Tuesday, January 31, 2012

మందులు వేసుకునేందుకు వేళలేల?,Why do doctors tell timings for medicines?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...



ప్రశ్న: డాక్టర్లు కొన్ని మందులను భోజనానికి ముందు వేసుకోమని, కొన్నింటిని ఆహారం తీసుకున్నాక వేసుకోవాలని చెబుతారు, ఎందుకని?


జవాబు: మందులను శరీరం తనలో శోషించుకునే విషయంలో ఆహారం ప్రమేయం చాలా ఉంటుంది. సేవించిన మందు కడుపులో నుంచి రక్తంలోకి ప్రవేశించి శరీరంలో కావలసిన ప్రదేశానికి చేరుకునే ప్రక్రియలు వేర్వేరుగా ఉంటాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకునే వైద్యులు మందులు ఎలా తీసుకోవాలో సూచిస్తారు. మందుల్లో చాలా వరకు కడుపులో ఆమ్లాలను (యాసిడ్లు) స్రవింపచేయడంతో కడుపులో మంట, నొప్పి ఏర్పడడంతో పాటు, వికారం, వాంతుల వంటి అసౌకర్యాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి మందులను ఆహారం తిన్న వెంటనే తీసుకోవడం వల్ల వాటి ప్రభావం చాలా వరకు తగ్గి, అవి ఆహారంతో పాటుగా విచ్ఛిన్నమై శరీరంలో కలిసిపోతాయి. కొన్ని మందులు ఖాళీగా ఉండే కడుపుపై ఎలాంటి ప్రభావం చూపకుండా పూర్తిగా రక్తప్రవాహంలో వెంటనే కలిసిపోవాల్సిన అవసరం ఉంటే, వాటిని ఆహారానికి ముందుగా తీసుకోవాలని సూచిస్తారు. పాలు, టీ, కాఫీలతో మాత్రలను వేసుకోవద్దని వైద్యులు చెప్పారంటే దానర్థం ఆ మందుల్లోని రసాయనాలు వాటితో కలిసినప్పుడు రియాక్షన్‌లాంటి అవాంఛనీయ పరిస్థితులకు అవకాశం ఉందన్నమాట.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్.

  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...