Q : What is Computer UPS?,కంప్యూటర్ (UPS) యుపిఎస్ అంటే ఏమిటి?.
Ans : కంప్యూటర్ కరెంట్‌పై ఆధారపడి పనిచేసే పరికరం. కరెంట్ లేకపోతే కంప్యూటర్ పనిచేయదు. కరెంట్ సప్లైలోని హెచ్చు తగ్గులు సిస్టమ్ యూనిట్‌పై ప్రభావం చూపి మానిటర్‌లో పిక్చర్‌ట్యూబ్ పోవటమో, మదర్‌బోర్డు పాడవటమా, హార్డ్‌డిస్క్ క్రాష్ అవడమో జరిగిపోయే ప్రమాదముంది. మరీ ఇంతటి ప్రమాదాలు గురించి ఎందుకు? ఒక ఫైల్ మీద పని చేస్తున్నపుడు సడెన్‌గా కరెంట్‌పోతే ఆఫైల్‌లో ఇంకా సేవ్ చేయని భాగం తూడిచి పెట్టు కుపోవచ్చు. లేదంటే ఆ ఫైలే కరఫ్ట్ అయిపోవచ్చు.ఇటువంటి సమస్యలను నివారించడానికి తయారుచేయబడినదే యుపిఎస్. - అన్ ఇంట్రప్టెడ్ పవర్ సప్లై - పేరులోనే ఈ పరికరం ఉపయోగం చెప్పబడింది. అడ్డంకులు లేకుండా కరెంట్‌ను సప్లై చేస్తుంది అని అర్థం. అంటే ఓల్టేజి హెచ్చు తగ్గులను ముందుగానే తాను గ్రహించి కావల్సినంత కరెంట్‌ను కంప్యూటర్‌కు అందిస్తుంది. బ్యాటరీ సహాయంతో కరెంట్‌పోయినా కొంతసేపు అంటే పనిచేస్తున్న ఫైల్‌ను సేవ్ చేసుకుని కంప్యూటర్‌ను షట్‌డౌన్ చేసేంత వరకూ కావల్సిన కరెంట్ సప్లై ఇస్తుంది.
యుపిఎస్‌లో ముఖ్యమైన భాగం బ్యాటరీ, ఇంకా ఎలక్ట్రానిక్ సర్క్యూటీ, పవర్ సప్లై యూనిట్ ఉంటాయి. కరెంట్ సప్లైలోని హెచ్చు తగ్గుల్ని భాగం బ్యాటరీ - ఇంకా ఎలక్ట్రానిక్ సర్క్యూట్రీ ది. పవర్ సప్లై యూనిట్ ఎసి కరెంట్‌ను బ్యాటరీ శక్తిగా (డిసి కరెంట్) మార్చు కుని బ్యాటరీలో నిల్వ చేస్తుంది.
కంప్యూటర్ ఏ కరెంట్‌తో పని చేస్తుంది? కంప్యూటర్ డిసి కరెంట్‌తో పని చేస్తుంది. కాబట్టి మెయిన్ లైన్ నుండీ వచ్చే కరెంట్‌ను సిపియులోని పవర్ సప్లై బాక్స్ తీసుకుని డిసి గా మార్చి కంప్యూటర్ భాగాలకు అందిస్తుంది. మధ్యలో యుపిఎస్ ఉంటే అది ముందుగా మెయిన్ లైన్ నుండీ కరెంట్‌ను స్వీకరించి కంప్యూటర్‌కు అవసరమైనంత ఓల్టేజిలో పవర్ సప్లై బాక్స్‌కు కరెంట్‌ను అందిస్తుంది.
యుపిఎస్‌ల్లోనూ రకాలున్నాయి.
1. ఆఫ్‌లైన్ యుపిఎస్, 2. హైబ్రిడ్ యుపిఎస్, 3. ఆన్‌లైన్ యుపిఎస్
ఆఫ్‌లైన్ యుపిఎస్ కరెంట్‌లో వచ్చే హెచ్చుతగ్గుల్ని నియంత్రించి కంప్యూ టర్‌కు నేరుగా కరెంట్‌ను అందిస్తుంది. కరెంట్ పోయినపుడు బ్యాటరీ ద్వారా కరెంట్‌ను అందిస్తుంది.
ఆన్‌లైన్ యుపి ఎస్ కరెంట్‌ను నేరుగా బ్యాటరీకి తీసు కుని కరెంట్ ఉన్నా లేకున్నా బ్యాటరీ నుండే కంప్యూటర్‌కు అందిస్తుంది.
హైబ్రిడ్ యుపిఎస్ లేదా లైన్ ఇంట రాక్టివ్ యుపిఎస్‌పై రెండింటి పనుల్నీ ఏ సమయంలో ఏది అవసరమో దాని ఆధారంగా చేస్తుంది. యుపిఎస్ కంప్యూటర్‌లో భాగం కాదు.కంప్యూ టర్‌కు ఒక అదనపు అవసరం. యుపిఎస్ లేకున్నా కంప్యూటర్ పని చేస్తుంది. అయితే యుపిఎస్ లేని కంప్యూటర్ ఓల్టేజి హెచ్చుతగ్గులకు గురయ్యి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.
- ==========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...