Saturday, May 24, 2014

Modem is using for what?,మోడెమ్‌ ఎందుకు వాడుతారు?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : Modem is using for what?,మోడెమ్‌ ఎందుకు వాడుతారు?
జ : 'టెలిఫోన్‌' టెక్నాలజీలో 'సౌండ్‌'ను 'ఎనలాగ్‌ సిగ్నల్స్‌'గా మార్చి ఒక చోటి నుండీ మరొక చోటకి పంపుతారు. కంప్యూటర్‌లో ఉండే 'డేటా' 'డిజిటల్‌' సిగ్నల్స్‌ రూపంలో ఉంటుంది. దీనిని 'ఎనలాగ్‌'గా మార్చగలిగితే సమా చారాన్ని కూడా ఒక చోటనుంచీ మరొక చోటికి పంపవచ్చు కదా! అన్న ఐడియా తో కనుగొనబడిందీ మోడెమ్‌.

మన కంప్యూటర్‌లో ఉన్న డిజిటల్‌ డేటాని అనలాగ్‌ సిగ్నల్స్‌ మాడ్యులేట్‌ చేయాలి. వేరే కంప్యూటర్‌కు చేరగానే మరలా 'అనలాగ్‌' నుండీ డిజిటల్‌ డేటాగా డీమాడ్యులేట్‌ చేయాలి. ఈ రెండు పనులూ చేయగలిగే పరికరముంటే సమాచారాన్ని ఒక చోట నుండీ మరోక చోటికి పంపటం సాధ్యం.  దానికే పేరు పెట్టాలి? అది చేసే పని మాడ్యులేటింగ్‌, డీమాడ్యులేటింగ్‌ కాబట్టి మొదటి పదంలోని మొదటి రెండక్షరాలు, రెండో పదంలోని మొదటి మూడక్షరాలు కలిపి మోడెమ్‌గా పేరు పెట్టారు.

మోడెమ్‌ ప్రవేశంతో ఇంట ర్నెట్‌ అవతరించింది. నేడు కమ్యూ నికేషన్‌ రంగంలో కంప్యూటర్‌ తన విశ్వరూపాన్ని చూపుతోంది. మోడెమ్‌ ఆవిర్భావంతో మొట్టమొదటి 'ఫాక్స్‌' ప్రవేశపెట్టబడింది. డాక్యుమెంట్లను, ఉత్తరాలను ఫోన్‌ చేరగలిగేంత దూరమూ వెంటనే యధాతధంగా పంపే వీలు ఫ్యాక్స్‌కు ఉండేది.

మోడెమ్‌ సామర్థ్యం :

మోడెమ్‌ సేకన్‌కు ఎన్ని బిట్స్‌ సమాచారాన్ని తరలిస్తుంది లేదా స్వీకరిస్తుంది అనే విషయాన్ని మోడెమ్‌ సామర్థ్యంగా గుర్తిస్తారు. దీనిని బిట్స్‌ పవర్‌ సెకండ్‌లలో కొలుస్తారు. ఈ వేగాన్నే 'బాడ్‌రేట్‌' అంటారు. బైనరీ డిజిట్స్‌ రూపంలో సమాచారాన్ని పంపేటపుడు '1' నుండీ '0' కీ  '0' నుండీ '1' మారడాన్ని స్టేట్‌ ఛేంజ్‌ అంటారు. ఈ స్టేట్‌ ఛేంజ్‌ లేదా స్థితి మార్పు సెకన్‌కు ఎన్ని సార్లు జరుగుతుందో దానినే బాడ్‌రేట్‌ అంటారు. మోడెమ్‌ వేగాన్ని బిట్స్‌ పర్‌ సెకండ్‌, కిలోబైట్స్‌ పర్‌ సెకండ్‌, మెగా బైట్స్‌ పర్‌ సెకండ్‌లలో కొలు స్తారు.

మోడెమ్‌లో రకాలు : మోడెమ్‌లు ప్రధానంగా రెండు రకాలు

1. ఇంటర్నల్‌ మోడెమ్‌
2. ఎక్స్‌టర్నల్‌ మోడెమ్‌

ఇంటర్నల్‌ మోడెమ్‌ కంప్యూటర్‌ లోపల ఫిక్స్‌ చేయడానికి వీలుగా ఉండే కార్డు రూపంలో ఉంటుంది. ఎక్స్‌టర్నల్‌ మోడెమ్‌ విడిగా బయట నుంచి సిపి యుకు సీరియల్‌ పోర్ట్‌ ద్వారా కనెక్టు చేస్తారు. రెంటింటి పనీతీరు, మన్నిక అన్నీ ఒక్కటే. ఎక్స్‌టర్నల్‌ మోడెమ్‌ అయితే దాని పనితీరును ఇండికేటర్‌ లైట్స్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంటర్నల్‌ మోడెమ్‌కు ఆ ఆవకాశం ఉండదు.

మరిన్ని మోడెమ్‌ విషయాలు :

సెకన్‌కు 600 కంటె ఎక్కువ బిట్స్‌ సమాచారాన్ని పంపవలసి వచ్చినపుడు మోడెమ్‌ ఆ సమాచారాన్ని పాకెట్లుగా కుదించి పంపుతుంది. దీని కోసం మోడెమ్‌లోనే బిల్టిన్‌ కంప్రెషన్‌ ప్రోగ్రామ్‌ ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్‌ ఎలా పని చేస్తుంది. ఏ నిష్పత్తిలో సమాచారాన్ని కుదించి పంపుతుంది అనే విషయాన్ని గుర్తించండి.

మాడెమ్‌ పాకెట్‌లలో సమాచారాన్ని పంపేటపుడు కొన్ని పాకెట్లు మిస్సయ్యే ప్రమాదముంది. అలాంటి సందర్భంలో ఆ పొరపాటును సర్దుకుని మిస్సయిన పాకెట్‌ను తిరిగి పంపగలిగే ఎర్రర్‌ కరెక్షన్‌ కూడా ఉండాలి.

టెలిఫోన్‌ లైన్‌ సరిగా లేనపుడు మోడెమ్‌ పని చేసే భాగం కూడా తగ్గుతుంది. దీనిని ఫాల్‌ బ్యాక్‌ స్పీడ్‌ అంటారు. లైన్‌ క్లియర్‌గా ఉంటే ఆ లైన్‌లో ఎంత వేగంతో పంపవచ్చో అంత వేగం పెరుగుతుంది. దీనిని 'ఫాల్‌ ఫార్వార్డ్‌ స్పీడ్‌' అంటారు. ఇంటర్నెట్‌లో డౌన్‌లోడ్‌ చేస్తున్నపుడు ఈ వేగాన్ని మనం గమనించవచ్చు.
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...