Monday, June 07, 2010

నెగిటివ్‌లో తేడాలేల?, Differences in Negative film-Why?




ప్రశ్న: కెమేరాతో ఫొటో తీసిన తర్వాత డెవలప్‌ చేసి నెగిటివ్‌ని చూస్తే ఫొటోలో నల్లని ప్రాంతాలు తెల్లగా, తెల్లనివి నల్లగా ఉంటాయెందుకు?

జవాబు: నలుపు తెలుపు ఫొటోల్లో ఈ విషయం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. నలుపు తెలుపు ఫిల్మ్‌ మీద సిల్వర్‌ బ్రొమైడు లేదా సిల్వర్‌ అయొడైడ్‌ అనే రసాయన పూత ఉంటుంది. కెమేరాను క్లిక్‌ చేసినప్పుడు వస్తువు నుంచి వచ్చే కాంతి కెమేరా కటకం ద్వారా ఫిల్మ్‌ మీద పడుతుంది. దాని మీద ఉండే పూతకి కాంతి సమక్షంలో వియోగం (photo dissociation) చెందే లక్షణం ఉంది. అంటే కాంతి ఎక్కువగా పడిన ప్రాంతం పారదర్శకంగా మారుతుంది. ఇక డెవలప్‌ చేయడమంటే ఫిల్మ్‌లోని పూతపై జరిగిన రసాయనిక చర్యను తొలగించడమే అనుకోవచ్చు. అప్పుడు కాంతి ఎక్కువగా పడిన ప్రాంతం నల్లగా మారుతుంది. మన శరీరం లేదా వస్తువుల మీద తెల్లని భాగాలు (పళ్లు, కంటిపాప, తెల్ల దుస్తులు, గోడలు...) నుంచి ఎక్కువ కాంతి పరావర్తనం చెందుతుంది కాబట్టి ఆయా ప్రాంతాలు నెగెటివ్‌లో నల్లగా కనిపిస్తాయి. అలాగే శరీరం లేదా వస్తువుల మీద ఉండే నల్లని భాగాలు (తలవెంట్రుకలు, నల్లని దుస్తులు, కనుగుడ్లు, గొడుగులు...) తమ మీద పడిన కాంతిని ఎక్కువగా శోషించుకుని తక్కువ కాంతిని పరావర్తనం చేస్తాయి. అలా తక్కువ కాంతి పడిన భాగాలు నెగెటివ్‌లో తెల్లగా కనిపిస్తాయి.

  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

1 comment:

  1. I ԁo not even knοw how I ѕtоppеd uρ гight here, but I aѕѕumed thiѕ post ωаs gгеat.
    I ԁon't realize who you might be however definitely you are going to a well-known blogger if you happen to are not already. Cheers!

    my web-site apple laptop

    ReplyDelete

your comment is important to improve this blog...