ప్ర : How to termite eat wood?,చెదలు చెక్కను ఎలా తింటాయి ?
జ : చెద అనేది చీమ వంటి కీటకమే . మూడు జతల కాళ్ళు ఉంటాయి. రెక్కలు ఉండవు . చెదలు పట్టి పుస్తకాలు , చెక్కబీరువాలు దెబ్బతినటం తెలిసిందే . చెదలు భూమిలోపల పుట్ట కలిగిఉంటాయి . వాటి కుండే బలమైన నోటిభాగాలవల్ల చెక్కను కొరుకుతాయి ... అయితే చెక్కలను జీర్ణం చేసుకోగలిగిన శక్తి చెదలకు సహజము గా లేదు .చెదల జీర్ణవ్యవస్థ లో సూక్ష్మజీవులు చెదలు తిన్న చెక్కలలోని సెల్యులోజని జీర్ణం చేసుకునేందుకు అవసరమైన ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తాయి. ఆ సూక్ష్మజీవులకు ఆవాసము , రక్షణ ... చెద కల్పిస్తే ... అవి మరోరూపము లో చెద రుణము తీర్చుకుంటున్నాయి. చెదల లోపల ఆ సూక్ష్మజీవులు కనుక లేకుంటే అవి చెక్కను తినలేవు .
- ================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...