Thursday, December 08, 2011

క్యాలెండర్‌ రెపరెపలేల?,Wall calendar sound on air Why?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: గోడకు నిలకడగా ఉన్న క్యాలెండర్‌ కాగితాలు సీలింగ్‌ ఫ్యాను వేయగానే రెపరెపలాడుతూ ముందుకు కదుల్తాయెందుకు? గాలి ఒత్తిడికి మరింతగా గోడకు అతుక్కుపోవాలి కదా?

-వైష్ణవి, అమలాపురం

జవాబు: ద్రవాలను, వాయువులను ప్రవాహకాలు (fluids)అంటారు. ఆ ప్రవాహకాల వల్ల కలిగే ఒత్తిడిని ఆ ప్రవాహపు ద్రవపీడనం అంటారు. నిలకడగా ఉన్న గాలి కన్నా కదిలే గాలి కలిగించే పీడనం ఎక్కువని భావించడం వల్లనే ఇలాంటి సందేహాలు ఏర్పడుతాయి. కానీ వేగం పెరిగే కొద్దీ గాలి పీడనం తగ్గుతుంది. దీనినే బెర్నేలీ సిద్ధాంతం అంటారు. ఈ సూత్రం ఆధారంగానే విమానాలు, హెలికాప్టర్లు, గాలిపటాలు, పక్షులు ఎగరగలుగుతున్నాయి. ఇప్పుడు క్యాలెండర్‌ విషయానికి వస్తే గదిలో ఫ్యాన్‌ వేయనప్పుడు గాలి పీడనం సాధారణంగా ఉంటుంది. ఫ్యాన్‌ వేయగానే గాలిలో కదలిక ఏర్పడి పీడనం తగ్గుతుంది. ఈ స్థితిలో క్యాలెండర్‌ కాగితాల ముందు కదిలే గాలి పీడనం కన్నా, ఆ కాగితాల వెనక ఉండే గాలి పీడనం ఎక్కువగా ఉంటుంది. గాలి కదలికల వల్ల క్యాలెండర్‌ ముందు భాగంలో అల్పపీడనం ఏర్పడి ఆ వెనక ఉన్న గాలి ముందుకు వస్తూ మధ్యలో ఉన్న కాగితాలను కూడా తోస్తుంది. అందుకే ఆ రెపరెపలు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...