Wednesday, December 07, 2011

భూమి తిరుగుడు సమస్య కాదా?,Earth rotation is not a problem for aeroplanes?





    ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...భూమి

    • Bulleted Listప్రశ్న: భూమి గుండ్రంగా తిరుగుతోంది కదా! మరి విమానాలు గాలిలో ఎగిరేప్పుడు కింద భూమి తిరిగిపోతే అవి గమ్యస్థానాలను ఎలా చేరుకోగలుగు తున్నాయి?
    -రామచంద్రారెడ్డి, సిద్దిపేట
    • జవాబు: మనం బస్సులో ఒక చోట నుంచి మరో చోటకి వెళ్లేప్పుడు ఈ సందేహం రానేరాదు. ఎందుకంటే భూమితో పాటు వివిధ ప్రదేశాలు, రోడ్డు, రోడ్డు మీది బస్సు కూడా తిరుగుతున్నాయి కాబట్టి గమ్యం చేరుకుంటామని అనిపిస్తుంది. అయితే విమానం గాలిలో ఉన్నప్పుడు దానికి భూమితో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి సరైన చోట దిగడం ఎలాగనే సందేహం కలుగుతుంది. దీనికి సమాధానం చెప్పుకునే ముందు ఒక సంగతి గుర్తు చేసుకుందాం. వేగంగా వెళుతున్న రైలులో కూర్చుని ఒక బంతిని పైకి విసిరామనుకోండి. ఆ బంతి గాలిలో ఉండగా రైలు ముందుకు కదిలిపోతుంది కాబట్టి అది వెళ్లి రైలు గోడలకు గుద్దుకోవాలిగా? కానీ అలా జరగదు. బంతి తిన్నగా వచ్చి మీ చేతుల్లోనే పడుతుంది. ఎందుకంటే రైలులో ఉండే గాలికి, అందులోని ప్రతి అణువుకి కూడా రైలు వేగమే ఉంటుంది. అలాగే భూమి కూడా గుండ్రంగా చాలా వేగంగా తిరుగుతున్నా, దాని చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం మొత్తం దానిని అంటుకుని అదే వేగంతో తిరుగుతుంటుంది. కాబట్టి ఆ వాతావరణంలోనే ప్రయాణించే విమానం కూడా భూ ప్రభావానికి లోబడే ఉంటుంది. అందువల్ల విమానం తప్పిపోతుందనే ఆలోచన అక్కర్లేదు.

    -ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
    • ==============================
    visit My website > Dr.Seshagirirao - MBBS.-

    No comments:

    Post a Comment

    your comment is important to improve this blog...