Wednesday, January 04, 2012

What is the history of Salt?, ఉప్పు చరిత్ర ఏమిటి?



  • image : courtesy with Eenadu news paper.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

  • Salt ,ఉప్పు

ఒకప్పుడు ఉప్పు విలువై వస్తువు... దేశాలను సంపన్నం చేసిన ధనం... సైనికులకి అదే జీతం..

అబ్బో... చెప్పుకోవాలంటే ఉప్పు గొప్ప ఒప్పుకోక తప్పనిదే! ఒకప్పుడు అది డబ్బుతో సమానం. ఇది దేశాల ఆర్థిక స్థితిగతులనే మార్చింది. 'జీతం' అనే పదం పుట్టడానికి కారణమయ్యింది. కొన్ని దేశాల్లో సైనికులకు ఉప్పునే జీతంగా ఇచ్చేవారు మరి! పురాతన కాలంలో 'తెల్ల బంగారం' అని పిలుచుకునే వారు. ఇక మన దేశంలో ఉప్పు సత్యాగ్రహం ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో గుర్తుంది కదా? బ్రిటిష్‌వారు ఉప్పుపై విధించిన పన్నుకి వ్యతిరేకంగానే గాంధీజీ దీన్ని చేపట్టారు.

ఇంతకీ ఉప్పు వాడకం ఎప్పుడు మొదలైంది? రాతి యుగంలో ఆదిమానవులు పచ్చిమాంసం తినేవారు కాబట్టి ఉప్పు అవసరమే ఉండేది కాదు. పది వేల ఏళ్ల క్రితం వ్యవసాయం మొదలుపెట్టి వరి, గోధుమ లాంటి ఆహార ధాన్యాలు పండించడం మొదలుపెట్టగానే ఉప్పదనం కావల్సివచ్చింది. ఉప్పుని మొదట చైనాలో వాడినట్టు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 6000లో చైనాలోని యుంచెంగ్‌ అనే ఉప్పునీటి సరస్సు నుంచి ఉప్పుని తయారు చేశారని చెబుతారు. ఆసియాలో క్రీస్తు పూర్వం 4,500 నుంచి వినియోగంలో ఉన్నట్టు అంచనా. ఈజిప్టువాసులు మమ్మీలను నిలవ ఉంచేందుకు వాడేవారు.

15వ శతాబ్దంలో పోలాండ్‌ ఉప్పు వల్లే అత్యంత ధనవంతమైన దేశంగా మారింది. ఉప్పు గనుల నుంచి ఇతర దేశాలకు సరఫరా చేసి బోలెడు డబ్బు దండుకునేది. తరువాత జర్మన్లు సముద్రపు ఉప్పుని తయారు చేయడంతో అందరికీ అందుబాటులోకి వచ్చింది. రోమన్‌ చక్రవర్తులైతే సైన్యానికి కొన్నాళ్ల పాటు ఉప్పునే నెల జీతంగా ఇచ్చారు. జీతానికి వాడే Salary పదం పుట్టుకకు కారణం ఉప్పే. Salarium అనే లాటిన్‌ పదం నుంచి ఇది వచ్చింది. ఆ పదానికి అర్థం Payment in Salt.

  • మీకు తెలుసా?
* ప్రపంచ వ్యాప్తంగా 210 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉప్పు ఉత్పత్తి జరుగుతోంది.
* ఉత్పత్తిలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న దేశాలు అమెరికా, చైనా, జర్మనీ, ఇండియా.
* మన దేశంలో ఏటా 14.5 మిలియన్‌ టన్నుల ఉప్పుని ఉత్పత్తి చేస్తున్నారు.

  • Source : courtesy with Eenadu news paper.

  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...