తక్కువ మందంగా ఉండి కొంత పారదర్శకంగా ఉంటుంది. అందువల్ల ఆ ప్రాంతం కింద శరీర భాగం రక్తంతో కూడుకుని ఉండడంతో గులాబి రంగులో కనిపిస్తుంది. ప్రతి గోరు దిగువన అర్ధచంద్రాకారంలో కాంతి నిరోధకం (opaque)గా ఉండే తెల్లని ప్రదేశం ఉంటుంది. ఇది గోరుమూలం. గోరు పెరుగుదలకు కావలసిన కణాలను నిరంతరం ఉత్పన్నం చేసే ఈ భాగాన్ని 'లాన్యులా' అంటారు. కొత్తగా ఇక్కడ ఏర్పడిన కణాలు గోరు ముందు భాగానికి చొచ్చుకుపోతూ, ఆ ప్రక్రియలో జీవాన్ని కోల్పోతూ ఉంటాయి. వీటిలో ఉండే 'కేరిటన్‌' అనే పదార్థం వల్ల గట్టి పడుతూ చివరకు పారదర్శకంగా మారతాయి. చేతి వేళ్ల గోళ్లు వారానికి ఒక మిల్లీమీటరు వంతున పెరుగుతాయి. చేతి వేళ్ల గోళ్లపై ఉండే తెల్లని అర్ధచంద్రాకారాలు పెద్దవిగా ఉంటే, మరి కొందరికి చిన్నవిగా ఉంటాయి. కొందరి వేళ్లలో ఇవి కనబడకపోవడానికి, ఈ లాన్యులాలను వేళ్లపై ఉండే చర్మం కప్పివేయడమే కారణం. ఇవి తెల్ల రంగులో కాకుండా నీలిరంగులోకి మారుతున్నాయంటే ఆ వ్యక్తి దేహంలో రక్తప్రసరణ సక్రమంగా లేక వీటికి తగినంత ఆక్సిజన్‌ లభించడం లేదని భావిస్తారు. రంగులో ఈ మార్పు హృదయ సంబంధిత లోపాలకు సూచనగా వైద్యులు భావిస్తారు.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ===================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Trees donot grow on heighest mountains?,ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు ఎందుకు పెరగవు?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు ఎందుకు పెరగవు?

జవాబు: ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు అంతగా పెరగక పోవడానికి కారణం అక్కడ ఉండే తీవ్రమైన వాతావరణ పరిస్థితులే. అక్కడ బలమైన అతి చల్లని గాలులు వీచడం, జీవానికి అవసరమైన నీరు తగినంత లభించకపోవడం. మామూలుగా చెట్లు తమలో ఉండే నీటిని ఆకుల ద్వారా భాష్పీభవనం చెంది కోల్పోతూ ఉంటాయి. దాంతో వాటికి కావలసిన నీరు భూమి నుంచి అందకపోతే, ఆ పరిస్థితుల్లో అవి ఎండి పోతాయి. పర్వతాలపై భూగర్భజలం చాలావరకు గడ్డకట్టుకుపోవడంతో, అక్కడి చెట్ల వేర్లకు నీరు అందవు. తగినంత నీరు లభించకపోవడంతో చెట్ల లోపలి భాగాల్లో పీడనం తగ్గి, నీరు ప్రవహించే మార్గాల్లో పగుళ్లు ఏర్పడి హాని కలిగించే గాలి బుడగలు ఏర్పడుతాయి. పరిసరాల్లోని ఉష్ణోగ్రత బాగా తగ్గినప్పుడు కూడా చెట్లలో ఉండే నీరు ఘనీభవించే ప్రమాదం ఉంది. చెట్ల లోని నీరంతా భాష్పీభవనం చెందినా తట్టుకోగల శక్తి ఉండే సరివి, అశోకా చెట్ల లాంటివి పర్వతాలపై పెరుగుతాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, February 25, 2013

Oil droped in water changed to drops why?,నీటిలో పడిన నూనె బిందువులుగా మారుతుంది.ఎందుకు?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: నీటిలో పడిన నూనె ప్రవాహంలా ఉండకుండా బిందువులుగా మారుతుంది. ఎందుకు?

జవాబు: ద్రవపదార్థాల ఉపరితలం సాగే స్వభావం కలిగి బిగువు(tension) కలిగి ఉంటుంది. దీనినే తలతన్యత (surface tension) అంటారు. దోమలు, చిన్న కీటకాలు నీటి ఉపరితలంపై మునిగి పోకుండా నిలబడడానికి కారణం ఈ తలతన్యతే.
ద్రవాలకు స్వేచ్ఛ లభిస్తే తలతన్యత వల్ల అవి తక్కువ ప్రదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తాయి. అన్ని ఆకారాల్లోకీ గోళాకారానికి తక్కువ ఉపరితల వైశాల్యం ఉంటుంది. అందుకే స్వేచ్ఛగా ఆకాశం నుంచి పడిన నూనె ప్రవాహ రూపంలో కాకుండా గుండ్రని బిందువులుగా మారుతుంది. చెమట, ఎత్తు నుంచి నేలపై చిందిన పాలు, వర్షం చినుకులు బిందువులుగా మారడానికి కారణం తలతన్యతే!

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What are meteors?,ఉల్కలు అంటే ఏమిటి?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఈ మధ్య వార్తల్లో ఉల్కల భీభత్సం గురించి రాశారు. అసలు ఉల్కలు అంటే ఏమిటి?

జవాబు: దాదాపు 10 టన్నుల బరువున్న ఉల్క భూమి వాతావరణంలోకి ప్రవేశించి ముక్కలుగా పేలిపోయి రష్యాలోని ఒక పట్టణంపై పడిన సంగతి తెలిసిందే. రాత్రివేళల్లో ఆకాశంకేసి చూస్తే కొన్ని నక్షత్రాలు రాలి పడినట్టు కనిపిస్తుంది. అయితే ఇవి నక్షత్రాలు కావు. వాటిని ఉల్కలు (మెటియర్స్‌) అంటారు. గ్రహాలు ఏర్పడిన తొలిరోజుల్లో గ్రహాల ఆకర్షణకు లోనుకాని కొన్ని శిలలు, ధూళికణాలు గ్రహాలతోపాటు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. అలాగే అంగారక గ్రహం నుంచి, చంద్రుని నుంచి వెలువడిన ధూళి కణాలు కూడా అంతరిక్షంలో ఉంటాయి. అంతరిక్షంలో తిరిగే వీటిని 'మెటియోరైడ్స్‌' అంటారు.

భూమి తన కక్ష్యలో తాను తిరుగుతూ, ఈ మెటియోరైడ్స్‌ ఉండే ప్రాంతంలోకి వచ్చినపుడు వీటిలో కొన్ని భూమ్యాకర్షణ శక్తి వలన భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయి. గంటకు సుమారు 30,000 కిలోమీటర్ల వేగంతో ఇవి భూవాతావరణంలోకి ప్రవేశించడంతో వాటి ఉష్ణోగ్రత విపరీతంగా 1650 డిగ్రీల సెల్సియస్‌ వరకూ పెరిగి కాంతిని వెదజల్లుతూ పడిపోతాయి. వాటిని మెటియర్స్‌ అంటారు.
భూ వాతావరణంలోకి ప్రవేశించిన ఉల్కలు (మెటియర్స్‌) చాలావరకు భూమి మీద పడకుండానే ఆవిరి గానూ, ధూళి కణాలుగానూ మారిపోతాయి. ఇవి మనకేమాత్రం హాని చేయకపోగా, వాటి చుట్టూ చిన్న నీటి బిందువులు ఏర్పడి వర్షాలు కురియడానికి కూడా సహాయ పడతాయి. కానీ కొన్ని పెద్ద ఉల్కలు భూమి వాతావరణంలో ప్రవేశించాక మండిపోతూనే ప్రయాణించి భూమి ఉపరితలాన్ని 'ఢీ' కొంటాయి. వీటిని 'మెటియోరైట్స్‌' అంటారు. ప్రతి సంవత్సరం సుమారు 500 మెటియోరైట్స్‌ భూమిపై పడతాయి. ఇనుము, నికెల్‌లాంటి ఖనిజాలను కలిగి ఉండే వీటి మొత్తం బరువు 100 టన్నులు పైగా ఉంటుంది. ఇవి భూమిని తాకిన చోట లోతైన గోతులు ఏర్పడతాయి.

యాభైవేల సంవత్సరాల క్రితం అమెరికాలోని అరిజోనా ఎడారిలో 10,000 టన్నుల బరువైన ఒక పెద్ద ఉల్క భూమిని ఢీకొనడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఇప్పటికీ ఆ ప్రదేశంలో 18 టన్నుల ఇనుప ఖనిజం ఉంది. 1980లో సైబీరియాలో ఒక ఉల్క భూమిని తాకకముందే ఎనిమిదిన్నర కిలోమీటర్ల ఎత్తులో విస్ఫోటనం చెందడంతో దాదాపు 200 కిలోమీటర్ల వైశాల్యంలోని చెట్లు నేలమట్టమయ్యాయి.

ఒకోసారి వందలాది ఉల్కలు జల్లుల్లాగా భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయి. 1837 నవంబరు 13న ఒక్క గంటలో 30,000 ఉల్కలు భూమిపై పడ్డాయి.

-ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

How do electrons flow?,ఎలక్ట్రాన్లు ఎలా ప్రవహిస్తాయి?

  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: విద్యుత్తు ప్రసరించడం అంటే ఎలక్ట్రాన్లు ప్రవాహం అంటారు. పదార్థాల్లో ఎలక్ట్రాన్లు ఎలా ప్రయాణిస్తాయి?

జవాబు: విద్యుత్ప్రసారం అంటే శాస్త్రీయంగా విద్యుదావేశం ఒక చోట నుంచి మరో చోటుకి స్థానభ్రంశం (displacement) చెందడమే. అంటే విధిగా ఎలక్ట్రాన్ల ప్రసారమే కానక్కర్లేదు. అయితే విద్యుత్‌ను ప్రసారం చేసే సాధనాల్లో దాదాపు 80శాతం ఎలక్ట్రాన్ల ప్రవాహమే.సాధారణంగా లోహాలు (metals), మిశ్రమలోహాలు (alloys), గ్రాఫైటు, బొగ్గు వంటి ఘనపదార్థాల్లోను, పాదరసం, బ్రోమీను వంటి ద్రవపదార్థాల్లోను విద్యుత్‌ ఎలక్ట్రాన్ల గమనం ద్వారానే సంభవిస్తుంది. రబ్బరు, కాగితం, ప్లాస్టిక్కు వంటి విద్యుత్‌ నిరోధక పదార్థాల్లో జరిగే కొద్దిపాటి విద్యుత్‌ ప్రసారం కూడా ఎలక్ట్రాన్ల మందకొడి ప్రవాహమే. అయితే ట్యూబ్‌లైట్లు, ద్రావణాలు, వాయువులు, నీరు వంటి సాధనాల్లో విద్యుత్‌ ప్రసారం ఎలక్ట్రాన్ల ప్రవాహంతో పాటు విద్యుదావేశిత కణాల (ions) ద్వారా కూడా జరుగుతుంది. ఎలక్ట్రాన్లు ప్రవహించడం ద్వారా విద్యుత్‌ ప్రసారం జరిగే పదార్థాలను ఎలక్ట్రానిక్‌ కండక్టర్లు అంటారు. ఇలాంటి పదార్థాల్లో సులభంగా అటూ, ఇటూ పరమాణువుల, అణువుల మధ్య కదలగల ఎలక్ట్రాన్లు ఉంటాయి. వీటినే వేలన్సీ ఎలక్ట్రాన్లు అంటారు. ఇలాంటివన్నీ కలగలిసి ఓ సందోహంలాగా అన్ని పరమాణువుల్ని కలుపుకుని దుప్పటిలాగా పైపైన ఉంటాయి. ఎటువైపున ఏమాత్రం ధనావేశిత ధ్రువం (ఆనోడ్‌) ఉన్నా అటువైపు చలిస్తాయి. అదే పదార్థానికి మరో వైపు రుణధ్రువం (కేథోడ్‌) కూడా ఉంటుంది. ఆనోడ్‌ ద్వారా పదార్థం నుంచి జారుకునే ఎలక్ట్రాన్లను కేథోడ్‌ నింపుకుంటుంది. ఇంటిపైన ఉండే వాటర్‌ ట్యాంకులో నీరు వేలన్సీ ఎలక్ట్రాన్ల దండు అనుకుంటే, కుళాయి ద్వారా బయటపడేవి ఆనోడు వైపు వెళ్తున్నట్లు, పంపు ద్వారా ట్యాంకును చేరేవి కేథోడ్‌ ద్వారా వచ్చేవని ఊహించుకోండి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is the secret of vision of eagle?,గద్ద చూపు రహస్యమేంటి?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఆకాశంలో ఎత్తుగా ఎగురుతున్నా, గద్ద అంత స్పష్టంగా కింద ఉండే చిన్న చిన్న జీవుల్ని సైతం ఎలా చూడగలుగుతుంది?

జవాబు: ప్రాణులన్నింటిలోకి గద్దజాతి పక్షుల దృష్టి చాలా నిశితంగా, తీక్షణంగా ఉంటుంది. దీనికి కారణం అది విశాలమైన, పొడవైన కనుగుడ్లు కలిగి ఉండడమే. దాని కనుగుడ్డులో కంటి కటకానికి, రెటీనాకు విశాలమైన ప్రదేశం లభిస్తుంది. మానవులతో పోలిస్తే, పక్షుల రెటీనాలలోజ్ఞాన సంబంధిత జీవ కణాల (sensory cells) సంఖ్య ఎక్కువవడమే కాకుండా అవి రెటీనాలో సమంగా వ్యాపించి ఉంటాయి. అందువల్ల గద్ద పైనుంచి ఎక్కువ భూవైశాల్యాన్ని కూడా చూడగలుగుతుంది. దాని కంటిలో ఏర్పడే ప్రతిబింబం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. మన కంటిలో కన్నా గద్ద కంటిలో ఈ కణాలు ప్రతి చదరపు మిల్లీమీటరుకు 8 రెట్లు అధికంగా ఉండడంతో అది దూరంగా ఉండే వస్తువుపై కూడా అతి త్వరగా దృష్టిని కేంద్రీకరించగలుగుతుంది.

కంటిలోని ద్రవాల కదలికల ద్వారా మనం సెకనుకు 25 ప్రతిబింబాలను చూడగలిగితే, గద్ద సెకనుకు 150 ప్రతిబింబాలను చూడగలుగుతుంది. అంతే కాకుండా మన కంటికి కనబడని అతినీల లోహిత కిరణాలను (ultra violet rays) గద్ద చూడగలుతుంది. ఎలుకల లాంటి ప్రాణుల విసర్జకాలు వెలువరించే అతినీల లోహిత కిరణాలను ఆకాశం నుంచి కూడా చూడగలగడం వల్ల అది, వాటి ఉనికిని పసిగట్టి వేటాడగలుగుతుంది.

- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is Electricity,విద్యుత్తు అంటే ఏమిటి?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  ప్ర ; విద్యుత్తు అంటే ఏమిటి?

ప్ర : విద్యుత్తు లేదా విద్యుచ్ఛక్తి - అనేది ఒక వాహక మధ్యఛ్చేదం గుండా ప్రమాణ కాలంలో ప్రవహించే ఎలక్ట్రాన్ ల ప్రవాహం. దీనిని ఆంపియర్ అనే యూనిట్స్‌లలో కొలుస్తారు. ఒక కులాం ఆవేశం ఒక సెకను కాలంలో ఒక వాహక మధ్యఛ్చేదం దాటితే ఒక ఆంపియర్ విద్యుత్ ప్రవహిస్తుంది అని అంటాం. విద్యుత్ప్రవాహం ప్రమాణం ఆంపియర్ లేదా కులాం/సెకను. విద్యుత్తు ఉనికికి ప్రత్యక్ష సాక్షి మెరుపులు.

చరిత్ర

క్రీ.పూ 600 సం. లో గ్రీసు దేశంలో థేల్స్ అనేశాస్త్ర వేత్త మొదట విద్యుచ్చక్తి ఉనికిని గుర్తించాడు. ఆ దేశంలో amber(సీమ గుగ్గిలం) ను చెట్ల యొక్క రెసిన్ నుండి తయారుచేసేవారు. ఆ గుగ్గిలాన్ని పిల్లి చర్మంలో రుద్దినపుడు ఆ పదార్థం చిన్న చిన్న తేలికైన వస్తువులను ఆకర్షించుటను గమనించాడు. గ్రీకు భాషలో ఏంబర్ కు మరియొక పేరు "electron" అందువల్ల ఆ ఆకర్షించే ధర్మమును ఎలక్ట్రిసిటి అని పిలిచినారు. ఒక వస్తువును వేరొక వస్తువుతో రాపిడి చేసినపుడు ఒక పదార్థం యొక్క ఉపరితలంలో గల ఎలక్ట్రాన్లు(పరమాణువులోని ప్రాథమిక కణం) ఒక తలం నుండి వేరొక తలానికి బదిలీ అవుతాయి. అపుడు ఎలక్ట్రాన్లు కోల్పోయే వస్తువు తల ధనాత్మకం గాను, ఎలక్ట్రాన్లు గ్రహించిన తలం ఋణాత్మకం గాను యేర్పడుతుంది. ఈ రకమైన విద్యుఛ్చక్తిని స్థిర విద్యుత్ అందురు. క్రీ.శ 1600 సం.లో గిల్ బర్ట్ అనే శాస్త్రవేత్త రెండు రకాల ఆవేశాలుంటాయని ప్రతిపాదించాడు. గాజు కడ్డీపై సిల్కు గుడ్డతో రుద్దినపుడు గాజు కడ్డీ ధనాత్మకంగాను సిల్కు గుడ్డ ఋణాత్మకంగాను యేర్పడటాన్ని, అదేవిధంగా ఎబొనైట్ కడ్దీని ఉన్ని గుడ్డతో రుద్దినపుడు ఎబొనైట్ కడ్డీ ఋణావేశాన్ని, ఉన్ని గుడ్డ ధనావేశాన్ని పొందడాన్ని గమనించాడు. ఆ రెండు కడ్డీలు పరస్పరం ఆకర్షించుకొనుటను గమనించారు. ఈ స్థిర విద్యుత్ యొక్క ఉనికిని బెండుబంతి విధ్యుద్దర్శిని లేదా స్వర్ణపత్ర విధుద్దర్శిని ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత కాలంలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ మెఘాలలో గల మెరుపులలో విధ్యుత్ శక్తి ఉన్నదని లోహపు గాలిపటాలను ఎగురవేసి దానికి లోహపు తీగలు కట్టి నిర్థారించాడు. ఆయన లైట్నింగ్ కండక్టర్ ను కనుగొన్నారు. ఇది పెద్ద భవనాలపై పిడుగులు(విధ్యుచ్చక్తి) పడకుండా అరికడుతుంది.

విద్యుత్ - రకాలు--

    స్థిర విద్యుత్ - నిశ్చల స్థితిలో గల ఆవేశాలు
    ప్రవాహ విద్యుత్ - వాహకం గుండా ప్రవహించే ఆవేశాలు.

పూర్తి వివరాలకోసం : వికీపెడియా లో చూడండి - Electricity,విద్యుత్తు
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

What about underground Town?,నేల కింద పట్టణం సంగతేమిటి ?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

  ప్ర : What about underground Town?,నేల కింద పట్టణం సంగతేమిటి ?

 జ : అదొక పట్టణం... దానికో ప్రత్యేకత ఉంది... అది ప్రపంచంలో ఏ పట్టణానికీ లేదు! ఏమిటా ప్రత్యేకత? ఆ పట్టణం ఉన్నది నేలపై కాదు... భూగర్భంలో!
ఏ పట్టణానికి వెళ్లాలన్నా బస్సులోనో, రైళ్లోనో, విమానంలోనో వెళతాం. కానీ ఆ పట్టణానికి మాత్రం భూమి కిందకి వెళ్లాలి. ఎందుకంటే అది ఉన్నది భూమి కింద! ప్రపంచంలోనే భూగర్భంలో ఏర్పడిన ఏకైక పట్టణంగా పేరుతెచ్చుకున్న దాని పేరు 'కూబర్‌ పెడీ'. దీన్ని చూడాలంటే ఆస్ట్రేలియా వెళ్లాలి.ఈ నేలకింది పట్టణంలో ఇప్పుడు ఇళ్లు, హోటళ్లు, దుకాణాలు అన్నీ ఉన్నాయి. సుమారు 3000 మంది ఇక్కడ ఉంటున్నారు. రోడ్లు, ప్రార్థనాలయాలు, పాఠశాలలు, ఈతకొలనులు, గ్రంథాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఆస్ట్రేలియాలో అడిలైడ్‌కి దగ్గర్లో ఎడారి నేలల కింద ఏర్పడిన ఈ పట్టణాన్ని చూడ్డానికి దేశదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు.

ఇంతకీ ఈ పట్టణం ఎలా ఏర్పడింది? పనిగట్టుకుని ఎందుకు జనం భూమి కింద సొరంగాలు తవ్వుకుని ఇళ్లు కట్టుకున్నారు? ఈ సందేహాలు వస్తే మొత్తం చరిత్ర తెలుసుకోవాలి. సుమారు 97 ఏళ్ల క్రితం ఈ పట్టణం లేదు. ఈ ప్రాంతంలో 'ఒపల్‌' అనే విలువైన రాతి పొరలు ఉన్నాయి. చూడ్డానికి తెల్లగా మిలమిల మెరిసే ఈ రాళ్లను ప్రపంచవ్యాప్తంగా ఆభరణాల తయారీలో వాడతారు. ఇక్కడ ఉన్నంత ఎక్కువగా ఈ రాళ్లు మరెక్కడా దొరకవు. మరి అంత విలువైన రాళ్లను తవ్వకుండా ఎలా వదిలేస్తారు? అందుకనే ఇక్కడ గనుల తవ్వకాన్ని మొదలుపెట్టింది ప్రభుత్వం. కానీ ఈ ప్రాంతమంతా ఎడారి. పగలు 40 డిగ్రీల సెల్సియస్‌కి మించిన ఉష్ణోగ్రతలు ఉంటాయి. దాంతో గనుల్లో పనిచేసే కార్మికులు చాలా ఇబ్బంది పడేవారు. ఎలాగూ గనులు తవ్వుతున్నారు కాబట్టి వాళ్లు నేల కిందనే చిన్న చిన్న గదులు ఏర్పరుచుకుని అందులోనే ఉండడం మొదలు పెట్టారు. ఆ గదులు ఏసీలాగా చల్లగా ఉండడంతో నెమ్మదిగా ఇళ్లు ఏర్పడ్డాయి. అలా అలా 1915 కల్లా ఇదొక పట్టణంగా మారిపోయింది.

దీంట్లో ఇళ్లు నిర్మించుకున్న వారు వెలుతురు రావడానికి పైకి గొట్టాలు ఏర్పాటు చేసుకుంటారు. వూళ్లోకెళ్లడానికి ఎడారిలో నుంచి ఒక దారి ఉంటుంది. వూరి పైన ఇసుకలో ఓ గోల్ఫ్‌ మైదానం ఉంది. దాంట్లో మెరిసే గోల్ఫ్‌ బంతులతో రాత్రి పూట మాత్రమే ఆటలాడతారు.ఇప్పుడు ఈ పట్టణాన్ని పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉండేలా తీర్చి దిద్దారు. ఎన్నో హాలీవుడ్‌ సినిమా షూటింగులు కూడా ఇక్కడ జరుగుతాయి.

Source : Eenadu hai bujji @Eenadu telugu daily news paper
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, February 14, 2013

Electric wire have torsion Why?, కరెంటు తీగకు పురి ఏల?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: కరెంటు స్తంభాల మధ్య ఉండే తీగ పురి తిప్పి ఉంటుంది. ఎందుకు?

జవాబు: కరెంటు స్తంభాల మధ్య ఉన్న తీగ ఒకే తీగ కాదు. నిజానికి ఇది కొన్ని తీగల కలయిక. బావిలో నీళ్లు తోడుకునే చేంతాడులాగా, మొలతాడులాగా ఇది కొన్ని తీగలను కలిపితే ఏర్పడినదన్నమాట. ఇక కరెంటు తీగలో సాధారణంగా మధ్యలో వెన్నుపూసలాగా ఒక దృఢమైన ఇనుప స్టీలు తీగ ఉంటుంది. ఈ తీగకు అదనపు బలాన్ని గట్టిదనాన్ని ఇచ్చేందుకు ఆ స్టీలు తీగ చుట్టూ అయిదారు అల్యూమినియం తీగల్ని కూడా జోడిస్తారు. ఈ తీగలన్నీ చాలా దూరం పాటు కుదురుగా వెళ్లాలి కాబట్టి అన్నింటినీ కలిపి ఉంచడానికి వాటిని పెనవేస్తారు. ఇవి మధ్యలో ఉండే స్టీలు తీగను హత్తుకుని మెలివేసుకోవడం వల్ల మరింత కుదురుగా ఉంటాయి.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక @హైయ్  బుజ్జి
  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-