Friday, December 23, 2011

పున్నామ నరకము అంటే ఏమిటి?ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  • భారతీయ సంస్కృకి, సంప్రదాయాలకు, నాగ రికత పురోగతికి మూలం కుటుంబ వ్యవస్థ. ఈ వ్యవస్థలో తల్లిదండ్రుల పాత్ర ఎనలేనిది. పిల్లల సర్వాం గీణ వికాసానికి తోడ్పడేది తల్లిదండ్రులే. నవ మాసాలు మోసి తల్లి బిడ్డకు జన్మనిస్తే, ఆ బిడ్డల ఎదుగుదలకు మార్గదర్శనం చేసేది తండ్రియే. అందుకే ఉపనిషత్తులు మాతృదేవోభవ, పితృదేవో భవ, ఆచార్య దేవోభవ అన్నా యి. కుటుంబంలో తండ్రి తమ పిల్లల ఉజ్వలభవిష్యత్తు కొరకై ఎంతో శ్రమిస్తాడు. 'జన్మనిచ్చే తల్లికన్నా... జీవి తాన్నిచ్చే తండ్రి మిన్న'' అన్న అబ్రహాంలింకన్‌ మాటల్లో ఎంతో నిజం వుంది. 'తాను శ్రమిస్తూ తన పిల్లలకు వెలుగునిచ్చే కొవ్వొత్తి నాన్న'. బిడ్డలకు బాసటగా నిలిచే అపురూప వ్యక్తి నాన్న.'

కొడుకు అంటే మగ సంతానం కొడుకు ''పున్నామ నరకము'' నుండి రక్షించువాడు అని ఒక నాటి హిందువుల నమ్మకము ... నరకము , స్వర్గము ఎక్కడో లేవు అన్ని మనచుట్టూ నే ఉన్నాయి. పాపము చేసేవాడు నరకానికి ,, పుణ్యము చేసేవాడు స్వర్గానికి చేరుతారని నమ్మకము . తోటి జీవులకు ఇస్టములేనిది , కస్టము కలిగించేది , నస్టపరిచేది ఏ పని అయినా పాపమే . కష్టలేని , నష్ట పెట్టని , ఇష్టమైన కార్యమేదైనా పుణ్యమే .

అసలు పుత్రులు వున్నా వాళ్ళు తల్లిదండ్రులకు ఎంతవరకు సేవ చేస్తున్నారనేదే ప్రశ్న . చేస్తున్నవారు , చేసేవారూ వున్నారు .. లేకపోలెదు . లేకపోవడము బాధకాదు మనసులేకపోవడమే బాధ . ధనవంతుడి పిల్లలు పైకి చెప్పరుకాని తండ్రి ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తారు . పేదవాడి పిల్లలు తండ్రి ఇంకాకొంతకాలము బతకాలని ఆశిస్తారు - అప్పటికైనా ఎంతోకొంత సంపాదించి ఇవ్వకపోతాడా అని .

ఒక జీవి చనిపోయిన తరువాత ఏమవుతుందని ఇంతవరకూ తెలీదు . తెలినవారు చెప్పిన రీతులు రుజువు చేయబడలేదు . ఆత్మ గాలిలోనూ, శరీరము భూమిలోను కలిసిపోతాయి. . . ఉన్న జీవులనుండి కొత్త జీవులు ఉద్భవిస్తూనే ఉంటాయి. నరకము-స్వర్గము , పాపము-పుణ్యము , మంచి-చెడు , వాయ-వరస, దేవుడు-దెయ్యము ... అనేవి వేదవ్యాసుని ఆత్యాధ్మిక న్యాయ-నీతులు (Mythological Law & Orders).ఒక మనిషి మంచి మార్గములో నడవడానికి నిర్ణయించిన నియమ-నిభందనలు . నరకలోకము పాపులను శిక్షించే లోకము-యమలోకము . పుణ్య్లలోకము పుణ్యాత్ములకు చోటు కల్పించే లోకము-స్వర్గలోకము .

పితృకార్యములు చేయుటకు అర్హత పొందినవారు అంతా విధిగా పక్షాలను ఆచరించి, వారి వారి వంశవృక్షములకారకులైన పితృదేవతలను స్మరించుకుని శ్రాద్ధ కర్మలు చేస్తే వారి శుభాశీస్సులతో సర్వశుభములు పొందుతారని పండితులు పేర్కొంటున్నారు. కళ్లముందు కనిపించకపోవచ్చు. భౌతికంగా దూరమై ఉండవచ్చు. అంతమాత్రాన, దివంగతులతో మన బంధం తీరిపోదు. వారి కలల్నీ ఆశయాల్నీ నిజం చేయాల్సిన బాధ్యత మనదే. వారి జ్ఞాపకాలకు ట్రస్టీలమూ మనమే. పితృ కర్మ చే్యడము వలన చనిపోయిన తండ్రికి స్వరలోక ప్రాప్తి కలుగుతుందని దానికి అర్హుడు పుత్రుడేనని హిందూ పురాణాలలో చెప్పబడినది . అదే కొడుకు ''పున్నామ నరకము'' నుండి రక్షించువాడు అని ఒక నాటి హిందువుల నమ్మకము.
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...