Tuesday, January 31, 2012

టమాటా పైపొర జీర్ణం కాదంటారు, ఎందువల్ల?, Tomato outer layer can not be digested Why?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...




ప్రశ్న: టమాటా పైపొర జీర్ణం కాదంటారు, ఎందువల్ల?


జవాబు: వృక్షశాస్త్రం ప్రకారం టమాటా కూడా మిర్చి, వంకాయ, ఉమ్మెత్తకాయ కుటుంబమైన సొలనేసీ (solanaceae)కి చెందినదే. దీని శాస్త్రీయ నామం సొలానమ్‌ లైకోపెర్సికమ్‌. టమాటా పైపొర పలుచని సెల్యులోజ్‌ నిర్మితం. ఇందులో గట్టిగా కాకున్నా, దృఢంగా ఉండే లైకోపీన్‌ (lycopene) అనే గ్త్లెకోప్రోటీను ఉంటుంది. మన జీర్ణవ్యవస్థ కేవలం తక్కువ సంఖ్యలో మోనోశాకరైడ్లు ఉన్న చక్కెరలను మాత్రమే అరాయించుకోగలవు. కానీ అధిక సంఖ్యలో చక్కెరలున్న సెల్యులోజ్‌లాంటి పాలీశాకరైడులను జీర్ణం చేయలేదు. టమాటా పండు చర్మం పాలీశాకరైడులు, గ్త్లెకోప్రొటీన్ల వంటి పెద్ద అణువులతో నిర్మితమయినందున అది జీర్ణం కాకుండా అలాగే పీలికలుగా విసర్జితమవుతుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య,--నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...