Q : What isYam? - talk about the precept,యమ - నియమము ల గురించి తెలుపండి ?
Ans : పతంజలి ద్వార మనకు యోగ శాస్త్రం అందినది.యమనియమాలందులోవే . పతంజలి యోగ సూత్రాలు మనలోని పవిత్రతను పినరుద్ధరించటం ఎలాగో చెప్తాయి.
1.యమములు 2.నియమములు.---యమ అంటే basics, నియమాలు(precepts) అంటే తరువాత చెప్పినవి.
1.యమ అని పేరుగలవి ఐదునీతిసూత్రాలు. వీటిని దేశకాల పరిస్ధితులతో సంబంధం లేకుండా పాటించాలంటారు(i) అహింస; (ii)ఆత్మనిగ్ర్హం ;(iii)సత్యపాలన;(iv) దోంగతనం చేయకుండా;(v) ఎవరిదగ్గర నుంచి ఏదీ ఉరికే తీసుకొకుండా ఉండటం.............ఇవి ఐదూ యమం.ఇవి ప్రాధమికం.
- అహింస : ఎవరికీ హాని తలపెట్టకుండుట . . . హాని చేయకుండా ఉండుట .
- బ్రహ్మ చర్యము (ఆత్మ నిగ్రహం) : ఆత్మ సంయమమును పాటించి వీర్యమును రక్షించుకోవడం .. బ్రహ్మ సాక్షాత్కారము చేసుకోవడము .
- సత్యము : మనసు , వాక్కు , కర్మ - వీటి ద్వారా సత్యమును ఆచరించుట .
- ఆస్తేయము : దొంగతనము చేయకుండుట ... ఇతరుల వస్తువులు వారి అనుమతి లేకుండా తీసుకోకూడదు .
- అపరిగ్రహము : అవసరాలకు మించి భోగ్యవస్తువులను సమకూర్చుకొనకపోవడము .
2.నియమాలు కూడా ఐదు. ఈ గుణములను అలవర్చుకొన్నట్లయితే వ్యక్తి తన సౌశీల్యాన్ని చక్కదిద్దుకొని వికసింప చేసుకోవడానికి వీలు కలుతుతుంది ;(i)శౌచం లేదా పవిత్రత ;(ii)సంతోషం ;(iii)ఇంద్రియనిగ్రహం/తపస్ (iv)స్వాధ్యాయం (v)ఈశ్వరప్రణిధానం/భగవంతుడికి అర్పి,చుకోవటం. ఈ యమనియమాలను పాటిస్తే గురువు అనుగ్రహిస్తాడు.
- (i)శౌచం లేదా పవిత్రత : శరీరమును ,మనసును స్వచ్చముగా ఉంచుకోవడం .
- (ii)సంతోషం : తనకున్న దానితో తృప్తిపడడము . లేనిదానికోసము ఏ సమయము లొనైనా విచారించకుండుట .
- (iii)ఇంద్రియనిగ్రహం/తపస్ : ఒక ఉన్నతమైన ధ్యేయముకోసము కష్టాల్ని సహించడము లేదా అలుపెరగ కుండా పరిశ్రమించడము .
- (iv)స్వాధ్యాయం : సధ్గ్రంధములను అద్యయనము చేయడం . సత్పురుషులతో సాంగత్యము(స్నేహము)చేయడము .
- (v)ఈశ్వరప్రణిధానం / భగవంతుడికి అర్పి,చుకోవటం : తాను చేసేటటువంటి కర్మలను , తనకు కలిగే కోరికలను భగవంతునికి సమర్పించడము .
- (అంతర్భాగము: మౌని-రచయిత / సేకరణ: ప్రసాద్)
- =============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...