Sunday, January 08, 2012

పదార్ధము అంటే ఏమిటి? ఎన్నిరకములున్నవి?, What is matter? how many types?




ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


Q : పదార్ధము అంటే ఏమిటి?

A : పరమాణువులు కలిసి అణువులు గా మారుతాయి. ఈ అణువులన్నీ కలిసి పదార్ధం ను ఏర్పరుచుతాయి. విశ్వము లో అన్నిరకాల పదార్ధాలు (సజీవ , నిర్జీవ ) సూక్ష్మమైన అణువులతో , ఈ అణువులు అంతకంటే సూక్ష్మమైన పరమాణువులతో నిర్మితమై ఉంటాయి. అంటే పదార్ధాన్ని విడగొడితే అణువులు , వీటిని విడగొడితే పరమాణువులు ఏర్పడతాయి.

దాల్టన్‌ సిద్ధాంతము ప్రకారము పదార్ధములో విభజించడానికి వీలుకాని భాగమే ప్రమాణువు (sub-atomic particle). లాటిన్‌ భాషలో ' atom ' అంటే " విభజించడానికి వీలుకానిది " అని అర్ధము ... కానీ ఆతర్వాత వచ్చిన వివిధ ప్రతిపాదనల వల్ల పదార్ధములో అతిచిన్న భాగము అణువు , పరమాణువు లు కాదని , ఇందులో కుడా ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలున్నాయని గుర్తించారు . వీటినే ప్రాధమిక కణాలు అంటారు . అవి :
  • ఎలక్ ట్రాన్‌ -electron(e-),
  • ప్రోటాన్‌-proton(p+),
  • న్యూట్రాన్‌- neutron(n^0).

పదార్ధము(matter): -->అణువులు -->పరమాణువులు -->ఎలక్ట్రాన్ +‌-->న్యూట్రాన్‌ +-->ప్రోటాన్‌.

అణువులు - Atoms : ఇవి స్థిరమైనవి . రసాయనికముగా జడత్వాన్ని ప్రదర్శిస్తాయి.

ప్రమాణువు - sub-atomic particles : ఇవి అస్థిరమైనవి . స్థిరత్వముకోసం రసాయనిక చర్యలో పాల్గొంటాయి కాబట్టి ఇవి చురుకైనవి . అస్థిరమైన పరమాణువులు స్థిరమైన అనువులుగా మారుతాయి. ఉదా: H(sub- atomic particles)+H(sub-atomic particles)---->H2 (atom). ఈ విధముగా పరమాణువులన్నీ కలిసి అణువులను , ఈ అణువులన్నీ కలిసి పదార్ధాన్ని ఏర్పరుస్తాయి.
  • పదార్ధము - రకాలు :
అణువుల మధ్య ఉండే అంతర్గత ఆకర్షణ బలాలను ఆధారము చేసుకొని పదార్ధాలను వాటి స్థితిని బట్టి 3(మూడు)రకాలుగా విభజించవచ్చును.

  • 1.ఘన పదార్ధాలు (solids),
  • 2.ద్రవ పదార్ధాలు (liquids),
  • 3.వాయు పదార్ధాలు (gases),

ఘన పదార్ధాలు(s) : ఈ రకమైన పదార్ధాల్లొని అణువుల మద్య ఆకర్షణ బలాలు బలముగా ఉంటాయి. వీటికి నిర్ధిష్టమైన ఆకృతి వుంటుంది . ఉదా: ఇసుక , ఉప్పు .

ద్రవ పదార్ధాలు(L) : ద్రవ పదార్ధాలలోని అణువులు మధ్య అంతర్గత ఆకర్షణ బలాలు బలహీనము గా ఉంటాయి. వీటికి నియమితమైన ఆకారము లేదు . ఇవి స్థిరమైన ఘన పరిమాణాన్ని ఆక్రమిస్తాయి. ఉదా : నీరు , పాలు ,

వాయు పదార్ధాలు(g) : వాయు పదార్ధములోని అణువుల మధ్య ఆకర్షణ బలాలు అతి బలహీనముగా ఉంటాయి. అణువులు స్వేచ్చగా తిరుగుతాయి. వీటికి క్రమరహిత చలనము ఉంటుంది. ఉదా : గాలిలో ఆక్షిజన్‌ (O2) వాయువు , కార్బనండయాక్షైడ్ (CO2) వాయువు .

source : an article / Vasam Srinivas (Lecturer )


కేంద్రము (కణిక) - nucleus.
పదార్ధము - matter
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...