Q : దోమ కుట్టి రక్తమెలా పీల్చుతుంది ?
జవాబు : దోమ చూసేందుకు చాలా చిన్నదే అయినా మనిషిని పరోక్షముగా చంపలలిగిన శక్తి కలిగిఉన్నది . మానవ రక్తాన్ని ఆహారముగా తీసుకుంటూ మలేరియా , ఫైలేరియా , డెంగూ , ఎల్లో ఫీవర్ , చికెన్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులను తెచ్చే పరాన్నజీవులను మానవ రక్తములో ప్రవేశ పెడతాయి. అందుకు అనుకుణముగా దోమ నోటి భాగాలు మారి వుంటాయి.
డాక్టర్ ఇంజక్షన్ చేసిన రీతిలోనే దోమ తన నోటిభాగాలను శరీరము లోకి బలంగా గుచ్చి రక్తం పీలుస్తుంది. రంపపు పళ్ళ వంటి భాగాలతో శరీరం లో రంధ్రం చేస్తే సిరంజి వంటి మెడ కండరాలతో స్ట్రా లా డ్రింక్ తాగిన రీతిలో రక్తం పీల్చుతుంది. తాగే రక్తము గడ్డకట్టకుంటా ఉండేందుకు ఒక రకమైన రసాయనాన్ని వదులుతుంది.
- ===============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...