Saturday, January 21, 2012

Why do we feet hot on wearing Swetter,స్వెట్టర్ వేసుకుంటే వెచ్చగా ఉంటుందెందుకు?




ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...్
ప్ర : స్వెట్టర్ వేసుకుంటే వెచ్చగా ఉంటుందెందుకు?
జ : స్వెట్టర్ ని జంతురోమాలతో చేస్తారు . ఆ రోమాలలో ఉండేది ' కెరోటిన్‌ ' అనే ప్రోటీన్‌ . ఈ ప్రోటీన్‌ ఉష్ణోగ్రతను నిలిపి ఉంచే గుణము కలిగిఉంటుంది . ఫలితముగా శరీర ఉష్ణోగ్రత బయట ఉన్న చల్ల గాలితో కలిసి పోకుండా అక్కడే నిలిపిఉంచి వెచ్చదనము కలిగిస్తుంది . కెరోటిన్‌ పోగులు మెలికలు తిరిగి ఉంటాయి. . . ఆ మెలికలు మధ్య గాలి నిలిచి ఉండి ఉష్ణోగ్రతను అటునుంది ఇటు ... ఇటునుండి అటు పోనివ్వక వెచ్చదనాన్ని అలాగే నిలిచి ఉంచుతుంది .

  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...