Wednesday, December 07, 2011

పేగులు అరుస్తాయేం?,Why do intestines in the Abdomen Cry?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

  • ప్రశ్న: అప్పుడప్పుడు మన కడుపులోని పేగులు అరుస్తాయెందుకు?

-పి. రాజరత్నం, 9వ తరగతి, కరీంనగర్‌

  • జవాబు: మనం ఆహారం తీసుకొన్న కొంత సేపటికి అది జీర్ణమై కడుపు ఖాళీ అవడంతో, దాంట్లో జీర్ణాశయ సంబంధిత ద్రవాలు, గాలి మాత్రమే ఉంటాయి. ఆహారం ఉన్నప్పుడు జీర్ణాశయపు గోడల సంకోచాలు క్రమంగా, నిశ్శబ్దంగా, నెమ్మదిగా జరుగుతుంటాయి. అదే కడుపు ఖాళీ అవగానే ఈ సంకోచాల తీవ్రత పెరుగుతుంది. ఆ కదలికల వల్ల కొన్ని శబ్దాలు ఉత్పన్నమవుతాయి. వాటినే మనం పేగులు అరుస్తున్నాయంటాం. వెంటనే నీరు తాగడం, లేదా ఆహారం తీసుకోవడం ద్వారా ఈ శబ్దాలు తగ్గిపోతాయి. పేగుల గుండా ఆహారపు గుజ్జు, గాలి పయనిస్తున్నప్పుడు కూడా ఇలాంటి శబ్దాలు ఉత్పన్నమవుతాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...