Tuesday, January 31, 2012

టమాటా పైపొర జీర్ణం కాదంటారు, ఎందువల్ల?, Tomato outer layer can not be digested Why?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: టమాటా పైపొర జీర్ణం కాదంటారు, ఎందువల్ల?

జవాబు: వృక్షశాస్త్రం ప్రకారం టమాటా కూడా మిర్చి, వంకాయ, ఉమ్మెత్తకాయ కుటుంబమైన సొలనేసీ (solanaceae)కి చెందినదే. దీని శాస్త్రీయ నామం సొలానమ్‌ లైకోపెర్సికమ్‌. టమాటా పైపొర పలుచని సెల్యులోజ్‌ నిర్మితం. ఇందులో గట్టిగా కాకున్నా, దృఢంగా ఉండే లైకోపీన్‌ (lycopene) అనే గ్త్లెకోప్రోటీను ఉంటుంది. మన జీర్ణవ్యవస్థ కేవలం తక్కువ సంఖ్యలో మోనోశాకరైడ్లు ఉన్న చక్కెరలను మాత్రమే అరాయించుకోగలవు. కానీ అధిక సంఖ్యలో చక్కెరలున్న సెల్యులోజ్‌లాంటి పాలీశాకరైడులను జీర్ణం చేయలేదు. టమాటా పండు చర్మం పాలీశాకరైడులు, గ్త్లెకోప్రొటీన్ల వంటి పెద్ద అణువులతో నిర్మితమయినందున అది జీర్ణం కాకుండా అలాగే పీలికలుగా విసర్జితమవుతుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య,--నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

వైఫై ఎలా పనిచేస్తుంది? , How is Wi-Fe working?

  • image : courtesy with Eenadu news paper.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: wifi సాంకేతికత గురించి విన్నాను. అదెలా పనిచేస్తుంది?

జవాబు:wifi అంటే wireless fidelityకి సంక్షిప్త రూపం (abbreviation) గా భావించాలి. ఇప్పుడెవరూ ఇంటర్‌నెట్‌ అంటే ఇంటర్నేషనల్‌ నెట్‌వర్క్‌ అనే పెద్ద పేరుకు సంక్షిప్త రూపంగా భావించనట్టే, వైఫై కూడా అలాగే అలవాటైపోయింది. తీగల (wires) తో సంధానించాల్సిన అవసరం లేకుండా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, సెల్‌ఫోన్లు, కెమేరాలు, వీడియోలు, టీవీల్లాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను నిస్తంత్రీ పద్ధతి (wireless mode)లో సంధానం చేయడానికి ఈ సాంకేతికతను వాడుతున్నారు. సాధారణంగా ఒకే ప్రదేశంలో ఉండే పరికరాలను వైఫై సర్వర్‌ ద్వారా అనుసంధానం చేస్తారు. ఆయా పరికరాలు ఈ సాంకేతికతను వాడడానికి అనుకూలంగా తయారైనవై ఉండాలి. ఇలాంటి సర్వర్‌ను హాట్‌స్పాట్‌ లేదా యాక్సెస్‌ పాయింట్‌ అంటారు. దీని చుట్టూ సుమారు 20 మీటర్ల పరిధిలోని పరికరాలను అనుసంధానం చేయడానికి ప్రత్యేక ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్‌ను సహాయంతో మైక్రోవేవ్‌ తరంగాల ద్వారా నెలకొల్పుతారు. ఇలా సంధానించిన పరికరాల మధ్య సమాచార మార్పిడి వీలవుతుంది. అంటే తీగలు లేకుండానే ఆయా పరికరాలను పనిచేయించడం సాధ్యమవుతుందన్నమాట.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

గాడిద పరిగెత్తలేదేం?,Donkey cannot run Why?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: గుర్రంలాగా గాడిద ఎందుకు పరిగెత్తదు?

జవాబు: వివిధ జంతువులకు వివిధ రకాలైన శారీరక నిర్మాణం ఉంది. గుర్రానికి, గాడిదకు కొన్ని పోలికలు ఉన్నా శరీర నిర్మాణం ఒకేలా ఉండదు. గాడిదకు, గుర్రానికి ఉన్న జన్యు సారూప్యత (genetic proximity) కన్నా, జీబ్రాకు, గుర్రానికి మధ్య ఎక్కువ జన్యు సారూప్యత ఉంది. గుర్రం దేహంలో వేగంగా పరిగెత్తడానికి వీలైన బాహ్య, అంతర వ్యవస్థలు ఉన్నాయి. దాని కాలి కండరాల దృఢత్వం ఎక్కువ. ఆ కాళ్లను, మడమలను నియంత్రించే మెదడు భాగానికి, దాని కండరాలకు మధ్య ఉన్న నాడీసంధానం గాడిదకు లేదు. గుర్రం కాళ్లు పొడవుగా ఉండడం, మెడ భాగం దృఢంగా ఉండడం వల్ల పరిగెత్తేప్పుడు అది తన శరీరాన్ని బాగా నియంత్రించుకోగలదు. పరిగెత్తడంలో గుర్రం తోక పాత్ర కూడా ఎక్కువ.ఇలాంటి శారీరక అనుకూలతలే జంతువుల పరుగు సామర్థ్యాలను నిర్ణయిస్తాయి.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

మందులు వేసుకునేందుకు వేళలేల?,Why do doctors tell timings for medicines?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: డాక్టర్లు కొన్ని మందులను భోజనానికి ముందు వేసుకోమని, కొన్నింటిని ఆహారం తీసుకున్నాక వేసుకోవాలని చెబుతారు, ఎందుకని?

జవాబు: మందులను శరీరం తనలో శోషించుకునే విషయంలో ఆహారం ప్రమేయం చాలా ఉంటుంది. సేవించిన మందు కడుపులో నుంచి రక్తంలోకి ప్రవేశించి శరీరంలో కావలసిన ప్రదేశానికి చేరుకునే ప్రక్రియలు వేర్వేరుగా ఉంటాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకునే వైద్యులు మందులు ఎలా తీసుకోవాలో సూచిస్తారు. మందుల్లో చాలా వరకు కడుపులో ఆమ్లాలను (యాసిడ్లు) స్రవింపచేయడంతో కడుపులో మంట, నొప్పి ఏర్పడడంతో పాటు, వికారం, వాంతుల వంటి అసౌకర్యాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి మందులను ఆహారం తిన్న వెంటనే తీసుకోవడం వల్ల వాటి ప్రభావం చాలా వరకు తగ్గి, అవి ఆహారంతో పాటుగా విచ్ఛిన్నమై శరీరంలో కలిసిపోతాయి. కొన్ని మందులు ఖాళీగా ఉండే కడుపుపై ఎలాంటి ప్రభావం చూపకుండా పూర్తిగా రక్తప్రవాహంలో వెంటనే కలిసిపోవాల్సిన అవసరం ఉంటే, వాటిని ఆహారానికి ముందుగా తీసుకోవాలని సూచిస్తారు. పాలు, టీ, కాఫీలతో మాత్రలను వేసుకోవద్దని వైద్యులు చెప్పారంటే దానర్థం ఆ మందుల్లోని రసాయనాలు వాటితో కలిసినప్పుడు రియాక్షన్‌లాంటి అవాంఛనీయ పరిస్థితులకు అవకాశం ఉందన్నమాట.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్.

  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

నూనె కాగితం పారదర్శకమవుతుంది. ఎందువల్ల?,Oily paper become transperent Why?

  • image : courtesy with Eenadu news paper.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: తెల్ల కాగితంపై నూనె పడితే, ఆ ప్రాంతం పారదర్శకమవుతుంది. ఎందువల్ల?

జవాబు: కాంతి కిరణాలు పదార్థాలపై పడినప్పుడు కొన్ని కిరణాలు వెనుతిరిగి వస్తాయి. ఈ ప్రక్రియను పరావర్తనం (reflection) అంటారు. కొన్ని పదార్థాల గుండా కాంతికిరణాలు చొచ్చుకుపోతూ వంపునకు గురవుతాయి. ఈ ప్రక్రియను వక్రీభవనం(refraction) అంటారు. తెల్లకాగితం విషయానికి వస్తే అది వెదురులాంటి పీచుపదార్థాలతో తయారవుతుంది. కాగితంలో ఈ పదార్థపు పోగులు వదులుగా ఉండి, ఆ పోగుల మధ్య గాలి బంధించబడి ఉంటుంది. తెల్లకాగితంపై కాంతి పడినప్పుడు ఆ కాంతి కిరణాలలోని ఎక్కువ శాతం ఎక్కువ పాళ్లలో ఉండే పీచుపదార్థపు పోగులపై పడి పరావర్తనం చెంది వెనుతిరిగితే, మిగిలిన తక్కువ శాతం కాంతి కిరణాలు మాత్రమే పోగుల మధ్య ఉండే ప్రాంతాలనుంచి లోపలికి ప్రవేశించగలవు. కాగితంపై పడే కాంతి చాలా వరకు పరావర్తనం చెందడం వల్ల తెల్లకాగితం ప్రకాశవంతంగా ఉంటుంది. కాగితం ఆవలి వైపునకు చొచ్చుకుపోయే కాంతి పరిమాణం తక్కువవడం వల్ల కాగితం కాంతి నిరోధకం (opaque)గా ఉంటుంది.

కాగితంపై నూనె పడినప్పుడు అది కాగితంలోని పోగుల మధ్య గాలి ఉండే ప్రాంతాలలోకి చేరుకుంటుంది. ఆ ప్రాంతంపై పడే కాంతి కిరణాలు పరావర్తనం చెందకుండా, ఎక్కువశాతం చొచ్చుకుపోగలుగుతాయి. అందువల్లనే నూనె పడిన ప్రదేశంలో కాగితం పారదర్శకం (transperent) అవుతుంది. కాంతి పరావర్తనం చెందకపోవడం వల్లనే నూనెలో తడిసిన కాగితం ప్రకాశాన్ని కోల్పోతుంది.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, January 24, 2012

How to prevent loss of shining of gold ornaments?,బంగారు ఆభరణాలు మెరుపు పోకుండా ఏవిధముగా జాగ్రత్త పడాలి ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

  • Q : బంగారు ఆభరణాలు మెరుపు పోకుండా ఏవిధముగా జాగ్రత్త పడాలి ?
A : లోషన్లు , పౌడర్లు , మురికి వంటి వాటికారణముగా బంగారు ఆభరణాల పై నెమ్మదిగా పల్చని పొరలాంటిది ఏర్పడి మెరుపు తగ్గిపోతూ ఉంటుంది . తగిన జాగ్రత్తలు ద్వారా మెరుపును తిరిగి తీసుకురావచ్చును .
  • ఒక పాత్రలో సగం దాకా గోరువెచ్చని నీరు పోసి రెండు టేబుల్ స్పూన్లు వాషింగ్ లిక్విడ్ కలిపి ఆభరణాలను 30 నిముషాల సేపు నానబెట్టి టూత్ బ్రెష్ తో సున్నితముగా బ్రెష్ చేయాలి . గోరువెచ్చని నీటిలో కడిగి మెత్తని కాటన్‌ గుడ్డ తో తుడవాలి. ఇలా నెలకొకసారి చేస్తే సరిపోతుంది .
  • అమ్మోనియా + నీరు సమపాళ్ళలో తీసుకుని ఆభరణాలను 20 నిమిషాలు నానబెట్టి టూత్ బ్రెష్ తో స్క్రబ్ చేయాలి. ట్యాప్ కింద కడిగి వస్త్రము తో తుడవాలి.
  • స్కికా ఉండే టూత్ పేస్ట్ తో ఆభరణాలు క్లీన్‌ చేయకూడదు . సిలికా వల్ల మెరుపునిచ్చే ఫినిషింగ్ దెబ్బతింటుంది . కొంతకాలానికి బంగారు ఆభరణల వన్నె తగ్గిపోయి పేలవం గా కనిపిస్తాయి.
  • చింత పండు రసములో బంగారు ఆబరణాలు 30 నిమిషాలు నానబెట్టి ... టూత్ బ్రెష తో క్లీన్‌ చేసి మెత్తటి గుడ్డ తో తుడిస్తే దగదగ మెరుస్తా్యి . దీనిలో ఉన్న సిట్రిక్ యాసిడ్ వలన మురికి పోయి బంగారము మెరుస్తాయి .
  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, January 21, 2012

తెలుగు సంవత్సరాలు ఎన్ని ? అవి ఏవి ?,

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : తెలుగు సంవత్సరాలు ఎన్ని ? అవి ఏవి ?,
జ :

Add Image

తెలుగు సంవత్సరాలు మొత్తం 60.తెలుగు సంవత్సరాలు మొత్తం 60.
తెలుగు సం. పేరు.. క్రీ.శ. ....... క్రీ.శ. .......... క్రీ.శ.......... క్రీ.శ........ క్రీ.శ.
1 ప్రభవ......... 1747 - 1748.. 1807 - 1808.. 1867 - 1868... 1927 - 1928... 1987 - 1988
2 విభవ........ 1748 - 1749.. 1808 - 1809.. 1868 - 1869.. 1928 - 1929.... 1988 - 1989
3 శుక్ల.......... 1749 - 1750... 1809 - 1810.. 1869-1870.... 1929 - 1930......1989 - 1990
4 ప్రమోదూత...1750 - 1751.. 1810 - 1811.. 1870 - 1871.. 1930 - 1931... 1990 - 1991
5 ప్రజోత్పత్తి.... 1751 - 1752.. 1811 - 1812... 1871 - 1872 ... 1931 - 1932.... 1991 - 1992
6 అంగీరస.... 1752 - 1753... 1812 - 1813... 1872 - 1873... 1932 - 1933 .. 1992 - 1993
7 శ్రీముఖ..... 1753 - 1754... 1813 - 1814... 1873 - 1874... 1933 - 1934... 1993 - 1994
8 భావ.......... 1754 - 1755...1814 -1815... 1874 - 1875... 1934 - 1935... 1994 - 1995
9 యువ......... 1755 - 1756... 1815 - 1816... 1875 - 1876... 1935 - 1936... 1995 - 1996
10 ధాత.... 1756 - 1757... 1816 - 1817... 1876 - 1877... 1936 - 1937... 1996 - 1997
11 ఈశ్వర......... 1757 - 1758... 1817 - 1818... 1877 - 1878... 1937 - 1938... 1997 - 1998
12 బహుధాన్య.. 1758 - 1759.. 1818 - 1819,, 1878 - 1879,, 1938 - 1939 .. 1998 - 1999
13 ప్రమాది...... 1759 - 1760... 1819 - 1820... 1879 - 1880... 1939 - 1940... 1999 - 2000
14 విక్రమ ...... 1760 - 1761... 1820 - 182... 1880 - 1881... 1940 - 1941... 2000 - 2001
15 వృష........ 1761 - 1762... 1821 - 1822... 1881 - 1882... 1941 - 1942... 2001 - 2002
16 చిత్రభాను.. 1762 - 1763... 1822 - 1823... 1882 - 1883... 1942 - 1943... 2002 - 2003
17 స్వభాను.. 1763 - 1764... 1823 - 1824... 1883 - 1884... 1943 - 1944... 2003 - 2004
18 తారణ...... 1764 - 1765... 1824 - 1825... 1884 - 1885... 1944 - 1945... 2004 - 2005
19 పార్థివ...... 1765 - 1766... 1825 - 1826... 1885 - 1886... 1945 - 1946... 2005 - 2006
20 వ్యయ...... 1766 - 1767... 1826 - 1827... 1886 - 1887... 1946 - 1947... 2006 - 2007
21 సర్వజిత్తు. .. 1767 - 1768... 1827 - 1828... 1887 - 1888... 1947 - 1948... 2007 - 2008
22 సర్వధారి.. . 1768 - 1769... 1828 - 1829... 1888 - 1889... 1948 - 1949... 2008 - 2009
23 విరోధి ....... 1769 - 1770... 1829 - 1830... 1889 - 1890... 1949 - 1950... 2009 - 2010
24 వికృతి ........ 1770 - 1771... 1830 - 1831... 1890 - 1891... 1950 - 1951... 2010 - 2011
25 ఖర .......... . 1771 - 1772... 1831 - 1832... 1891 - 1892... 1951 - 1952... 2011 - 2012
26 నందన...... 1772 - 1773... 1832 - 1833... 1892 - 1893... 1952 - 1953... 2012 - 2013
27 విజయ........ 1773 - 1774... 1833 - 1834... 1893 - 1894... 1953 - 1954... 2013 - 2014
28 జయ ......... 1774 - 1775... 1834 - 1835... 1894 - 1895... 1954 - 1955... 2014 - 2015
29 మన్మథ...... 1775 - 1776... 1835 - 1836... 1895 - 1896... 1955 - 1956... 2015 - 2016
30 దుర్ముఖి.... 1776 - 1777... 1836 - 1837... 1896 - 1897... 1956 - 1957... 2016 - 2017
31 హేవిలంబి ..1777 - 1778... 1837 - 1838... 1897 - 1898... 1957 - 1958... 2017 - 2018
32 విలంబి ...... 1778 - 1779... 1838 - 1839... 1898 - 1899... 1958 - 1959... 2018 - 2019
33 వికారి........ 1779 - 1780... 1839 - 1840... 1899 - 1900... 1959 - 1960... 2019 - 2020
34 శార్వరి........ 1780 - 1781... 1840 - 1841... 1900 - 1901... 1960 - 1961... 2020 - 2021
35 ప్లవ .........1781 - 1782... 1841 - 1842... 1901 - 1902... 1961 - 1962... 2021 - 2022
36 శుభకృతు..1782 - 1783... 1842 - 1843... 1902 - 1903... 1962 - 1963... 2022 - 2023
37 శోభకృతు... 1783 - 1784... 1843 - 1844... 1903 - 1904... 1963 - 1964 ... 2023 - 2024
38 క్రోధి.......... 1784 - 1785.. 1844 - 1845... 1904 - 1905... 1964 - 1965... 2024 - 2025
39 విశ్వావసు... 1785 - 1786... 1845 - 1846... 1905 - 1906... 1965 - 1966... 2025 - 2026
40 పరాభవ..... 1786 - 1787... 1846 - 1847... 1906 - 1907... 1966 - 1967... 2026 - 2027
41 ప్లవంగ .......1787 - 1788... 1847 - 1848... 1907 - 1908... 1967 - 1968... 2027 - 2028
42 కీలక .........1788 - 1789... 1848 - 1849... 1908 - 1909... 1968 - 1969... 2028 - 2029
43 సౌమ్య....... 1789 - 1790... 1849 - 1850... 1909 - 1910... 1969 - 1970... 2029 - 2030
44 సాధారణ .... 1790 - 1791... 1850 - 1851... 1910 - 1911... 1970 - 1971... 2030 - 2031
45 విరోధికృతు.. 1791 - 1792... 1851 - 1852... 1911 - 1912... 1971 - 1972.... 2031 - 2032
46 పరీధావి..... 1792 - 1793... 1852 - 1853... 1912 - 1913... 1972 - 1973... 2032 - 2033
47 ప్రమాదీచ.. 1793 - 1794... 1853 - 1854... 1913 - 1914... 1973 - 1974... 2033 - 2034
48 ఆనంద ....1794 - 1795... 1854 - 1855... 1914 - 1915... 1974 - 1975... 2034 - 2035
49 రాక్షస .......1795 - 1796... 1855 - 1856... 1915 - 1916... 1975 - 1976... 2035 - 2036
50 నల .........1796 - 1797... 1856 - 1857... 1916 - 1917... 1976 - 1977... 2036 - 2037
51 పింగళ...... 1797 - 1798... 1857 - 1858... 1917 - 1918... 1977 - 1978... 2037 - 2038
52 కాళయుక్తి. . 1798 - 1799... 1858 - 1859.. 1918 - 1919... 1978 - 1979... 2038 - 2039
53 సిధ్ధార్థి .....1799 - 1800... 1859 - 1860... 1919 - 1920... 1979 - 1980... 2039 - 2040
54 రౌద్రి| ..... 1800 - 1801... 1860 - 1861... 1920 - 1921... 1980 - 1981... 2040 - 2041
55 దుర్మతి..... 1801 - 1802... 1861 - 1862... 1921 - 1922... 1981 - 1982... 2041 - 2042
56 దుందుభి... 1802 - 1803... 1862 - 1863... 1922 - 1923... 1982 - 1983... 2042 - 2043
57 రుధిరోద్గారి.. 1803 - 1804... 1863 - 1864... 1923 - 1924... 1983 - 1984 ... 2043 - 2044
58 రక్తాక్షి .........1804 - 1805... 1864 - 1865... 1924 - 1925... 1984 - 1985... 2044 - 2045
59 క్రోధన........ 1805 - 1806... 1865 - 1866... 1925 - 1926... 1985 - 1986 ... 2045 - 2046
60 అక్షయ .... 1806 - 1807... 1866 - 1867... 1926 - 1927... 1986 - 1987... 2046 -2047

  • ================================

visit My website > Dr.Seshagirirao - MBBS.-

Why do we feet hot on wearing Swetter,స్వెట్టర్ వేసుకుంటే వెచ్చగా ఉంటుందెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...్
ప్ర : స్వెట్టర్ వేసుకుంటే వెచ్చగా ఉంటుందెందుకు?
జ : స్వెట్టర్ ని జంతురోమాలతో చేస్తారు . ఆ రోమాలలో ఉండేది ' కెరోటిన్‌ ' అనే ప్రోటీన్‌ . ఈ ప్రోటీన్‌ ఉష్ణోగ్రతను నిలిపి ఉంచే గుణము కలిగిఉంటుంది . ఫలితముగా శరీర ఉష్ణోగ్రత బయట ఉన్న చల్ల గాలితో కలిసి పోకుండా అక్కడే నిలిపిఉంచి వెచ్చదనము కలిగిస్తుంది . కెరోటిన్‌ పోగులు మెలికలు తిరిగి ఉంటాయి. . . ఆ మెలికలు మధ్య గాలి నిలిచి ఉండి ఉష్ణోగ్రతను అటునుంది ఇటు ... ఇటునుండి అటు పోనివ్వక వెచ్చదనాన్ని అలాగే నిలిచి ఉంచుతుంది .

  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, January 11, 2012

Andhrapradesh is called as Trilinga desham-Why?,ఆంధ్రప్రదేశ్ ని త్రిలింగదేసమని ఎందుకన్నారు ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : మన ఆంధ్రప్రదేశానికి త్రిలింగదేశమని పేరు ఉంది . అంటే ఆంధ్ర , రాయలసీమ ,తెలంగాణ అని అర్ధమా?

జ : 14 వ శతాబ్దములో త్రిలింగ దే్శమని ఆంద్రప్రదేశాన్ని పిలవడము మొదలు పెట్టారు . శ్రీశైలము , ద్రాక్షారామము , కాళహస్తి - ఈ మూడు పుణ్యక్షేత్రాలలో మూడు శివలింగాలూ ఈ మూడు ప్రాంతాల ప్రజలని రక్షిస్తాయని .. అవిధము గా త్రిలింగదేశమని అన్నారు . అంతేకాని ఆంధ్ర , రాయలసీమ , తెలంగాణ అని అర్ధము కాదు .
  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, January 09, 2012

మానవులు జీవితము అశాశ్వితమని తెలిసి పాపాలు చేస్తారేమి?,Human do sins even after knowing life not permanent-why?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

Q: జీవితము అశాశ్వితమని తెలిసి కూడా మానవులు పాపాలు చేస్తారేమి ?

A : పుణ్యము చేస్తే జన్మలేదు . జీవితము శాశ్వితము కావాలంటే పాపాలు చెయ్యాలి . . . చేస్తే మళ్ళి జన్మ లభిస్తుంది . జీవితాన్ని ఆనందించవచ్చును . మళ్ళీ పాపాలు చేస్తే మళ్ళీ ఏదో ఒక జన్మ ఉంటుందనే గ్యారంటీ మన ఆద్యాత్మిక ధర్మాలు చెప్పబట్టే .
  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sunday, January 08, 2012

Internet , ఇంటర్నెట్ , అంతర్జాలము ,ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఏమిటి? .అది ఎలా పనిచేస్తుంది .

జ : ప్రపంచ వ్యాప్తం గా ఉండే కంప్యూటర్లనన్నింటినీ కలిపే వ్యవ స్థనే 'ఇంటర్నెట్‌-Internet' అంటారు. దీనినే తెలుగులో 'అంతర్జాలం' అని సంబోధిస్తారు. మరింత వివరంగా చెప్పాలంటే ఇంటర్నెట్ నెట్ వర్క్ లను కలిపే నెట్ వర్క్. ఈ వ్యవస్తలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించుకొనేటందుకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనే నియమావళిని ఉపయోగిస్తారు. ఆంగ్లంలో Internet అని రాస్తున్నప్పుడు మొదటి అక్షరం అయిన "I"ని ఎల్లప్పుడు కేపిటల్ లెటర్ గానే రాయవలెను. .

1969 సంవత్సరంలో అమెరికా భద్రతా విభాగం అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్స అయిన 'ఆర్పా' (ఏఆర్‌ పిఏ) లో తొలిసారిగా ఇంటర్నెట్‌ సృష్టించబడింది.
తర్వాత 1990 సంవత్సరంలో టిమ్‌ బెర్నెల్స్‌ లీ అనే శాస్త్రవేత్త స్విట్జర్లాండ్‌ లోని సెర్న్‌ (సిఇఆర్‌ఎన్‌) వద్ద 'వరల్డ్‌ వైడ్‌ వెబ్‌'ను సృష్టించాడు. దీనినే డబ్ల్యు, డబ్ల్యు. డబ్ల్యు.డబ్ల్యు అని అంటారు. ప్రస్తుతం ఇంట ర్నెట్‌ను మనం సర్వీస్‌ ప్రొవైడర్లకు కొంత మొత్తం డబ్బును చెల్లించి ఇళ్లల్లోనూ, కార్యా లయాల్లోనూ వాడుకోవచ్చును. ఇలా ప్రపం చంలోని కంప్యూటర్లను అన్నింటినీ కలిపే వ్యవస్థనే మనం నేడు 'ఇంటర్నెట్‌' అని పిలు చుకుంటున్నాము.

ఈ వ్యవస్థలో ఉన్న కంప్యూటర్లు ఒక దానితో ఒకటి సంభాషించుకునేందుకు ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ అనే నియమావళిని ఉపయోగిస్తారు. ఇంటర్నెట్‌కు అనుసంధాన మైన ప్రతి కంప్యూటర్‌ ఒక సంఖ్యను కలిగి ఉంటుంది. దీనినే 'ఐపీ అడ్రస్‌' అని పిలు స్తుంటారు. ఇంటర్నెట్‌లోని సందేశాలన్నీ ఈ ఐపి చిరునామా ఆధారంగానే పంపబడతాయి.ఈ వ్యవస్థలో మూడు ముఖ్య భాగాలు ఉంటాయి . 1.Client computer(మన కంప్యూటర్ ) , 2.Browser(అనుసందానము చేసే సాప్ట్ వేర్) 3.server computer(మనకు సందేశాలు పంపే కంప్యూటర్).ఈ సూత్రాన్నే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటారు. ఇందులో ఏఒక్కటి లేకపోయినా ఈ పక్రియ పనిచేయదు . ఇక ఈ ఇంటర్నెట్‌ ద్వారా మనం ఎన్నో పనులను ఇంటి నుంచే చేసుకోవచ్చు. పాతకాలంలో ఉత్తరాలు రాసుకునేవారు. అవి రెండు రోజులకో, మూడు రోజులకో చేరేవి. అలా మనం ఉత్తరం రాసినవారు మనకు తిరిగి జవాబివ్వాలంటే మరో రెండు, మూడు రోజులు పట్టేది. కానీ ఇప్పుడాసమస్య లేదు. సమాచారాన్నంత టినీ కంప్యూటర్ల సహాయంతో మనం క్షణాల్లో చేరవేయాలనుకున్న వారికి చేరవేయవచ్చు. ఇంట్లోనే కూర్చుని మార్కెటింగ్‌, షాపింగ్‌ చేయవచ్చు. సినిమా టిక్కెట్లు,రైల్వే టిక్కెట్లు బుక చేసుకోవచ్చు.

e-మెయిల్‌ (ఎలక్ట్రానిక మెయిల్‌) ద్వారా మన క్షేమ సమాచారాలను దేశ విదేశాలలో ఉన్న బంధువులకు నిముషాల్లో పంపవచ్చు. అలాగే ఇంటర్నెట్‌ సౌకర్యం ద్వారా మన కంప్యూటర్‌కు వెబ్‌ కెమెరాను అమర్చుకొని దేశ విదేశాలలో ఉన్న స్నేహితులతోనో, బంధువులతోనో సంభాషించవచ్చు. ఈ వెబ్‌ కెమెరాను మన కంప్యూటర్‌కు సంధించడం వల్ల మనం నెట్‌ ద్వారా మాట్లాడేటపðడు వారు మనకు కంప్యూటర్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమై, (వారికి వెబ్‌ కెమెరా ఉన్నట్లయితేనే) మన ముందు నిలబడి మాట్లాడిన అనుభూతి కలుగుతుంది. అలాగే కొత్త కొత్త వారితో 'ఛాటింగ్‌' చేయవచ్చు. ఈ సౌకర్యం వల్ల మనం ఇంట్లోనే కూర్చుని ప్రపంచంలో ఏ మూలనున్నవారితోనైనా (వారు మనకు పరిచయం లేకున్నా) గంటలతరబడి బాతాఖానీ కొట్టవచ్చు. ఇక ఈ ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని మీరు కలిగి వుంటే లైబ్రరీకి వెళ్ళి దినపత్రికలు, ప్రముఖుల జీవిత చరిత్రలు చదవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అన్నిటినీ మనం ఇందులోనే చదివి విషయసేకరణ చేయవచ్చు. మనం కోరుకున్న జిల్లా వార్తలను కూడా దినపత్రిక వెబ్‌సైట్లను దర్శించి మనం తెలుసుకోవచ్చు. ఇందుకోసం 'వరల్డ్‌ వైడ్‌ వెబ్‌' ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో వెబ్‌సైటులు, బ్లాగులు లాంటి అనేక సౌకర్యాలుంటాయి. వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ తర్వాత ఎక్కువగా ఉపయోగించేది ఈ-మెయిల్స్‌నే. ఇందులో సమాచారాన్ని పంపవచ్చు, అందుకోవచ్చు. ఇపðడు ఇంటర్నెట్‌లో అన్ని భాషల్లో ప్రత్యేక వెబ్‌ సైట్లు కుప్పలు తెప్పలుగా అందుబాటులోకి వచ్చాయి.

టెక్నాలజీ పుణ్యమా అని ఇంటర్నెట్‌ వల్ల ఎన్నో లాభాలున్నాయి. అలాగే ఎన్నో నష్టాలు కూడా ఉన్నాయి. మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే స్థాయిలో ఉండటం వల్ల దీనిని సద్వినియోగానికి ఉపయోగించాలి. అందుకనే పిల్లలు నెట్‌ ముందు గంటలతరబడి కూర్చుని వుంటే పెద్దలు వారిని ఓ కంట కనిపెడుతూ ఉండడం శ్రేయస్కరం. వాళ్ళు నెట్‌ను ఏయే అవసరాలకు వినియోగిస్తున్నారో గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రుదే! ఒకవేళ వారు చెడుదారిలో నడుస్తుంటే ప్రారంభంలోనే వారికి తగు సలహాలనిచ్చి ఎడ్యుకేట్‌ చెయ్యాలి. గంటల తరబడి నెట్‌ ముందు కూర్చునేవారు క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అలాగే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లను ఎక్కువగా సందర్శించేవారు గుండెజబ్బులు, మానసిక రుగ్మతల బారిన పడే అవకాశాలుకూడా ఉన్నాయని కూడా హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

అందుకే బాలలూ! ఇంటర్నెట్‌ వల్ల లాభనష్టాలు సమంగా ఉన్నాయి. మీరు దానిని సద్వినియోగం చేసుకుంటే ఎంతో విజ్ఞానాన్ని ఆర్జించి మీ భవితలను బంగారు మయం చేసుకోవచ్చు. పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించవచ్చు. మీ సబ్జెక్ట నాలెడ్జిని ఇంప్రూవ్‌ చేసుకునేందుకుకూడా ఇంటర్నెట్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇలా లాభనష్టాలు కలయిక అయిన ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునేదాన్ని బట్టి మనకి ఫలితాలు లభిస్తాయి. మీరు ఈ ఇంటర్నెట్‌ ద్వారా మంచి విజ్ఞానాన్ని సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు కదూ!

  • Courtesy with - బాలప్రభ - ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ .

  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

పదార్ధము అంటే ఏమిటి? ఎన్నిరకములున్నవి?, What is matter? how many types?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

Q : పదార్ధము అంటే ఏమిటి?

A : పరమాణువులు కలిసి అణువులు గా మారుతాయి. ఈ అణువులన్నీ కలిసి పదార్ధం ను ఏర్పరుచుతాయి. విశ్వము లో అన్నిరకాల పదార్ధాలు (సజీవ , నిర్జీవ ) సూక్ష్మమైన అణువులతో , ఈ అణువులు అంతకంటే సూక్ష్మమైన పరమాణువులతో నిర్మితమై ఉంటాయి. అంటే పదార్ధాన్ని విడగొడితే అణువులు , వీటిని విడగొడితే పరమాణువులు ఏర్పడతాయి.

దాల్టన్‌ సిద్ధాంతము ప్రకారము పదార్ధములో విభజించడానికి వీలుకాని భాగమే ప్రమాణువు (sub-atomic particle). లాటిన్‌ భాషలో ' atom ' అంటే " విభజించడానికి వీలుకానిది " అని అర్ధము ... కానీ ఆతర్వాత వచ్చిన వివిధ ప్రతిపాదనల వల్ల పదార్ధములో అతిచిన్న భాగము అణువు , పరమాణువు లు కాదని , ఇందులో కుడా ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలున్నాయని గుర్తించారు . వీటినే ప్రాధమిక కణాలు అంటారు . అవి :
  • ఎలక్ ట్రాన్‌ -electron(e-),
  • ప్రోటాన్‌-proton(p+),
  • న్యూట్రాన్‌- neutron(n^0).

పదార్ధము(matter): -->అణువులు -->పరమాణువులు -->ఎలక్ట్రాన్ +‌-->న్యూట్రాన్‌ +-->ప్రోటాన్‌.

అణువులు - Atoms : ఇవి స్థిరమైనవి . రసాయనికముగా జడత్వాన్ని ప్రదర్శిస్తాయి.

ప్రమాణువు - sub-atomic particles : ఇవి అస్థిరమైనవి . స్థిరత్వముకోసం రసాయనిక చర్యలో పాల్గొంటాయి కాబట్టి ఇవి చురుకైనవి . అస్థిరమైన పరమాణువులు స్థిరమైన అనువులుగా మారుతాయి. ఉదా: H(sub- atomic particles)+H(sub-atomic particles)---->H2 (atom). ఈ విధముగా పరమాణువులన్నీ కలిసి అణువులను , ఈ అణువులన్నీ కలిసి పదార్ధాన్ని ఏర్పరుస్తాయి.
  • పదార్ధము - రకాలు :
అణువుల మధ్య ఉండే అంతర్గత ఆకర్షణ బలాలను ఆధారము చేసుకొని పదార్ధాలను వాటి స్థితిని బట్టి 3(మూడు)రకాలుగా విభజించవచ్చును.

  • 1.ఘన పదార్ధాలు (solids),
  • 2.ద్రవ పదార్ధాలు (liquids),
  • 3.వాయు పదార్ధాలు (gases),

ఘన పదార్ధాలు(s) : ఈ రకమైన పదార్ధాల్లొని అణువుల మద్య ఆకర్షణ బలాలు బలముగా ఉంటాయి. వీటికి నిర్ధిష్టమైన ఆకృతి వుంటుంది . ఉదా: ఇసుక , ఉప్పు .

ద్రవ పదార్ధాలు(L) : ద్రవ పదార్ధాలలోని అణువులు మధ్య అంతర్గత ఆకర్షణ బలాలు బలహీనము గా ఉంటాయి. వీటికి నియమితమైన ఆకారము లేదు . ఇవి స్థిరమైన ఘన పరిమాణాన్ని ఆక్రమిస్తాయి. ఉదా : నీరు , పాలు ,

వాయు పదార్ధాలు(g) : వాయు పదార్ధములోని అణువుల మధ్య ఆకర్షణ బలాలు అతి బలహీనముగా ఉంటాయి. అణువులు స్వేచ్చగా తిరుగుతాయి. వీటికి క్రమరహిత చలనము ఉంటుంది. ఉదా : గాలిలో ఆక్షిజన్‌ (O2) వాయువు , కార్బనండయాక్షైడ్ (CO2) వాయువు .

source : an article / Vasam Srinivas (Lecturer )

కేంద్రము (కణిక) - nucleus.
పదార్ధము - matter
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, January 06, 2012

Why do buffellos get into mud frequently?, పశువులు బురదను ఎందుకు పూసుకుంటాయి?

  • image : courtesy with google.com

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : పశువులు బురదను ఎందుకు పూసుకుంటాయి?

జ :
గేదెలు బురదనీరు కనబడగానే గబగబా దిగి తలపైకి పెట్టి కుర్చుంటాయి . అటుఇటు దొర్లి బురదను ఒళ్ళంతా పట్టించుకుటాయి. మనకది అంతగా ఇష్టపడకపోయినా వర్మ ఆరోగ్యము కోసము గేదెలు చేసే పని ఇది . చర్మము మీదనున్న సూక్ష్మజీవులు , పేలు , గోమారులు వంటి కీటకాలను వదిలించుకునేందుకు నీటిలో ముణుగుతాయి. దాంతో ఆ జీవులు వదిలిపోతాయి. ఈ విదంగా ఒంటికి బురద పట్టించుకోవడము ద్వారా కుట్టే కీటకానుండి రక్షణ పొందుతాయి. అడుసు తొక్కనేల కాలు కడగనేల.అనే సామెత వాటికి తెలీదు ... పాపం ఇంటికి చేరిన గేదెలను యజమాని కడిగి వాటిని చర్మాన్ని శుబ్రము చేస్తాడు . మనలో ఉండే లోపాల్నే మనం ఇతరుల్లో గమనిస్తాము. మన చుట్టూ బురద కనిపిస్తూంది, అంటే అది మనలోనే ఎక్కడో ఉందన్న మాట.

  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

నోముకి వ్రతానికి తేడా ఏమిటి?, Difference between Nomu and Vratamu?(Telugu).

  • నోము చేయుచున్న .. రూపవతి వందన .

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

భగవంతుని పూజించడానికి అనేకానేక మార్గాలలో నోము , వ్రతము లు అనేవి ముఖ్యము గా స్త్రీలు పాటించేవాటిలో సాధారణమైన భక్తి విధానాలు . భగవంతుడు - దేవుడు అనేది మానవుని నమ్మకము . దండము పెట్టి ... దక్షిణ ఇస్తే చేసే పాపాలు పోయి పుణ్యము వస్తుందంటే నవీనకాలము లో శాస్ర ప్రరంగా నమ్మకము కుదరడలేదు . ఏది ఏమైనా మన ప్రాచీన గ్రంధాలు లలో ఉన్న ప్రకారము ....

నోము : మనస్సుని కేవలము భగవంతుని పైనే లగ్నము చేసి స్వామిని పూజించి ధ్యానము చేసేది - నోము . ఉదా:శ్రావణమంగళవారం నోము , అట్లతద్ది నోము . నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉన్నది. స్త్రీలకు బాల్యము నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప జేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును. ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్యప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు కలవు. ఈ నోములలో నిగూఢమై యున్న మొదటి ధర్మము వితరణం అనగా ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఇతరులకు ఇవ్వడము.

వ్రతము : అత్యంత నియం నిష్టలతో మంత్రోచ్చాటనలతో ధూపదీప నైవేద్యాలతో భగవతుని (దేవుని లేదా దేవతను )సేవించేది వ్రతము . వ్రతము ... అనగా దీర్ఘకాలాను పాలనీయమైన సంకల్పము. సంకల్పము అనగా "ఇది నేను చేయవలెను, విడవరాదు" అనుకొనుట. నియమ-నిబంధనలతో ఉపవాసము తో చేసే పూజ లేక అరాధన . వ్రతము లో సంకల్పము , దీక్ష , కథాపఠనము తప్పనిసరి . వ్రతము చేయుటవలన సమస్త పాపములు పోయి ... పుత్ర పౌత్ర సంపదాభివృద్ధి , సర్వ సౌభాగ్యములు కలుగును. ఉదా: వరలక్ష్మీ వ్రతం. సావిత్రీ వ్రతం. గౌరీ వ్రతం. మున్నగునవి .
  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, January 04, 2012

What is the history of Salt?, ఉప్పు చరిత్ర ఏమిటి?

  • image : courtesy with Eenadu news paper.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

  • Salt ,ఉప్పు

ఒకప్పుడు ఉప్పు విలువై వస్తువు... దేశాలను సంపన్నం చేసిన ధనం... సైనికులకి అదే జీతం..

అబ్బో... చెప్పుకోవాలంటే ఉప్పు గొప్ప ఒప్పుకోక తప్పనిదే! ఒకప్పుడు అది డబ్బుతో సమానం. ఇది దేశాల ఆర్థిక స్థితిగతులనే మార్చింది. 'జీతం' అనే పదం పుట్టడానికి కారణమయ్యింది. కొన్ని దేశాల్లో సైనికులకు ఉప్పునే జీతంగా ఇచ్చేవారు మరి! పురాతన కాలంలో 'తెల్ల బంగారం' అని పిలుచుకునే వారు. ఇక మన దేశంలో ఉప్పు సత్యాగ్రహం ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో గుర్తుంది కదా? బ్రిటిష్‌వారు ఉప్పుపై విధించిన పన్నుకి వ్యతిరేకంగానే గాంధీజీ దీన్ని చేపట్టారు.

ఇంతకీ ఉప్పు వాడకం ఎప్పుడు మొదలైంది? రాతి యుగంలో ఆదిమానవులు పచ్చిమాంసం తినేవారు కాబట్టి ఉప్పు అవసరమే ఉండేది కాదు. పది వేల ఏళ్ల క్రితం వ్యవసాయం మొదలుపెట్టి వరి, గోధుమ లాంటి ఆహార ధాన్యాలు పండించడం మొదలుపెట్టగానే ఉప్పదనం కావల్సివచ్చింది. ఉప్పుని మొదట చైనాలో వాడినట్టు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 6000లో చైనాలోని యుంచెంగ్‌ అనే ఉప్పునీటి సరస్సు నుంచి ఉప్పుని తయారు చేశారని చెబుతారు. ఆసియాలో క్రీస్తు పూర్వం 4,500 నుంచి వినియోగంలో ఉన్నట్టు అంచనా. ఈజిప్టువాసులు మమ్మీలను నిలవ ఉంచేందుకు వాడేవారు.

15వ శతాబ్దంలో పోలాండ్‌ ఉప్పు వల్లే అత్యంత ధనవంతమైన దేశంగా మారింది. ఉప్పు గనుల నుంచి ఇతర దేశాలకు సరఫరా చేసి బోలెడు డబ్బు దండుకునేది. తరువాత జర్మన్లు సముద్రపు ఉప్పుని తయారు చేయడంతో అందరికీ అందుబాటులోకి వచ్చింది. రోమన్‌ చక్రవర్తులైతే సైన్యానికి కొన్నాళ్ల పాటు ఉప్పునే నెల జీతంగా ఇచ్చారు. జీతానికి వాడే Salary పదం పుట్టుకకు కారణం ఉప్పే. Salarium అనే లాటిన్‌ పదం నుంచి ఇది వచ్చింది. ఆ పదానికి అర్థం Payment in Salt.

  • మీకు తెలుసా?
* ప్రపంచ వ్యాప్తంగా 210 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉప్పు ఉత్పత్తి జరుగుతోంది.
* ఉత్పత్తిలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న దేశాలు అమెరికా, చైనా, జర్మనీ, ఇండియా.
* మన దేశంలో ఏటా 14.5 మిలియన్‌ టన్నుల ఉప్పుని ఉత్పత్తి చేస్తున్నారు.

  • Source : courtesy with Eenadu news paper.

  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-